అన్వేషించండి

LPG Cylinder Price: భారీగా దిగొచ్చిన కమర్షియల్ LPG సిలిండర్ ధరలు, నేటి నుంచే అమల్లోకి.. మీ నగరాలలో ఇలా

LPG 19 KG Cylinder Price | వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 58.50 తగ్గింది. జూలై 1 నుంచే తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. ఢిల్లీలో కొత్త ధర రూ. 1,665. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు.

Commercial LPG Cylinder Price | చిరు వ్యాపారులకు శుభవార్త. చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి 19-కిలోల కమర్షియల్ LPG సిలిండర్ల ధరను తగ్గించాయి. ఈసారి ఏకంగా రూ. 58.50 తగ్గించారు. నేటి (జూలై 1) నుండి తగ్గిన ధర అమలులోకి వస్తుంది. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ (Commercial Cylinder ) కొత్త రిటైల్ ధర ఇప్పుడు రూ. 1,665 అయింది. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ ధర ₹1,886.50కి దిగొచ్చింది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న  రెస్టారెంట్లు, హోటళ్లు, కేటరర్లకు తాజా నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది.

కమర్షియల్ సిలిండర్ ధరలు గత కొన్ని నెలలుగా దిగొస్తున్నాయి.  “19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధర జులై 1 నుంచి రూ. 58.50 తగ్గింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర రూ. 1,665. అయితే, 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజా నిర్ణయంతో వ్యాపారులకు మేలు కలుగుతుంది, కానీ గృహ వినియోగదారులకు ఏ ప్రయోజనం లేదు.

కమర్షియల్ LPG రేట్లలో క్రమంగా తగ్గుదల

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర తగ్గుదల ధోరణిని కొనసాగిస్తుంది. ఏప్రిల్ నెలలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 41 తగ్గించారు. ఆ తర్వాత మే నెలలో రూ. 14.50, జూన్ నెలలో రూ. 24 తగ్గింది. జూలైలోనూ తగ్గించారు. దాంతో గత నాలుగు నెలల్లో కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు మొత్తం ₹138 వరకు ఉపశమనం కలుగుతోంది.

LPG పై ఎక్కువగా ఆధారపడే వాణిజ్య సంస్థల కార్యకలాపాల వ్యయాలను తగ్గించడం ధరల తగ్గింపు లక్ష్యం. మార్జిన్లు తక్కువగా ఉన్నా, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న రంగాలలో ఇలాంటి నిర్ణయాలు ప్రభావం చూపుతాయి. 

గృహ వినియోగదారులకు ఉపశమనం లేదు

వాణిజ్య వినియోగదారులు పదేపదే ఎల్పీజీ ధరల తగ్గింపుతో ఉపశమనం పొందుతుండగా.. గృహ వినియోగ LPG ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరగా ఏప్రిల్ 7, 2025న ధర సవరించారు. 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 50 పెరగగా.. అప్పటి నుంచి రేట్లు స్థిరంగా ఉన్నాయి.

జూలై 1, 2025 నాటికి ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు:

  • ఢిల్లీ: రూ. 853.00
  • ముంబై: రూ. 852.50
  • కోల్‌కతా: రూ. 879.00
  • హైదరాబాద్: 855.00
  • చెన్నై: రూ. 868.50
  • బెంగళూరు: రూ. 805.50

ధరల సవరణల వెనుక..

భారతదేశంలో LPG ధరలు ప్రతి నెల మొదటి తేదీన సవరిస్తున్నారు. ప్రపంచ ముడి చమురు రేట్లు, విదేశీ మారకపు హెచ్చుతగ్గులు ఆధారంగా ధరలలో మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల కంటే కమర్షియల్ సిలిండర్ ధరల తగ్గింపుపై ఫోకస్ చేస్తున్నాయి.

వాణిజ్య LPG రేటు డిసెంబర్‌లో ₹62 పెరిగింది. ఫిబ్రవరిలో కేవలం ₹7 తగ్గింది. అంతర్జాతీయ ఇంధన ధరలు తగ్గడం సేవా రంగాలలో ఆర్థిక పునరుద్ధరణకు మద్దతు ఇస్తాయి. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Adhav Arjuna Divorce: విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
CII Summit First Day MoUs: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 35 ఒప్పందాల ద్వారా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 52,956 మందికి ఉపాధి అవకాశాలు
ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 35 ఒప్పందాల ద్వారా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 52,956 మందికి ఉపాధి అవకాశాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget