By: ABP Desam | Updated at : 28 Dec 2021 04:43 PM (IST)
cryptocurrency
Cryptocurrency Prices Today, 28 December 2021: క్రిప్టో మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకుల్లో ఉన్నాయి. కీలక క్రిప్టోలను ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 3.71 శాతం తగ్గి రూ.39.26 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.69.34 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 3.86 శాతం తగ్గి రూ.3,13,219 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.34.71 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 0.43 శాతం పెరిగి రూ.44,211, టెథెర్ 0.11 శాతం తగ్గి రూ.80.39, సొలానా 4.88 శాతం తగ్గి రూ.15,296, కర్డానో 6.57 శాతం తగ్గి రూ.119, యూఎస్‌డీ కాయిన్ 0.08 శాతం పెరిగి 80.33 వద్ద కొనసాగుతున్నాయి. సుషి, ఆర్‌ఎల్‌సీ, ఫైల్‌కాయిన్, బైనాన్స్ కాయిన్, యూఎస్‌డీ కాయిన్ 1 నుంచి 9 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యార్న్ ఫైనాన్స్, లూప్‌రింగ్, ఠీటా నెట్‌వర్క్, టెర్రా, కర్వ్ డావో, ఠీటా ఫ్యూయెల్, రిపబ్లిక్ 9 నుంచి 12 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Also Read: Cyber Crime: మీ మొబైల్ ఫోన్ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్
UAN Number: మీ యూఏఎన్ నంబర్ మర్చిపోయారా, ఒక్క నిమిషంలో తెలుసుకోండి
Stock Market News: హమ్మయ్య! పతనం ఆగింది - కొనుగోళ్లతో పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ!
Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక
Budget 2023 Picks: బడ్జెట్ తర్వాత పెరిగే స్టాక్స్ ఇవి, ముందే కొని పెట్టుకోమంటున్న ఎక్స్పర్ట్స్
Cryptocurrency Prices: జోరు మీదున్న క్రిప్టోలు - 2 రోజుల్లో రూ.లక్ష పెరిగిన బిట్‌కాయిన్
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్
Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ