Airtel cashback offer: మీరు ఫోను కొంటే మేం డబ్బులిస్తాం.. ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్.. షరతులు వర్తిస్తాయి!
ఎయిర్‌టెల్ ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది! వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తే తాము రూ.6000 క్యాష్‌బ్యాక్ ఇస్తామని ప్రకటించింది. వివిధ బ్రాండ్ల 150 స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
పండగ సీజన్లో వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది! వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తే తాము క్యాష్‌బ్యాక్ ఇస్తామని ప్రకటించింది. దాంతో పాటు మరికొన్ని ఫీచర్లనూ ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది.
Also Read: రూ.1,000 లోపే స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్లు.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్లు
యూజర్లు రూ.12వేల విలువైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 36 నెలల వరకు రూ.249 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంతో వరుసగా 36 నెలలు రీచార్జ్ చేయాలని చెప్పింది. ఆ తర్వాతే మొత్తం రూ.6000 విలువైన క్యాష్‌బ్యాక్ వస్తుందని వెల్లడించింది. సరికొత్త వినియోగదారులను చేర్చుకొనేందుకు, ఇప్పటికే ఉన్న వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఇలా చేస్తోందని సమాచారం. వివిధ బ్రాండ్లకు చెందిన 150 రకాల స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటులో మార్పులు చేసిన రెండు బ్యాంకులు.. వివరాలు ఇవే!
క్యాష్‌బ్యాక్ రెండు అంచెల్లో పొందొచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. 18 నెలల తర్వాత తొలి ఇన్‌స్టాల్‌మెంట్లో రూ.2000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. మొత్తం 36 నెలలు పూర్తవ్వగానే మిగిలిన రూ.4000 చెల్లిస్తారు. ఏయే హ్యాండ్‌సెట్లపై ఆఫర్ వర్తిస్తుందో తెలుసుకొనేందుకు తమ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని సంస్థ సూచించింది.
Also Read: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్‌తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్
ఈ ఆఫర్ కింద మరికొన్ని ప్రయోజనాలను ఎయిర్‌టెల్ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పగిలిపోతే సెర్విఫై కింద ఒకసారి రిప్లేస్ చేస్తుంది. దీనివల్ల మరో రూ.4800 ప్రయోజనం కలుగుతుంది. అంతేకాకుండా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, 30 రోజుల వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ అందించనుంది. మొత్తంగా మొత్తం 12వేల స్మార్ట్‌ఫోన్‌పై రూ.10వేల వరకు ప్రయోజనం పొందచ్చన్నమాట!
Also Read: ఇంటర్‌నెట్ లేకున్నా పేమెంట్ చేయవచ్చు.. త్వరలో ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Don’t run out of chances to win! Answer in the comments and stand a chance to win Amazon vouchers and celebrate with #AirtelBalck. #NoBillsOnlyWins
— airtel India (@airtelindia) October 8, 2021
T&C Apply: https://t.co/nrrEBK7IYo pic.twitter.com/vpiTrrEp75
While they play on the field, victory is just a comment away with #AirtelBlack. Enjoy the match, predict the answer and stand a chance to win Amazon vouchers. #NoBillsOnlyWins.
— airtel India (@airtelindia) October 8, 2021
T&C Apply: https://t.co/nrrEBK7IYo pic.twitter.com/ySmYpu1Woq