By: ABP Desam | Updated at : 22 Jan 2022 07:23 AM (IST)
బంగారం, వెండి ధరలు (Representational Image)
Gold Price Today In Hyderabad 22 January 2022: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. తాజాగా హైదరాబాద్‌లో రూ.100 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,650 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,800గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.500 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,300 అయింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,300కు ఎగబాకింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 కు ఎగబాకింది. ముంబయిలో రూ.50 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,640 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640 అయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.120 పెరగడంతో తులం ధర రూ.45,940 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,120కు చేరింది.
తగ్గిన ప్లాటినం ధర
మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర వరుసగా మూడోరోజు పెరిగింది. నేడు ధర తగ్గడంతో హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.24,740 అయింది. ఢిల్లీలో రూ.41 మేర తగ్గడంతో రూ.24,740కి పతనమైంది. ఇక చెన్నైలో రూ.18 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.24,740 గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం హైదరాబాద్ ధర వద్దే మార్కెట్ అవుతోంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు
Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య
LIC Policy: ఆడపిల్ల పెళ్లి కోసం దిగులొద్దు, ఈ పాలసీ తీసుకుంటే ఎల్‌ఐసీ మీకు రూ.31 లక్షలు ఇస్తుంది!
Tax Notice: ఇల్లు కొన్నాక 20 శాతం TDS కట్టమంటూ నోటీస్ వచ్చిందా, తప్పు ఎక్కడ జరిగిందో అర్ధమైందా?
Coca Cola Liquor: కోకా కోలా నుంచి మొదటి లిక్కర్ బ్రాండ్ - రేటెంత, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
Adani Group Stocks: జాక్‌పాట్ కొట్టిన అదానీ ఇన్వెస్టర్లు, ఐదు రోజుల్లోనే రూ.20,000 కోట్ల లాభం
Latest Gold-Silver Prices Today: జర్రున జారుతున్న గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?
Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం
Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్
Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్
/body>