Budget 2025 Expectations: పొలాల్లో బంగారం పండేలా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు! - వ్యవసాయ బడ్జెట్ అంచనాలివి
Agriculture Budget 2025: రైతులు తమ కడుపు నింపుకోవడం మాత్రమే కాదు, అంతకుమించి, విదేశీ కరెన్సీని తీసుకువచ్చేలా వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్ నుంచి ఇంత మద్దతు లభిస్తుందని అంచనా.

Union Budget 2025 Expectations: వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం. రైతులు సంతోషంగా ఉంటే, ఆ ఆనంద వీచికలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయి, అన్ని రంగాలూ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి, దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగానిది ప్రధాన పాత్ర. అభివృద్ధి చెందిన భారతదేశం (Developed India/ Viksit Bharat) కలను నెరవేర్చుకోవడానికి, ఈసారి భారత ప్రభుత్వం వ్యవసాయం & అనుబంధ రంగాల బడ్జెట్‌కు కేటాయింపులు పెంచవచ్చు. తద్వారా, విదేశీ కరెన్సీతో కేంద్ర ఖజానాను నింపుకునేందుకు కొత్త తలుపులు తెరుచుకుంటాయి.
వాస్తవానికి, భారత ఆర్థిక వ్యవస్థ లేదా స్థూల జాతీయ ఉత్పత్తి (GDP)లో వ్యవసాయం వాటా క్రమంగా తగ్గుతున్నప్పటికీ, నేటికీ ఇది చాలా మందికి ఉపాధికి ఆధారం. భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం నుంచి గరిష్ట ఎగుమతులను (Maximum exports from the agricultural sector) ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో కేటాయింపులు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అదనపు కేటాయింపులు లేదా పథకాల ద్వారా అగ్రికల్చర్ సెక్టార్‌లో ఉత్పాదకత, సాంకేతికత అప్‌గ్రేడేషన్ & మౌలిక సదుపాయాల విస్తరణను పెంచే స్కోప్ ఉంటుంది. రైతుల డిమాండ్లు, ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అధికార పక్షం నిరంతర ప్రకటనలను పరిశీలిస్తే ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
గ్రామీణ ఆదాయానికి ప్రోత్సాహం
గ్రామీణ ఆదాయాన్ని పెంచడం ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం భారత ప్రభుత్వ వ్యూహం. వ్యవసాయ సంబంధిత రంగాలను అభివృద్ధి చేయడానికి & వ్యవసాయ ఆధారిత ఎగుమతులను ప్రోత్సహించడానికి దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇది సఫలీకృతమైతే, రైతులు దేశం కడుపు నింపడంతోనే ఆగిపోకుండా, దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని (Foreign currency through the agricultural sector) తెచ్చే స్థాయికి ఎదుగుతారు. ఈ వ్యూహంలో దేశంలో నీటి పారుదల సౌకర్యాల విస్తరణ కూడా ఉంది. నీటి పారుదల సౌకర్యాలు ఇంకా దరిచేరని భూములను సుజలంతో తడిపి, వాటిని సాగుకు సన్నద్ధం చేయడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చు.
మరో ఆసక్తికర కథనం: సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా..బడ్జెట్లో హోమ్ లోన్ వడ్డీపై పన్ను రాయితీ పెంచుతారా ?
గ్రామీణ కార్మికుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి
వ్యవసాయం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్ ఇచ్చే వ్యూహాన్ని అమలు చేయడానికి వచ్చే బడ్జెట్‌లో చాలా కేటాయింపులు ఉండవచ్చు. వ్యవసాయ బడ్జెట్ దృష్టి గ్రామీణ శ్రామిక శక్తి నైపుణ్యాలను ప్రోత్సహించడంపై (Skill development of rural workforce) కూడా ఉంటుంది. గ్రామీణ శ్రామిక శక్తి నైపుణ్యాభివృద్ధి ద్వారా వ్యవసాయం నుంచి గరిష్ట ఆదాయాన్ని సాధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడంపై కూడా దృష్టి పెట్టాలని భావిస్తోంది. ఇది గ్రామీణ శ్రామిక శక్తికి అనేక రూపాల్లో ఆదాయ వనరులను అందిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ రంగం.. ప్రభుత్వం ముందున్న డిమాండ్లు ఇవే !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

