News
News
X

Adani Group: అప్పు మొత్తం తీర్చిన అదానీ, ఈ గ్రూప్‌ షేర్లతో ఎందుకు జాగ్రతగా ఉండాలి?

ఇంత డబ్బు హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని అదానీ గ్రూప్‌ ఇప్పటి వరకు వెల్లడించలేదు.

FOLLOW US: 
Share:

Adani Group: మార్కెట్‌కు ఇచ్చిన మాటను అదానీ గ్రూప్‌ నిలబెట్టుకుంది. ఈ నెలాఖరు నాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పును రెండు వారాల ముందే తీర్చేసింది. 

మార్జిన్ లింక్డ్ షేర్ బ్యాక్డ్ ఫైనాన్సింగ్‌ (గ్రూప్‌ షేర్లను కుదవబెట్టి తెచ్చిన అప్పును) 2.15 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ. 17,630 కోట్లు) ముందుస్తుగా, పూర్తిగా చెల్లించింది. తిరిగి చెల్లింపునకు 2023 మార్చి 31 నాటి వరకు గడువు ఉంది. అంబుజా కోసం తీసుకున్న రుణం కూడా కలిపి, మొత్తం 2.65 బిలియన్ డాలర్ల (రూ. 21,700 కోట్లకు పైగా) రుణాన్ని తిరిగి చెల్లించినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది.

అంబుజా కొనుగోలు కోసం అదానీ గ్రూప్‌ ప్రమోటర్స్‌ తీసుకున్న రుణంలో కొంతభాగాన్ని, అంటే 500 మిలియన్లను ‍(సుమారు రూ. 4,100 కోట్లు) ఇప్పుడు చెల్లించారు. 

ఈక్విటీ ఆధారిత అప్పుల ముందస్తు చెల్లింపుల్లో ప్రమోటర్ల నిబద్ధతకు అనుగుణంగా $2.15 బిలియన్ల రుణాన్ని తిరిగి చెల్లించామని, అంబుజా సిమెంట్స్ కొనుగోలు కోసం తీసుకున్న రుణంలో $500 మిలియన్లను ముందస్తుగా తీర్చేశామని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. రుణాల ముందస్తు చెల్లింపులను 6 వారాల్లోనే పూర్తి చేయడం, గ్రూప్‌ నగదు నిర్వహణ వ్యవస్థల పటిష్టతను ప్రతిబింబిస్తోందని వెల్లడించింది.

రుణ చెల్లింపులకు డబ్బు ఎక్కడిది?
గ్రూప్‌లోని 4 కంపెనీల షేర్లను తనఖా పెట్టి తీసుకున్న రూ. 7,374 కోట్ల రుణాల్ని అదానీ గ్రూప్‌ ఇటీవలే చెల్లించింది. తాజా చెల్లింపులతో కలిపి రూ. 25 వేల కోట్లకు (రూ. 17,630 కోట్లు + రూ. 7,374 కోట్లు) పైగా చెల్లించినట్లు అయింది. అయితే.. ఇంత డబ్బు హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని అదానీ గ్రూప్‌ ఇప్పటి వరకు వెల్లడించలేదు. 

అయితే, గ్రూప్‌లోని 4 కంపెనీల్లో ఇటీవలే వాటా కొన్న GQG పార్ట్‌నర్స్‌, అందుకోసం అదానీ గ్రూప్‌నకు రూ. 15,446 కోట్లు చెల్లించింది. ఈ డీల్‌ తర్వాతే అదానీ గ్రూప్‌ తన అప్పుల్ని ముందస్తుగా చెల్లించింది. కాబట్టి, GQG పార్ట్‌నర్స్‌ నుంచి వచ్చిన డబ్బును రుణాల ముందస్తు చెల్లింపుల కోసం ఉపయోగించిందని మార్కెట్‌ భావిస్తోంది. 

గ్రూప్‌ షేర్లతో ఎందుకు జాగ్రతగా ఉండాలి?
అదానీ గ్రూప్‌ మాట నిలబెట్టుకుంది, అప్పులన్నీ తీర్చేస్తోంది అని చెప్పుకోవడానికి బాగానే ఉన్నా... తాకట్టు పెట్టిన షేర్లను విడిపించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేక, మరికొన్ని షేర్లు అమ్ముకుని ఆ డబ్బు తీసుకొచ్చిన విషయాన్ని ఇన్వెస్టర్లు అర్ధం చేసుకోవాలని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి, అప్పులు తీర్చేందుకు అదానీ దగ్గర పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ లేదన్నది అంతరార్ధంగా వివరిస్తున్నారు. మోయలేనంత రుణ భారం ఇప్పటికీ అదానీ గ్రూప్‌ నెత్తిన ఉందన్న విషయాన్ని గుర్తుంచుకుని ఈ గ్రూప్‌ షేర్లతో డీల్‌ చేయాలని హెచ్చరిస్తున్నారు. అప్పు తీర్చిన ఉత్సాహం మరికొన్నాళ్ల పాటు ఈ షేర్లలో కనిపించినా, రుణ భారం ప్రభావం భవిష్యత్తులో భయంకరంగా ఉండొచ్చని చెబుతున్నారు.

Published at : 13 Mar 2023 10:41 AM (IST) Tags: Ambuja Cements Adani Group Stocks Gautam Adani Adani Stocks

సంబంధిత కథనాలు

ప్ర‌పంచంలోని టాప్ 10 సంప‌న్న దేశాలివే!

ప్ర‌పంచంలోని టాప్ 10 సంప‌న్న దేశాలివే!

Car Modification: కొత్త కారుకు యాక్సెసరీస్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా - వీటిని చేస్తే వారంటీ పోతుంది జాగ్రత్త!

Car Modification: కొత్త కారుకు యాక్సెసరీస్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా - వీటిని చేస్తే వారంటీ పోతుంది జాగ్రత్త!

Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!

Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!

Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్‌ రూల్స్‌, కొత్త విషయాలేంటో తెలుసుకోండి

Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్‌ రూల్స్‌, కొత్త విషయాలేంటో తెలుసుకోండి

Tax Saving: 8.1% వడ్డీతో పాటు పన్ను ఆదా కూడా, మంచి ఆఫర్‌ ఇచ్చిన బ్యాంకులు

Tax Saving: 8.1% వడ్డీతో పాటు పన్ను ఆదా కూడా, మంచి ఆఫర్‌ ఇచ్చిన బ్యాంకులు

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల