అన్వేషించండి

Bikanervala Kedarnath Aggarwal: బికనీర్‌వాలా కాకాజీ కన్నుమూత, ఆయన జీవితం సినిమా స్టోరీకి తగ్గదు

Bikanervala Kedarnath Aggarwal Life: బిజినెస్‌ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న వారు మాత్రమే కాదు, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి చదవాల్సిన పాఠం 'కాకాజీ జీవిత చరిత్ర'.

Bikanervala Kedarnath Aggarwal Dies: ప్రముఖ స్నాక్స్ & స్వీట్స్ బ్రాండ్ చైన్ బికనీర్‌వాలా వ్యవస్థాపకుడు లాలా కేదార్‌నాథ్ అగర్వాల్ ‍‌(Lala Kedarnath Aggarwal) సోమవారం మరణించారు. అందరూ 'కాకాజీ' ‍‌(Kakaji) అని పిలిచే అగర్వాల్‌ వయస్సు 86 సంవత్సరాలు. బికనీర్‌వాలా స్వీట్స్‌, స్నాక్స్‌ అంటే దక్షిణాదిలో పెద్దగా తెలీకపోవచ్చు గానీ, ఉత్తర భారతదేశంలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. ఈ తినుబండారాలు అక్కడి ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయి.

బికనీర్‌వాలాను స్థాపించిన కేదార్‌నాథ్ అగర్వాల్‌ జీవితం సినిమా కథలా ఉంటుంది. 'కష్టే ఫలిః' అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం కాకాజీ. ఒకప్పుడు, పాత దిల్లీ వీధుల్లో భుజియా, రసగుల్లాలను బకెట్లలో విక్రయించిన లాలా కేదార్‌నాథ్ అగర్వాల్, అంచెలంచెలుగా ఎదిగి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. బిజినెస్‌ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న వారు మాత్రమే కాదు, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి చదవాల్సిన పాఠం 'కాకాజీ జీవిత చరిత్ర'.

దేశంలో 60కి పైగా బికనీర్‌వాలా ఔట్‌లెట్లు ‍‌(Over 60 Bikanervala outlets in India)
బికనీర్‌వాలా బ్రాండ్‌తో భారతదేశంలో 60కి పైగా ఔట్‌లెట్లు నడుస్తున్నాయి, ఫారిన్‌ కూడా విస్తరించాయి. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, నేపాల్, UAE ప్రజలు కూడా బికనీర్‌వాలా రుచులను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ మొత్తం ఔట్‌లెట్లలో ఏడాదికి దాదాపు 1300 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. 

దిల్లీకి వలస వచ్చిన కేదార్‌నాథ్ అగర్వాల్ ‍‌(Kedarnath Aggarwal migrated to Delhi)
కేదార్‌నాథ్ అగర్వాల్ వ్యాపార ప్రయాణం పాత దిల్లీలో ప్రారంభమైంది. 50వ దశకం ప్రారంభంలో, తన సోదరుడు సత్యనారాయణ్ అగర్వాల్‌తో కలిసి దిల్లీకి వలస వచ్చారు. సోదరులిద్దరూ పాత దిల్లీ వీధుల్లో తిరుగుతూ, బకెట్లలో భుజియా & రసగుల్లాలు అమ్మారు. అవి వాళ్ల ఫ్యామిలీ వంటకాలు, ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా వచ్చాయి. వాటిని ఇంట్లోనే తయారు చేసేవాళ్లు. అలా, తమ కుటుంబ వారసత్వాన్ని దిల్లీకి పరిచయం చేశారు.

కాళ్లకున్న చెప్పులు అరిగేలా తిరిగిన అగర్వాల్ సోదరుల కష్టానికి త్వరగానే గుర్తింపు వచ్చింది. భుజియా, రసగుల్లాల రుచికి దిల్లీ ప్రజలు దాసోహం అన్నారు. వాళ్లు తీసుకెళ్లే తినుబండారాలు త్వరగా అమ్ముడుపోయేవి. అక్కడి నుంచి వ్యాపారంలో మరో మెట్టు ఎక్కారు అగర్వాల్‌ సోదరులు. తిరుగుళ్లను కట్టిపెట్టి, దిల్లీ చాందినీ చౌక్‌లో మొదటి స్వీట్‌ షాప్‌ ప్రారంభించారు.

1905 నుంచి వ్యాపారంలో ఊపు
1905లో స్వీట్‌ షాప్‌ ప్రారంభమైంది, ఆ దుకాణం పేరు బికనీర్ నామ్‌కీన్ భండార్ (Bikaner Namkeen Bhandar). అందులో.. భుజియా, రసగుల్లాలతో పాటు మూంగ్ దాల్ హల్వా, కాజు కట్లీ, బికనేరి భుజియా, మరికొన్ని స్వీట్లు, హాట్లు అమ్మారు. దిల్లీ ప్రజలు మూంగ్ దాల్ హల్వా తినడం అదే తొలిసారి. ఆ స్వీట్‌తో పాటు కాజు కట్లీ, బికనేరి భుజియా కూడా బాగా ఫేమస్‌ అయ్యాయి. ఆ తర్వాత అగర్వాల్‌ సోదరులు & ఆ స్వీట్‌ షాప్‌ కూడా బికనీర్‌వాలా పేరుతో పాపులర్‌ అయ్యారు. అక్కడి నుంచి అగర్వాల్‌ సోదరులు వ్యాపారంలో ఎప్పుడూ వెనుకబడలేదు. 

2023లోకి వస్తే, దిల్లీలోని ప్రతి కుటుంబం సందర్శిస్తున్న స్వీట్‌ షాప్‌గా బికనీర్‌వాలా మారింది. పండగయినా, శుభకార్యమైనా.. బికనీర్‌వాలా స్వీట్స్, స్నాక్స్‌ ఇంట్లో తప్పనిసరిగా ఉండేలా పరిస్థితి మారింది. అయితే, రాత్రికి రాత్రే ఇదంతా జరగలేదు. అగర్వాల్ సోదరులు దిల్లీలోని గల్లీగల్లీ తిరిగి తినుబండారాలు అమ్మారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి షార్ట్‌ కట్స్‌ వెతుక్కోకుండా 'స్ట్రెయిట్‌ వే'లోనే వెళ్లారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లి, అతి పెద్ద సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్టించారు. 

మరో ఆసక్తికర కథనం: ఒక్కసారిగా పెరిగిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget