News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cryptocurrency Prices: నష్టాల్లో క్రిప్టో మార్కెట్లు - తగ్గిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు గురువారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today: 

క్రిప్టో మార్కెట్లు గురువారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.67 శాతం తగ్గి రూ.24.43 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.47.52 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.70 శాతం తగ్గి రూ.1,53,394 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.43 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.11 శాతం తగ్గి రూ.82.74, బైనాన్స్‌ కాయిన్‌ 1.07 శాతం తగ్గి రూ.20,042, రిపుల్‌ 2.26 శాతం తగ్గి రూ.52.37, యూఎస్‌డీ కాయిన్‌ 0.17 శాతం తగ్గి రూ.82.85, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.70 శాతం తగ్గి రూ.1,53,356, డోజీ కాయిన్ 0.06 శాతం తగ్గి రూ.6.23 వద్ద కొనసాగుతున్నాయి. హ్యారీపొటర్‌ ఒబామా, ఆకాశ్‌ నెట్‌వర్క్‌, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్‌, ఎకామి, లుస్కో, ఏఎంపీ, థార్‌ చైన్ లాభపడ్డాయి. వరల్డ్‌ కాయిన్‌, మెరిట్‌ సర్కిల్‌, బ్లాక్స్‌, మురాసకి, నుసైఫర్‌, యునిబాట్‌, అప్టోస్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 10 Aug 2023 06:29 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

ఇవి కూడా చూడండి

Hyundai i20 N Line Sale: కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?

Hyundai i20 N Line Sale: కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Cryptocurrency Prices Today: రూ.55వేలు నష్టపోయిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today: రూ.55వేలు నష్టపోయిన బిట్‌కాయిన్‌

Stock Market Today: హమ్మయ్య! 4 రోజుల నష్టాలకు చెక్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ అప్‌!

Stock Market Today: హమ్మయ్య! 4 రోజుల నష్టాలకు చెక్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ అప్‌!

Savings at Risk: తగ్గిన కుటుంబ ఆదా! బ్యాంకుల 'స్ట్రాటజీ'తో పెరిగిన అప్పులు!

Savings at Risk: తగ్గిన కుటుంబ ఆదా! బ్యాంకుల 'స్ట్రాటజీ'తో పెరిగిన అప్పులు!

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత