అన్వేషించండి

Cryptocurrency Prices: రాకెట్‌లా దూసుకెళ్లిన బిట్‌కాయిన్‌! 24 గంటల్లోనే 7% పెరుగుదల

Cryptocurrency Prices Today, 28 July 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 7.32 శాతం పెరిగి రూ.18.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ఒక్క రోజులోనే లక్ష పెరిగింది.

Cryptocurrency Prices Today, 28 July 2022: క్రిప్టో మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 7.32 శాతం పెరిగి రూ.18.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ఒక్క రోజులోనే లక్ష పెరిగింది. మార్కెట్‌ విలువ రూ.32.49 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 10.71 శాతం పెరిగి రూ.1,34,499 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.14.17 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.05 శాతం పెరిగి రూ.84.48, యూఎస్‌డీ కాయిన్‌ 0.02 శాతం పెరిగి 84.00, బైనాన్స్‌ కాయిన్‌ 5.60 శాతం పెరిగి రూ.22,222, రిపుల్‌ 5.45 శాతం పెరిగి రూ.29.97, కర్డానో 6.92 శాతం పెరిగి రూ.41.98 వద్ద కొనసాగుతున్నాయి. మై నేబర్‌ హుడ్‌, ఎథీరియమ్‌ కాయిన్‌, సింథెటిక్స్‌, యూనిస్వాప్‌, బిట్‌కాయిన్‌ క్యాష్‌, ఒమిస్‌ గో, నియో 14-29 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. పాక్స్‌ డాలర్‌ మాత్రమే నష్టాల్లో ఉంది.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. 

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains News Update: ఏపీలో 4 రోజులపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ప్రజలకు హెచ్చరిక
ఏపీలో 4 రోజులపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ప్రజలకు హెచ్చరిక
JP Nadda in visakhapatnam: అభివృద్ధికి చిరునామాగా ఏపీ- సెమీకండక్టర్స్ ప్రాజెక్టు, 15 పోర్టులు నిర్మాణం: జేపీ నడ్డా
అభివృద్ధికి చిరునామాగా ఏపీ- సెమీకండక్టర్స్ ప్రాజెక్టు, 15 పోర్టులు నిర్మాణం: జేపీ నడ్డా
Satyavathi Rathod in Queue for Urea: యూరియా కోసం క్యూలైన్లో నిల్చున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వంపై విమర్శలు
యూరియా కోసం క్యూలైన్లో నిల్చున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వంపై విమర్శలు
Ind vs Pak Asia Cup 2025: బుమ్రా, అఫ్రిది కాదు.. భారత్-పాక్ మ్యాచులో టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీరే
బుమ్రా, అఫ్రిది కాదు.. భారత్-పాక్ మ్యాచులో టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీరే
Advertisement

వీడియోలు

రూ.2లక్షల కోట్లతో 114 రఫేల్ ఫైటర్స్.. దేశ చరిత్రలోనే అతిపెద్ద డీల్!
ఆసియా కప్ 2025 ఫైనల్ చేరుకున్న ఇండియన్ వుమన్స్ హాకీ టీమ్
గిల్ భాయ్..  పాత బాకీ తీర్చేయ్
BCCI స్పెషల్ ప్లాన్? INDvsPak మ్యాచ్ క్యాన్సిల్!
బాంగ్లాదేశ్ పై శ్రీలంక సూపర్ విక్టరీ.. ఇలా అయితే ఇండియాకి కష్టమే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains News Update: ఏపీలో 4 రోజులపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ప్రజలకు హెచ్చరిక
ఏపీలో 4 రోజులపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ప్రజలకు హెచ్చరిక
JP Nadda in visakhapatnam: అభివృద్ధికి చిరునామాగా ఏపీ- సెమీకండక్టర్స్ ప్రాజెక్టు, 15 పోర్టులు నిర్మాణం: జేపీ నడ్డా
అభివృద్ధికి చిరునామాగా ఏపీ- సెమీకండక్టర్స్ ప్రాజెక్టు, 15 పోర్టులు నిర్మాణం: జేపీ నడ్డా
Satyavathi Rathod in Queue for Urea: యూరియా కోసం క్యూలైన్లో నిల్చున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వంపై విమర్శలు
యూరియా కోసం క్యూలైన్లో నిల్చున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వంపై విమర్శలు
Ind vs Pak Asia Cup 2025: బుమ్రా, అఫ్రిది కాదు.. భారత్-పాక్ మ్యాచులో టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీరే
బుమ్రా, అఫ్రిది కాదు.. భారత్-పాక్ మ్యాచులో టాప్ 5 డేంజరస్ ప్లేయర్స్ వీరే
Tirumala VIP Break Darshans: సెప్టెంబర్ 16న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం- వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
సెప్టెంబర్ 16న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం- వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Thurakapalem Deaths Mystery: తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ- యురేనియం అవశేషాలు గుర్తింపు, చెన్నైలో నిర్ధారణ
తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ- నీటిలో యురేనియం అవశేషాలు గుర్తింపు
Nitin Gadkari: ‘నా మెదడు విలువ నెలకు రూ. 200 కోట్లు’.. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
‘నా మెదడు విలువ నెలకు రూ. 200 కోట్లు’.. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
OG Surprise : పవన్ 'ఓజీ'లో డీజే టిల్లు బ్యూటీ - రాధికా కన్ఫర్మ్ చేసేసింది
పవన్ 'ఓజీ'లో డీజే టిల్లు బ్యూటీ - రాధికా కన్ఫర్మ్ చేసేసింది
Embed widget