By: ABP Desam | Updated at : 08 Dec 2021 10:37 AM (IST)
Edited By: Ramakrishna Paladi
కార్పొరేట్ ఎఫ్‌డీ
సురక్షితమైన పెట్టుబడి సాధనం ఏదంటే అందరూ మొదట చెప్పేది ఫిక్స్‌డ్ డిపాజిట్! సుదీర్ఘ కాలం పెట్టుబడులను కొనసాగిస్తే బ్యాంకులు 5.5 వరకు వడ్డీని ఇస్తున్నాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అదే కాస్త నష్టభయం ఉన్నప్పటికీ కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ పొందొచ్చని!
తాజాగా బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు సవరించాయి. 0.15-0.30 శాతం వరకు పెంచాయి. డిసెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఇవి రెండూ AAA రేటింగ్ ఉన్న కంపెనీలే.
హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ I HDFC Limited
హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఎఫ్‌డీ రేట్లను 0.15 పర్సంటేజీ పాయింట వరకు పెంచింది. తాజా పెంపుదల ప్రకారం వారు 33 నెలల డిపాజిట్లపై 6.25 శాతం, 66 నెలల డిపాజిట్లపై 6.7 శాతం, 99 నెలల డిపాజిట్లకు 6.8 శాతం వరకు వడ్డీని పొందొచ్చు. ఇక ఆన్‌లైన్ విధానంలో ఎఫ్‌డీ చేస్తే అదనంగా 0.1 శాతం వడ్డీని ఇస్తోంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అన్ని కాల పరిమితుల ఎఫ్‌డీలపై 0.25 శాతం వడ్డీని అందిస్తోంది.
బజాజ్ ఫైనాన్స్ I Bajaj Finance
ఇక బజాజ్ ఫైనాన్స్ కార్పొరేట్ ఎఫ్‌డీలపై వడ్డీరేటును 0.30 వాతం మేరకు సవరించింది. 24-35 నెలల ఎఫ్‌డీలపై 6.4 శాతం, 36-60 నెలల డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీని ఇస్తోంది. అయితే 12-23 నెలల ఎఫ్‌డీలపై వడ్డీరేటును పెంచలేదు.
నష్టభయం ఏంటంటే?
సాధారణంగా బ్యాంకులోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత సురక్షితమైనవి! ఎందుకంటే రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా (DICGC) ఉంటుంది. ఒకవేళ ఇబ్బందులు వస్తే ఆ మొత్తాన్ని కస్టమర్లకు చెల్లిస్తారు. కార్పొరేట్ ఎఫ్‌డీలపై అలాంటి బీమా ఉండదు. క్రిసిల్, ఇక్రా, కేర్ వంటి క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఎన్‌బీఎఫ్‌సీల క్రెడిట్ క్వాలిటీని పరీక్షించి రేటింగ్ ఇస్తాయి. అందుకే AAA రేటింగ్ ఇస్తే ఆ కంపెనీలు దాదాపుగా సురక్షితమనే అర్థం!!
Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!
Also Read: Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తోంది తెలుసా?
Also Read: LIC Insurance Premium: ఈపీఎఫ్‌వో నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు తెలుసా..! వివరాలు ఇవే!
Also Read: GST Update: ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గింపు.. ఎవ్వరూ అడగట్లేదన్న కేంద్రం!
Also Read: Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
Buying Gold: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా? మొదట ఇన్కం టాక్స్ రూల్స్ తెలుసుకోండి
Business Idea: ఈ పూలు పూయించండి! లక్షల్లో ఆదాయం పొందండి!
LIC Home Loan: తక్కువ వడ్డీకి హోమ్ లోన్ కావాలా? ఈ ఒక్కటీ ఉంటే LIC ఇచ్చేస్తోంది!
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్
Bihar Road Accident: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
India Railways: భారత్లో భారీగా రైల్వే ట్రాక్ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు
KTR On Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్