Fake Paytm App Alert: నకిలీ పేటీఎం యాప్‌తో డబ్బు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్‌లోనే పేటీఎం నకిలీ యాప్‌తో కొందరు దుండగులు డబ్బులు కొట్టేశారు. ఈ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిని ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.75 వేల వరకు నగదు రికవరీ శారు.
కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ వ్యాప్తంగా డిజిటలైజేషన్ జోరందుకుంది. ఆర్థిక లావాదేవీలను చేపట్టేందుకు ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే అదనపుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరికి తోడుగా నకిలీ యాప్ దొంగలూ తయారయ్యారు! అమాయకులు, బిజిగా ఉండేవారిని లక్ష్యంగా ఎంచుకొని డబ్బులు లాగేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోనే పేటీఎం నకిలీ యాప్‌తో కొందరు దుండగులు డబ్బులు కొట్టేశారు. ఈ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిని ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.75 వేల వరకు నగదు రికవరీ శారు. ఏదేమైనా డిజిటల్ మోసాలు జరగడం అధికారులు, పోలీసులకు ఆందోళనకరంగా మారింది. ఉదాహరణకు నకిలీ పేటీఎం యాప్స్ ద్వారా కొందరు డబ్బులు చోరీ చేస్తున్నారు. ఈ స్ఫూప్ యాప్స్ నిజంగానే పేటీఎం మాదిరిగా ఉంటాయి. నిజమైందేదో, నకిలీదేదో గుర్తుపట్టని విధంగా కనిపిస్తుంటాయి.
ఇండోర్, చత్తీస్‌గఢ్‌లోనూ ఇలాంటి మోసాలే జరిగాయి. ఓ మోసగాడు వేల రూపాయల విలువైన సాల్మన్ కొనుగోలు చేసి వ్యాపారి ఫోన్ నంబర్, ఇతర వివరాలతో ఫేక్ పేమెంట్ స్క్రీన్‌తో మోసం చేశాడు. ఆ తర్వాత అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఈ ఫేక్ పేటీఎం యాప్‌లో మోసగాళ్లు వివరాలను నమోదు చేస్తారు. ఆ తర్వాత యాప్ విజయవంతంగా ఓ నకిలీ పేమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. అది అచ్చం ఒరిజినల్‌గా అనిపిస్తుంది. దాంతో వ్యాపారులు డబ్బు వచ్చిందనే అనుకుంటారు. ఎక్కువ లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు వెంటనే ఫోన్లో సందేశాలు చూసుకోవడం లేదు. ఆ తర్వాత చూసుకుంటే ఖాతాలో లోటు కనిపిస్తోంది.
ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. సందేశాలు చూసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.
Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Also Read: Cyber Crime: మీ మొబైల్ ఫోన్ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్ లిస్టింగ్ సూపర్‌హిట్.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?