By: Rama Krishna Paladi | Updated at : 22 Aug 2023 03:28 PM (IST)
ఫేస్‌బుక్ ( Image Source : Getty )
Meta Warning:
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) ఉద్యోగులను కఠినంగా హెచ్చరించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీని పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
కరోనా వైరస్ ఆవిర్భావంతో ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) సంస్కృతి పెరిగింది. ఉత్పత్తి పెంచేందుకు కంపెనీలు ఇంటి వద్ద నుంచే పనిని ప్రోత్సహించాయి. గతేడాది నుంచి కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రమ్మని కోరుతున్నాయి. ఒక వేళ వీలు కాకుంటే వారంలో కనీసం మూడు రోజులైనా రావాలని అడుగుతున్నాయి. దీనిని కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఆఫీసులకు రావడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు.
వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఫేస్‌బుక్ నిబంధన పెట్టింది. కొందరు ఉద్యోగులు దీనిని లైట్ తీసుకున్నారని సమాచారం. ఇలాంటి వారికి మెటా మానవ వనరుల అధినేత లోరీ గోలెర్ మెమోలు జారీ చేశారని బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్టు చేసింది.
'ఇక నుంచి మేనేజర్లు ప్రతి నెలా బ్యాడ్జ్, స్టేటస్ టూల్ సమాచారాన్ని సమీక్షిస్తారు. నిబంధనలు పాటించని వారిని ప్రశ్నిస్తారు. స్థానిక నిబంధనలను పరిగణనలోకి తీసుకొనే పనిచేస్తారు' అని మెమోలో ఉన్నట్టు తెలిసింది.
ప్రాంతాలను బట్టి మెటా నిబంధనలు అమలు చేస్తోంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలన్న నిబంధన ఉంది. యాపిల్, గూగుల్ సైతం ఇలాగే చేస్తున్నాయి. భారత్‌లోనూ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి ఐటీ కంపెనీలు ఇదే దారిలో నడుస్తున్నాయి.
ఉద్యోగులు ఆఫీస్‌లో పని చేయాలన్న నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదని గోలెర్ స్పష్టం చేశారు. పదే పదే ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెర్ఫామెన్స్ రేటింగ్ తగ్గిస్తామని, సరిదిద్దుకోకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని తెలిపారు.
అందరు ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని మెటా చెప్పడం లేదు. కొందరికి రిమోట్ పాలసీని అమలు చేస్తోంది. రెండు నెలలకు నాలుగు రోజులు మాత్రమే రావాలని చెబుతోంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ పనితీరులో మార్పులు వస్తాయని అంటోంది. ఇక ఆఫీసులో పని చేసేందుకు అంగీకరించిన ఉద్యోగులకు బలమైన మద్దతు, విలువైన అనుభూతిని అందిస్తామని వెల్లడించింది. ఎక్కడెడక్క రిమోట్ వర్క్ అమలు చేయాలన్న దానిపై చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నామని వెల్లడించింది.
Petrol-Diesel Price 29 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Group, ICICI Lombard, Emami
Gold-Silver Price 29 September 2023: ఆరు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
/body>