అన్వేషించండి

Cryptocurrency Prices: మందగమనంలో క్రిప్టో మార్కెట్లు - BTC ఎక్కడిదక్కడే!

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి అమ్మకాలు చేపట్టారు.

Cryptocurrency Prices Today: 

క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.14 శాతం పెరిగి రూ.24.42 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.47.58 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.10 శాతం తగ్గి రూ.1,53,213 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.42 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.12 శాతం పెరిగి రూ.83.18, బైనాన్స్‌ కాయిన్‌ 0.44 శాతం తగ్గి రూ.19,876, రిపుల్‌ 0.21 శాతం తగ్గి రూ.52.12, యూఎస్‌డీ కాయిన్‌ 0.04 శాతం పెరిగి రూ.82.23, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.11 శాతం తగ్గి రూ.1,53,091, డోజీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.6.18 వద్ద కొనసాగుతున్నాయి. ఈ-కామి, యూనిబాట్‌, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌, హెడెరా, థార్‌ చైన్‌, రాడిక్స్ లాభపడ్డాయి. ఆకాశ్ నెట్‌వర్క్‌, టామినెట్‌, కస్పా, నెర్వస్‌ నెట్‌వర్క్‌, రిజర్వ్ రైట్స్‌, లైవ్‌పీర్‌, అరగాన్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి


క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Rains: భారీ వర్షాలకు కుప్పకూలీన ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్‌- ఒకరు మృతి పలువురికి గాయాలు
భారీ వర్షాలకు కుప్పకూలీన ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్‌- ఒకరు మృతి పలువురికి గాయాలు
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP DesamRohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABPInd vs Eng Semi Final 2 Match Highlights | ఇంగ్లండ్ పై ఘనవిజయం T20 WorldCup 2024 Finalకు భారత్ | ABPSouth Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Rains: భారీ వర్షాలకు కుప్పకూలీన ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్‌- ఒకరు మృతి పలువురికి గాయాలు
భారీ వర్షాలకు కుప్పకూలీన ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్‌- ఒకరు మృతి పలువురికి గాయాలు
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
IND vs ENG Semi Final: ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్‌ చిత్తు  ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్‌ చిత్తు ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
Anna Canteens: ఏపీలో అన్న క్యాంటీన్లపై బిగ్ అప్‌డేట్ - మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
ఏపీలో అన్న క్యాంటీన్లపై బిగ్ అప్‌డేట్ - మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
Prabhas: పేరు మార్చుకున్న ప్రభాస్ - ఇక మన డార్లింగ్.. రెబెల్ స్టార్ కాడా?
పేరు మార్చుకున్న ప్రభాస్ - ఇక మన డార్లింగ్.. రెబెల్ స్టార్ కాడా?
Embed widget