Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ సహా క్రిప్టోలన్నీ నిన్న లాభాల్లో..! నేడేమో నష్టాల్లో.. ఎందుకిలా?
మదుపర్లు మళ్లీ అమ్మకాల బాట పట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 1.56 శాతం తగ్గి రూ.40.50 లక్షల వద్ద కొనసాగుతోంది.
Cryptocurrency Prices Today, 8 December 2021: క్రిప్టో కరెన్సీలు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. మదుపర్లు మళ్లీ అమ్మకాల బాట పట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 1.56 శాతం తగ్గి రూ.40.50 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.72 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 1.02 శాతం తగ్గి రూ.3,51,012 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.39 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ రూ.47,372, టెథెర్ 0.03 శాతం తగ్గి రూ.80.49, సొలానా 6.27 శాతం తగ్గి రూ.15,345, కర్డానో 5.27 శాతం తగ్గి రూ.113, యూఎస్‌డీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.80.47 వద్ద కొనసాగుతున్నాయి. టెజోస్, ఈఓఎస్, చైన్‌లింక్, ఎన్‌ఈఎమ్, ఫైల్‌కాయిన్, కైబర్ నెట్‌వర్క్ వంటివి లాభాల్లో ఉన్నాయి. అయిలెఫ్, బేసిక్ అటెన్షన్, యార్న్ ఫైనాన్స్, అల్గోరాండ్, ఫెచ్ అయి, అల్‌రాండ్ నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: IPOs This Week: డబ్బుల వర్షమే..! ఈ వారం ఐపీవోకు 4 కంపెనీలు ..! వివరాలు ఇవే
Also Read: EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్ చేసుకోండి!
Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే!
Also Read: Corporate FD Rates: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తున్న ఎఫ్‌డీలివి! కాస్త ఎక్కువ రాబడే..!
Also Read: RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి