అన్వేషించండి

Forex Reserves: దేశంలో పేరుకుపోతున్న పసిడి రాసులు, రెండో వారంలోనూ తగ్గిన విదేశీ ద్రవ్య నిల్వలు

Foreign Currency: ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం భారత్‌లోని విదేశీ మారక నిల్వలు ఏప్రిల్ 12న 648.562 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

Foreign Currency Reserves in India: రెండు వారాల క్రితం రికార్డ్‌ స్థాయికి చేరిన 'భారతదేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలు', ఆ తర్వాత వరుసగా రెండో వారంలోనూ తగ్గాయి. పసిడి రాసులు మాత్రం భారీగా పెరిగాయి. భారతదేశంలో ఫారిన్‌ కరెన్సీ రిజర్వ్స్‌పై తాజా గణాంకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం విడుదల చేసింది. 

ఆర్‌బీఐ ఇచ్చిన కొత్త డేటా ప్రకారం, 2024 ఏప్రిల్‌ 19తో ముగిసిన వారంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వలు (India's Forex Reserves) 2.82 మిలియన్‌ డాలర్లు తగ్గి 640.33 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీనికి ముందు ఈ మొత్తం 643.16 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతకుముందు, ఏప్రిల్ 12న, ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం భారత్‌లోని విదేశీ మారక నిల్వలు 648.562 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, జీవితకాల గరిష్ట రికార్డ్‌ (Forex reserves all-time high record). ఈ రికార్డ్‌కు ముందు, ఫారెక్స్‌ రిజర్వ్స్‌ 2021 అక్టోబర్‌లో అత్యధికంగా 645 బిలియన్ డాలర్లకు ‍‌చేరుకున్నాయి. రెండున్నర సంవత్సరాల తర్వాత గానీ ఈ రికార్డ్‌ను అధిగమించడం కుదరలేదు.

సమీక్ష కాలంలో విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించాయి. 2024 ఏప్రిల్‌ 19తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 3.79 బిలియన్ డాలర్లు తగ్గి 560.86 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 

బంగారం నిల్వల ప్రకాశం
సమీక్ష కాలంలో ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు భారీగా జంప్‌ చేశాయి. RBI గోల్డ్‌ ఛెస్ట్‌ (Gold reserves In India) విలువ 1.01 బిలియన్ డాలర్లు పెరిగి 56.80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (IMF) డిపాజిట్ చేసిన నిల్వలు 2 మిలియన్ డాలర్లు తగ్గి 4.63 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.

రూపాయి విలువ (Indian Rupee Value)
శుక్రవారం (17 ఏప్రిల్‌ 2024) ట్రేడింగ్‌లో, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ (Dollar To Rupee Exchange Rate) 2 పైసలు బలపడి 83.35 వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో ఇది 83.37 స్థాయిలో ఉంది.

సమీక్ష కాలంలో, అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. అదే సమయంలో, డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి బలహీనపడింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కరెన్సీ మార్కెట్‌లో జోక్యం చేసుకుందని, అమెరికన్‌ డాలర్లను భారీగా విక్రయించిందని, ఆ కారణంగానే భారత్‌లో విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గాయని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. గత రెండు వారాల్లోనే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏకంగా 8.23 బిలియన్ డాలర్లు తగ్గడం దీనికి అద్దం పడుతోంది. కరెన్సీ మార్కెట్లలో రూపాయి పతనాన్ని ఆపడానికి ఆర్‌బీఐ జోక్యం చేసుకున్నప్పుడల్లా విదేశీ మారక నిల్వల్లో మార్పు కనిపిస్తుంది.

మరో ఆసక్తికర కథనం: డబ్బులు అత్యవసరమా? అయితే బజాజ్ ఫైనాన్స్‌ ఇన్‌స్టెంట్ పర్సనల్ లోన్ ట్రై చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget