అన్వేషించండి

New Year Offers: కొత్త సంవత్సరంలో ఛీప్‌ అండ్‌ బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ - ఎయిర్‌టెల్‌, జియో న్యూ ఇయర్‌ ఆఫర్లు

New Year Recharge Plans: జియో, ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ లాంచ్‌ చేశాయి. జియో అపరిమిత కాలింగ్ & డిస్కౌంట్ కూపన్‌ ఇస్తుంటే; ఎయిర్‌టెల్‌ రోజుకు 2GB 5G డేటాను చవగ్గా అందిస్తోంది.

Airtel and Jio New Year Recharge Offer Plans: మన దేశంలో, టెలికాం రంగంలో విపరీతమైన పోటీ ఉండడంతో, ప్రముఖ ప్రైవేట్‌ టెలికాం ప్లేయర్లు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ పోటీలు పడి మరీ కొత్త ప్లాన్స్‌ లాంచ్‌ చేస్తున్నాయి. టెలికాం రేస్‌లో ముందుండేందుకు యూజర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నాయి. ఇందుకోసం ఏ సందర్భాన్నీ అవి వదలుకోవడం లేదు. ఇదే క్రమంలో, కొత్త సంవత్సరానికి ముందు, రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్‌ను (Jio's New Year Welcome Plan) తీసుకొచ్చింది. ఇందులో, కస్టమర్లు 500 GB హై స్పీడ్ 5G డేటా, అపరిమితమైన కాలింగ్‌తో పాటు డిస్కౌంట్ కూపన్‌లను కూడా పొందుతారు. ఎయిర్‌టెల్ కూడా తక్కువ తినలేదు. తన వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ లాంచ్‌ చేసింది. ఈ ఆఫర్‌లో, హై స్పీడ్ 5G డేటాతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ రెండు ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. 

రిలయన్స్ జియో ఆఫర్‌లో ఏముంది?
జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ కింద, 2025లో 200 రోజుల చెల్లుబాటుతో 500 GB హై స్పీడ్ 5G డేటా & అపరిమిత కాలింగ్‌ (Unlimited Calling)ను అందిస్తోంది. దీంతో పాటు, యూజర్లు జియో టీవీ (Jio TV), జియో సినిమా (Jio Cinema), జియో క్లౌడ్‌ (Jio Cloud)కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ పొందుతారు. అలాగే, కంపెనీ మీకు రూ. 2,150 రీఛార్జ్ & గిఫ్ట్ కూపన్‌ను (Jio Recharge & Gift Coupon) అందిస్తోంది. ఇందులో రూ. 500 ఆజియో కూపన్ (Ajio Coupon) ఉంటుంది. మీరు ఈ రీఛార్జ్‌ను ఈ ఆఫర్‌ అందుకోవడానికి 11 జనవరి 2025 వరకు గడువు ఉంది. రీఛార్జ్ చేసిన తర్వాత, మీరు ఈ ప్లాన్ ప్రయోజనాలను 200 రోజుల (200 days validity) పాటు ఆనందించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: కొత్త ఉద్యోగంలో చేరిన ఎన్ని రోజుల తర్వాత పాత PF అకౌంట్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు?

ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఇచ్చిన ఆఫర్ ఏంటి?
జియో తరహాలోనే ఎయిర్‌టెల్ కూడా కొత్త సంవత్సరం సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఎయిర్‌టెల్ హాట్‌స్టార్ బండిల్ ప్లాన్‌లో, కస్టమర్‌లు రూ. 398 రీఛార్జ్‌తో (Airtel Rs 398 recharge plan detais) 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ & రోజుకు 100 SMSల ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు, ఈ కంపెనీ ప్రతి రోజూ 2 GB 5G డేటాను అందిస్తుంది. ఒకవేళ, రోజులో 2 GB 5G డేటా ఖర్చయిన తర్వాత కూడా యూజర్లు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలరు, కానీ వేగం తగ్గుతుంది. ఈ ప్లాన్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, మీరు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్‌ను (Disney+ Hotstar Mobile Edition Subscription) 28 రోజుల పాటు (28 days validity) పూర్తిగా ఉచితంగా పొందుతారు.

మరో ఆసక్తికర కథనం: ఆభరణాలు కొనేవాళ్లకు షాక్‌, పెరిగిన పసిడి ధరలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
India vs Pakistan Champions Trophy 2025: పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Embed widget