By: ABP Desam | Updated at : 29 Jan 2022 05:27 PM (IST)
Defence Sector Union Budget 2022 Expectations
Defence Sector Union Budget 2022 Expectations: ఆత్మనిర్భర్ భారత్ కళ సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది. రక్షణ రంగంలో ఇంకా చేయాల్సింది అంతకు మించి అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ బడ్జెట్‌లోనైనా ఆ దిశగా మరిన్ని పటిష్ట చర్యలు ఉండాలని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.
ఎప్పుడెప్పుడు భారత్‌ను దెబ్బతీద్దామా అని ఎదురు చూస్తున్న దేశాలు చెరోవైపు పెట్టుకొని నిరాయుధులమై కూర్చోగలమా. ఈ సమయంలో ఆర్థికంగా ఎంత ఎదుగుతున్నా రక్షణ పరంగా అదే స్థాయిలో చర్యలు తీసుకోవాలి లేకుంటే సమస్యల కోరల్లో చిక్కుకుంటాం.
ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నప్పుడు ఏ దేశం కూడా బలంగా ఉండదు. అలాంటి పరిస్థితి భారత్ ఉండకూడదని కేంద్రం చాలా చర్యలు చేపట్టింది. ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం దిశగా ప్రతి బడ్జెట్‌లో కూడా విప్లవాత్మకైనా మార్పులు గమనిస్తూనే ఉన్నాం కానీ.. రక్షణ రంగంలో మాకు మేమే సాటి అన్న స్థితికి మాత్రం ఇంకా చేరుకోలేపోయాం. ఇదే ఇప్పుడు భారత్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య.
ఈ బడ్జెట్‌లో అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు రక్షణ రంగ నిపుణులు.
నార్మల్ పారిశ్రామిక సంస్థలను అభివృద్ధి చేయాలంటే ప్రైవేట్ సెక్టార్‌ను బలోపేతం చేసి పెట్టబడులను ఉదారంగా ఆహ్వానిస్తే సరిపోతుంది. కానీ రక్షణ రంగం విషయానికి వస్తే మాత్రం ఇలాంటి ప్రయోగం వీలు కాదు. ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు సెక్టార్‌ను ప్రోత్సహించడానికి స్కోప్ లేదు. అలాగనే పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ కొన్ని రక్షణ రంగ పరిశ్రమలను స్థాపించలేదు. అందుకే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఉంది.
దీని కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది.
ఏడాదిన్నరగా ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన పరమైన నిర్ణయాల్లో ప్రధానమైన మార్పులు చేయాల్సి ఉంది. విదేశీ పెట్టుబడుల స్వీకరణ లిమిట్ 74శాతానికి పెంచడం, డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (DAP) 2020లో మార్పులు చేయాలంటున్నారు నిపుణులు.
త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ రెండు లక్ష్యాలను స్పష్టం చేస్తోంది. ఇండియన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్‌ని ఆధునీకరించడానికి అవసరమైన మూలధన బడ్జెట్ కేటాయించడం, ప్రభుత్వమే కొనుగోలు దారుగా ఉన్న రంగంలో స్థిరమైన డిమాండ్ ఉండేలా చూడటం ఒక లక్ష్యం. రెండోది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించేలా భారత్‌లో పన్ను రాయితీలు కల్పించాలి.
గత బడ్జెట్‌ను ఒక్కసారి పరిశీలిస్తే రక్షణ రంగ బలోపేతానికి 4,78 లక్షల కోట్లు కేటాయించారు. వార్‌షిప్స్, ఎయిర్‌క్రాఫ్ట్స్, కొత్త ఆయుధాల కొనుగోలుకు 1.35 లక్షల కోట్లు కేటాయించారు. ఇది మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు నిపుణులు.
రక్షణ ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహక ముసాయిదాలో పేర్కొన్నట్టుగానే గతేడాది దేశీయ కేటాయింపులో 15శాతం పెరుగుదల కనిపించింది. ఈ సారి కూడా మరింత పెంచాలని భావిస్తున్నారు.
అటోమొబైల్, ఫార్మా రంగాల్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించింది. ఫలితంగా ఆయా రంగాల్లో గణనీయమైన ప్రగతి చూస్తున్నాం. ఇటీవల కాలంలో డ్రోన్ల తయారీలోనూ ఈ పీఎల్‌ఐ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రక్షణ ఉత్పత్తుల తయారీలో కూడా పీఎల్‌ఐ ప్రవేశ పెట్టాలన్న సూచన వినిపిస్తోంది.
ప్రైవేటు పరిశ్రమలను ఆకర్షించాలంటే పన్నుల విషయంలో చాలా ఉదారత ప్రదర్శించాలి. ట్యాక్స్ హాలిడే విధానాన్ని అవకాశంగా తీసుకొని చాలా పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందాయి. అదే రక్షణ ఉత్పత్తుల తయారీదారులకు ఇవ్వాలన్న సలహా ఎక్కువమంది నుంచి వస్తోంది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వగలిగితే ఆత్మనిర్భర్ భారత్ సాక్షాత్కారమవుతుందంటున్నారు.
ఇప్పుడున్న పన్ను చట్టాల ప్రకారం మార్చి 2023న లేద అంతుకు ముందు కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే పరిశ్రమలకు 15శాతం ప్రాధాన్యత రేటు అందుబాటులో ఉంది. భారీ పెట్టుబడితో కూడిన అత్యాధునిక రక్షణ ప్రాజెక్టుల కోసం ఈ గడువు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
రక్షణ రంగ తయారీదారులకు జీఎస్టీ ప్రతిబంధకంగా ఉంది. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధిత ముడిసరకు దిగుమతిపై కాస్త వెసులుబాటు కల్పిస్తే బెటర్ అన్న సూచన కూడా గట్టిగా వినిపిస్తోంది. లోకల్‌గా దొరకని చాలా ముడిసరకును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వివరిస్తున్నారు.
ప్రైవేట్-పబ్లిక్ సమానత్వాన్ని తీసుకురావడానికి మరొక ముఖ్యమైన అంశం GST/కస్టమ్స్ మినహాయింపుల పొడిగింపు. రక్షణ పరికరాల దిగుమతిపై అటువంటి మినహాయింపులు ప్రస్తుతం MoD/Defence PSU/Defence Forces/PSUకి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ డిఫెన్స్ ప్లేయర్‌లకు కూడా వాటి వర్తింపజేయాలని కోరుతున్నారు.
Also Read: ఈ సారి బడ్జెట్ హల్వా లేదండోయ్! మారుతున్న సంప్రదాయాలు!!
Crypto Tax India: క్రిప్టో బిల్లుకు లోక్ సభ ఆమోదం, ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ అమలు
AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-రూ.31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!
AP Budget 2022-23: 2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి
AP Budget 2022 : నేడే ఏపీ బడ్జెట్, ఎన్నో సవాళ్లు - అభివృద్ధా? సంక్షేమమా?
Telangana budget 2022-23: 75వేల రూపాయల్లోపు రుణం ఉన్న రైతులకు హరీష్ తీపి కబురు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!