అన్వేషించండి

Bank Holidays: ఈ రోజు అన్ని బ్యాంక్‌లు బంద్‌, ఈ నెలలో మరో పక్షం రోజులు సెలవులు

జనవరి 01, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి పండుగలు, జాతీయ సందర్భాలు కలుపుకుని మొత్తం 16 రోజుల పాటు పని చేయవు.

Bank Holidays List For January 2024: నూతన ఏడాది సందర్భంగా, జనవరి 01వ తేదీన దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. కాబట్టి, ఈ రోజు బ్యాంకులు పని చేయవు. దీంతోపాటు, ఈ నెలలో (2024 జనవరి) బ్యాంక్‌లు మరో పక్షం రోజులు హాలిడేస్‌లోనే ఉంటాయి. 

2024 జనవరి నెలలో బ్యాంక్‌లకు 4 ఆదివారాలు. రెండు & నాలుగో శనివారం సెలవులు ఉన్నాయి. జనవరి 01, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి పండుగలు, జాతీయ సందర్భాలు కలుపుకుని మొత్తం 16 రోజుల పాటు పని చేయవు. అయితే, ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఆ రాష్ట్ర రాజకీయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని బట్టి మారతాయి. 

ఈ నెల చివరిలో బ్యాంక్‌లకు లాంగ్‌ వీకెండ్‌ ఉంది. భారతదేశ గణతంత్ర దినోత్సవం (Republic Day 2024) సందర్భంగా, జనవరి 26 శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఆ తర్వాత, జనవరి 27న నాలుగో శనివారం, 28న ఆదివారం ఉన్నాయి. కాబట్టి ఈ నెలాఖరులో బ్యాంక్‌లకు వరుసగా 3 రోజులు సెలవులు వస్తాయి. ఈ నెలలో బ్యాంక్‌లు మరో 15 రోజులు పని చేయవు కాబట్టి, చివరి నిమిషంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదనుకుంటే, బ్యాంక్‌ హాలిడేస్‌ ప్రకారం ముందుస్తుగానే మీ పనిని ప్లాన్‌ చేసుకోవడం ముఖ్యం.

2024 జనవరిలో బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌: 

జనవరి 1, 2024 - సోమవారం - నూతన సంవత్సరం ప్రారంభం - దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
జనవరి 2, 2024 - మంగళవారం - న్యూ ఇయర్ సెలబ్రేషన్ - ఐజ్వాల్‌లో సెలవు
జనవరి 7, 2024 - ఆదివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 11, 2024 - గురువారం - మిషనరీ డే - ఐజ్వాల్‌లో సెలవు
జనవరి 13, 2024 - రెండో శనివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 14, 2024 - ఆదివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 15, 2024 - సోమవారం - ఉత్తరాయణ పుణ్యకాలం/మకర సంక్రాంతి పండుగ/మాఘే సంక్రాంతి/పొంగల్/మాఘ బిహు - తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్‌, గువాహటిలో సెలవు
జనవరి 16, 2024 - మంగళవారం - తిరువళ్లూవర్ డే - చెన్నైలో సెలవు
జనవరి 17, 2024 - బుధవారం - ఉజ్హవర్ తిరునాళ్‌/శ్రీ గురు గోవింద్ సింగ్ జీ జయంతి  - చండీగఢ్, చెన్నైలో సెలవు
జనవరి 21, 2024 - ఆదివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 22, 2024 - సోమవారం - ఇమోయిను ఇరట్ప - ఇంఫాల్‌లో సెలవు
జనవరి 23, 2024 - మంగళవారం - గాన్-నగై - ఇంఫాల్‌లో సెలవు
జనవరి 25, 2024 - గురువారం - థాయ్ పూసం/మొహమ్మద్‌ హజారత్ అలీ జయంతి - చెన్నై, కాన్పూర్, లఖ్‌నవూలో సెలవు
జనవరి 26, 2024 - శుక్రవారం - గణతంత్ర దినోత్సవం - అగర్తల, దెహ్రాదూన్, కోల్‌కతా మినహా భారతదేశం అంతటా సెలవు 
జనవరి 27, 2024 - నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 28, 2024 - ఆదివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు

బ్యాంక్‌లకు సెలవు వచ్చినా మీ లావాదేవీలు ఆగవు
ఇప్పుడు, స్మార్ట్‌ ఫోన్ల రూపంలో మన అరచేతిలోనే టెక్నాలజీ తిరుగుతోంది కాబట్టి, సెలవుల కారణంగా బ్యాంక్‌లు పని చేయకపోయినా ప్రజలు పెద్దగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ATM ఉపయోగించవచ్చు, బ్యాంక్‌ సెలవు రోజుల్లోనూ ATMలు 24 గంటలూ పని చేస్తాయి. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నగదు బదిలీ చేయడానికి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా UPI అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా నిరంతరాయంగా పని చేస్తాయి. 

మరో ఆసక్తికర కథనం: సిబిల్‌ స్కోర్‌ తగ్గిందా?, క్రెడిట్‌ మీటర్‌ని పెంచే మ్యాటర్‌ మీ చేతుల్లోనే ఉంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget