News
News
X

LPG Price Hike: మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధరలు... ఈసారి ఎంత వడ్డించారంటే?

జనవరి 1న 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉండేది. ఇప్పుడు చూస్తే రూ.850 దాటిపోయింది. 2014లో రూ.410.50 మాత్రమే ఉండేది.

FOLLOW US: 

వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ఒక్కో ఎల్‌పీజీ (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్‌కు రూ.25 చొప్పున ఎగబాకింది. ఇప్పటికే అధిక రేట్లతో సతమతం అవుతున్న సామాన్యుడికి ఇది పిడుగులాంటి వార్తే. ఈ ధరలు ఆగస్టు 17 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగినా.. ఒక్కో నగరంలో ఒక్కో ధర ఉంది. కొత్త ధరలు అమల్లోకి వచ్చిన వేళ హైదరాబాద్‌ రూ.887, ఢిల్లీ, ముంబయిలో ఒక సిలిండర్ ధర రూ.859.50గా ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.886కి చేరింది. చెన్నైలో రూ.850.50, బెంగళూరులో రూ.837.50 ఉంది. ఇప్పటికే గత జులై 1న ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన సంగతి తెలిసిందే.

Also Read: Gandhi Hospital Case: మిస్టరీగా గాంధీ హాస్పిటల్ గ్యాంగ్ రేప్ వ్యవహారం.. కేసులో మరో ట్విస్ట్

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ప్రభుత్వాలు విధించే పన్నులు కలిపి మొత్తం ధర తడిసిమోపెడు అవుతోంది. మరోవంక దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు కూడా రికార్డు స్థాయిలో మోతమోగుతున్నాయి. అదే టైంలో వంట గ్యాస్‌ సిలిండర్ ధర కూడా సామాన్యుల పాలిట శాపంగా పరిణమించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12 వరకు సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది.

Also Read: Weather Updates: ఈ జిల్లాలకు అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి

గతంలో పెరిగిన సిలిండర్‌ ధరలను పరిశీలిస్తే.. తాజాగా ఈ ఆగస్టు 1న గ్యాస్‌ సిలిండర్ల ధర పెరిగింది. దాని ప్రకారం.. ఎల్‌పీజీ రిటైలింగ్ సంస్థలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను రూ.73.5 పెంచాయి. అయితే ఇంటి అవసరాల కోసం వాడే 14.2 కిలోల సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. జులై 1న ఇంటి అవసరాల కోసం వాడే 14.2 కిలోల సిలిండర్‌ ధరను రూ.25.50 పెంచారు. 2021 ఏడాది తొలి నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 వరకు పెంచారు.

ఈ ఏడాది జనవరి 1న 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉండేది. ఇప్పుడు చూస్తే రూ.850 దాటింది. అంతేగాక, గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అయింది. 14.2 కిలోల డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మార్చి 1న రూ.410.50గా ఉంటే... ప్రస్తుతం అది కనీసం రూ.834.50కు ఎగబాకిపోయింది.

Also Read: Mancherial: అఫ్గానిస్థాన్‌లో తెలుగువాళ్లు.. చిక్కుకుపోయిన మంచిర్యాల వాసి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఫ్యామిలీ

Also Read: Tamilisai Mother Passed Away: గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం

Published at : 18 Aug 2021 01:31 PM (IST) Tags: Cooking Gas price LPG Cylinder Price gas cylinder latest rates lpg cylinder latest prices

సంబంధిత కథనాలు

Gold-Silver Price: ఈరోజు భారీగా పడిపోయిన బంగారం! నేడు వెండి ఎంత తగ్గిందంటే

Gold-Silver Price: ఈరోజు భారీగా పడిపోయిన బంగారం! నేడు వెండి ఎంత తగ్గిందంటే

Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా

Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా

India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!

India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!

సెలబ్రిటీలు సైతం క్యూ కడుతున్న రంగం - ఎన్‌ఎఫ్‌టీ అంటే ఏంటి?

సెలబ్రిటీలు సైతం క్యూ కడుతున్న రంగం - ఎన్‌ఎఫ్‌టీ అంటే ఏంటి?

NFTs: నాన్ ఫంగీబుల్ టోకెన్లలో భారత్ వాటా ఎంత..?

NFTs: నాన్ ఫంగీబుల్ టోకెన్లలో భారత్ వాటా ఎంత..?

టాప్ స్టోరీస్

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

Weather Latest Update: 13న మరో అల్పపీడనం, ఇంకో వారం వర్షాలే! భారీ గాలులతో ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD

Weather Latest Update: 13న మరో అల్పపీడనం, ఇంకో వారం వర్షాలే! భారీ గాలులతో ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు