By: ABP Desam | Updated at : 30 Dec 2023 02:35 PM (IST)
మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా?
Increase Your Credit Score: కాలం మారుతోంది, అవసరాలు పెరుగుతున్నాయి. బ్యాంక్ లోన్ (Bank loan), క్రెడిట్ కార్డ్ (Credit card) వంటివి ప్రతి ఒక్కరి అవసరంగా మారాయి. వాటి కోసం బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీల తలుపు తడితే... ఆయా సంస్థలు మొట్టమొదట చూసేది దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్/సిబిల్ హిస్టరీని. క్రెడిట్ స్కోర్‌లో పెద్ద నంబర్ ఉంటేనే అవి అప్పులు ఇస్తాయి.
ఒక వ్యక్తికి మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే (Good Credit Score) వెంటనే లోన్ మంజూరు కావడమే కాదు, మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా చేతుల్లోకి వస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎక్స్‌లెంట్ లెవల్‌లో (Excellent Credit Score) ఉంటే, బాల్ మీ కోర్టులో ఉందని అర్ధం. మీరు బ్యాంక్ నుంచి ఎక్కువ లోన్ అడగొచ్చు, తక్కువ వడ్డీ కోసం బేరమాడవచ్చు. మంచి స్కోర్ ఉన్న వాళ్లకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రాధాన్యత ఇస్తాయి, రుణం ఇవ్వకుండా బ్యాంక్ గడప దాటనివ్వవు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం లోన్ ఇవ్వలేమని మొహం మీదే చెబుతాయి.
పర్సనల్ లోన్, హౌస్ లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్డ్.. ఇలాంటి ఏ విధమైన అప్పు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ 720 దాటితే బెటర్. కనీసం 650 దాటి ఉండాలి. ఇంతకంటే తక్కువగా ఉంటే బ్యాంకులు/NBFCలు మీ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేస్తాయి.
క్రెడిట్ స్కోర్ పెంచడం మీ చేతుల్లో పని (Increasing credit score is in your hands):
1. మీరు తీసుకున్న లోన్ల మీద చెల్లింపులను గడువు లోగా కచ్చితంగా పూర్తి చేయండి. క్రెడిట్ కార్డు బిల్లును, లోన్ EMIని ( equated monthly instalment) లాస్ట్ డేట్ రాకముందే చెల్లించండి. ఏ కారణం వల్ల గడువు దాటినా, ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్ మీద పడుతుంది. దీనికి బోనస్‌గా పెనాల్టీ రూపంలో మీరు మరికొంత డబ్బు కట్టాల్సి వస్తుంది.
2. ఎక్కువ లోన్లు, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్‌లు తీసుకోవద్దు. ఎక్కువ లోన్స్ లేదా ఎక్కువ కార్డులు మీ దగ్గరుంటే నెల తిరిగే సరికి పెద్ద మొత్తంలో డబ్బు కట్టాల్సి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి తారుమారై, డబ్బు కట్టకపోతే క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి, అనవసర ప్రయాస వద్దు.
3. సురక్షిత రుణాలు (Secured loans), అసురక్షిత రుణాలను (Unsecured loans) జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. ఆస్తి పేపర్లు తనఖా పెట్టుకుంటాయి కాబట్టి హోమ్ లోన్స్, కార్ లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్ అని... తనఖా ఏమీ ఉండదు కాబట్టి పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్‌ను అన్ సెక్యూర్డ్ లోన్స్ అని బ్యాంకులు పరిగణిస్తాయి.
4. మీ క్రెడిట్ కార్డ్‌లోని లిమిట్ మొత్తాన్నీ వాడొద్దు. క్రెడిట్ కార్డు లిమిట్‌లో సగం వరకు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. మీరు తరచుగా క్రెడిట్ కార్డ్ లిమిట్ (Credit Card Limit) మొత్తాన్నీ వాడుతుంటే, అనవసర ఖర్చులు పెట్టే వ్యక్తిగా బ్యాంకులు మిమ్మల్ని పరిగణిస్తాయి. లోన్ ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటాయి.
5. నెల నెలా మీరు చెల్లించే EMIల మొత్తం మీ నెలవారీ జీతం లేదా మొత్తం ఆదాయంలో 50 శాతం దాటకుండా చూసుకోండి. ఇలాంటి నియంత్రణ పాటిస్తే గడువులోగా EMIలన్నీ చెల్లవుతాయి. క్రెడిట్ స్కోర్ ఈజీగా పెరుగుతుంది.
6. బ్యాంక్ లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం పదేపదే అప్లై చేయొద్దు. ఇలా చేస్తే... మీరేదో అత్యవసరంలో ఉన్నారని, అప్పు తీసుకున్నాక చెల్లించే పరిస్థితి మీకు ఉంటుందో, లేదోనని బ్యాంకులు అనుమానిస్తాయి. మీ క్రెడిట్ రిపోర్ట్‌లోనూ ఈ విషయం నమోదవుతుంది.
7. రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్‌లు దాదాపు కరెక్ట్‌గానే ఉంటాయి. ఒక్కోసారి వాటిలో తప్పులు దొర్లే అవకాశముంది. కాబట్టి, మీ క్రెడిట్ రిపోర్ట్‌ను 3-4 నెలలకు ఒకసారైనా పరిశీలించండి (Check your credit report). ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే, కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సాధ్యమైనంత త్వరగా సరిచేయించుకోండి.
మరో ఆసక్తికర కథనం: జనవరి 1న అన్ని బ్యాంక్‌లకు సెలవు, వచ్చే నెలలో 16 రోజులు పని చేయవు
Gold-Silver Prices Today 04 April: ఏకంగా రూ.17,400 తగ్గిన పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Car Safety Tips In Summer: మీ కార్‌ను కన్నకొడుకులా చూసుకోండి, ఈ తప్పులు చేస్తే మిగిలేది బూడిద!
Gold-Silver Prices Today 03 April: హార్ట్ ఎటాక్ లాంటి షాక్ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Property Loan: ఆస్తి తనఖా లోన్లపై లేటెస్ట్ వడ్డీ రేట్లు - రుణం తీసుకునే ముందు ఇది తెలుసుకోండి
Gold-Silver Prices Today 02 April: పసిడి నగలను మరిచిపోవడం మంచిది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్ గా ధోనీ..! మళ్లీ పగ్గాలు చేపట్టనున్న వెటరన్ ప్లేయర్..!! శనివారం చెపాక్ లో ఢిల్లీతో మ్యాచ్
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు