అన్వేషించండి

ఏపీలో ఎవరు ఎవరిని ట్రాప్ చేస్తున్నారు...? అంతుపట్టని పార్టీల స్కెచ్‌లు

ఏపీ రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. టీడీపీకి శాశ్వతంగా తలుపులు మూసేసిన బీజేపీ ఇప్పుడు వాటిని తెరిచింది. వైకాపా అవినీతిమయం అంటూ ఆరోపిస్తోంది. బీజేపీ టీడీపీ ట్రాప్‌లో పడిపోయిందంటూ వైఎస్సార్పీపీ చెబుతోంది. నిజంగానే టీడీపీ ట్రాప్‌లో బీజేపీ ఉందా.. అసలు ఎవరి ట్రాప్‌లో ఎవరు పడుతున్నారు...?

ఏపీలో శాంతిభద్రతలు అన్నవే లేవు... వైకాపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న మాటలు వరుసగా రెండు రోజుల్లో రెండు బహిరంగసభల్లో మారుమోగాయి. మామూలుగా ఈ మాటలు ఏ పార్టీ అన్నా అంటే వైఎస్సార్సీపీ నుంచి రియాక్షన్ మామూలుగా ఉండదు.  కానీ ఈసారి మాత్రం తమలపాకుతో మీటినంత సుతారంగా స్పందించింది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది..బాసులకే బాస్.. అమిత్ షా. జేపీ నడ్డా శ్రీకాళహస్తిలో విమర్శలు చేసినప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి మరీ పేర్ని నానీ లాంటి వాళ్లు స్పందించారు. కానీ అమిత్‌ షా నుంచి కూడా అవే మాటలు వచ్చే సరికి ఆచితూచి స్పందించింది వైఎస్సార్సీపీ. ముఖ్యమంత్రి కూడా మాకు బీజేపీ దూరమైందంటూ విక్టిమ్ కార్డు ప్లే చేశారు కానీ తనపై చేసిన ఆరోపణలకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. 

బీజేపీలో భారీ మార్పునకు కారణం ఏంటి..?

అసలు బీజేపీ వ్యాఖ్యలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు..? ఏ ప్రత్యర్ధి పార్టీ అయినా సహజంగా చేసుకునే విమర్శలు లాంటివే కదా.. బీజేపీ ఏమీ వైఎస్సార్పీపీ భాగస్వామి కాదు కదా అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అవగాహన ఉంటే పూర్తి విషయం అర్థం అవుతుంది. వైఎస్సార్సీపీ NDA భాగస్వామ్య పక్షం కాకపోవచ్చు.. కానీ అది అనధికారిక అధికారపక్షమే. 2019కు ముందు టీడీపీ బీజేపీ నుంచి దూరం అయ్యాక.. వైసీపీ ఆ పార్టీకి దగ్గరైంది. కేంద్రంలో బీజేపీ బిల్లులకు వైసీపీ బేషరతుగా మద్దతు ఇవ్వడం.. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవసరమైన బటన్ నొక్కే కార్యక్రమానికి కేంద్రం సహకారం అందించడం అన్నది కొన్నాళ్లుగా కొనసాగుతున్న పరస్పర అవగాహన. మరి ఇంతలో ఈ మార్పు ఎందుకు అంటే... ఓ కారణం కనిపిస్తోంది. 

చంద్రబాబు భేటీ పర్యవసానమా..?
జూన్ 3న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ టాప్ బాస్ అమిత్‌షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిశారు. తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా తలుపులు మూసేస్తున్నామని నాలుగేళ్ల కిందట ప్రకటించిన అమిత్‌షాతో కలవడమే ఒక విశేషం అయితే.. స్వయంగా బీజేపీ నేతలే తెలుగుదేశం అధ్యక్షుడిని ఆహ్వానించడం మరో కీలకాంశం. సరిగ్గా ఏపీలో బీజేపీ అగ్రనేతల పర్యటనలకు ముందు భేటీ జరగడం.. బీజేపీ వాయిస్‌లో మార్పు రావడం చూస్తుంటే చంద్రబాబు భేటీ సక్సెస్ అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ వైసీపీపై బీజేపీ స్థానిక నేతలు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నట్లు విమర్శలు చేసినా ..కేంద్రం నుంచి ఆ స్థాయిలో విమర్శల వాడి ఎప్పుడూ లేదు. కానీ నడ్డా, అమిత్‌ షా పర్యటనలు “టార్గెట్ వైసీపీ” అన్నట్లుగా సాగాయి. నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు ఇద్దరు నేతలు. రాజధాని లేని రాష్ట్రంగా మార్పారు అనడం దగ్గర నుంచి ‘కాబోయే రాజధాని’ వైజాగ్ ను నాశనం చేశారు అనడం వరకూ ప్రత్యేకమైన లక్ష్యం కనిపిస్తోంది. ఇంతకు ముందు బీజేపీ సభల్లో టీడీపీపైన కూడా విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి లేవు.  ఎక్కడా టీడీపీ గురించి మాట్లాడలేదు. 

అమిత్ షా పై ఆచితూచి… 
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వచ్చినా సరే.. ఆ పార్టీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై స్పందించడానికి కొంతమంది ఎంపిక చేసిన నేతలున్నారు. కానీ ఈసారి విమర్శలు చేసింది కేంద్ర హోం మంత్రి కావడంతో కాస్త జాగ్రత్తగానే ఉన్నారు. అమిత్ షా పర్యటన మరుసటి రోజే జగన్ క్రోసూరు బహిరంగసభలో పాల్గొన్నారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి.. అమిత్ షా తనపై నేరుగా  చేసిన ఆరోపణలపై మాత్రం మాట్లాడలేదు. పైగా బీజేపీ కూడా తమకు దూరమైందన్న ధోరణితో మాట్లాడారు. ఇన్నాళ్లు బీజేపీ అండ ఉంది ఇప్పుడు అది కూడా లేదు.. తాను ఒంటరి వాడినన్న భావం ఆయన మాటల్లో వ్యక్తమైంది.  సౌమ్యంగా స్పందించే వైవీ సుబ్బారెడ్డి ముందుగా బీజేపీపై మాట్లాడగా.. మంత్రి గుడివాడ అమర్ బీజేపీని నొప్పించని రీతిలో రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థులపై మాటల దాడులు చేసే నేతలు ఎవ్వరూ ఈ సారి బయటకు రాలేదు. 

టీడీపీ కూడా అంతే అప్రమత్తంగా… 
వరుసగా రెండు రోజులు జరిగిన పరిణామాలపై టీడీపీ కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. బీజేపీ చేసిన విమర్శలకు మద్దతుగా కానీ.. దానిపై స్పందనగా కానీ ఎవరూ మాట్లాడలేదు. అంతర్గతంగా మాత్రం.. నాలుగేళ్ల తర్వాత వైసీపీ అరాచకాలు గుర్తొచ్చాయా అన్న వ్యాఖ్యలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళ్లడం అంత మంచిది కాదన్న భావన పార్టీ నేతల్లో ఉంది. అయితే 2019 కు ముందు బీజేపీని ఎదిరించి తప్పు చేశామన్న భయం కూడా ఉంది. కేంద్రంలో అధికార పార్టీ సహకారం లేకపోతే ఎన్నికల్లో నెగ్గడం కష్టమన్న భావన పార్టీ అధినాయకత్వంలో ఉంది. “ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో కలిసినా నష్టమే.. .. కలవకపోయినా నష్టమే.. ఏ నష్టం తక్కువో చూసుకుని మేం ముందుకు వెళ్లాల్సి ఉంది.” అని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.  

ఎవరి ట్రాప్‌లో ఎవరున్నారు.. ? బీజేపీని నమ్మొచ్చా..?
రాజకీయ గండరడలైన మోదీ- షా గురించి పూర్తిగా తెలిసిన తెలుగుదేశం... ఒక్కసారిగా మారిన ఈ పరిస్థితి తమకు అనుకూలం అని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధాని- ముఖ్యమంత్రి మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు అనేక సందర్భాల్లో రుజువైంది. స్థానిక బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రం నుంచి రావలసిన సాయం.. అవసరమైన మద్దతు అనేక సందర్భాల్లో వివిధ రూపాల్లో అందిన విషయం స్పష్టం. రాష్ట్రం అప్పులమయం అయిపోయిందని బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలు తరచుగా ఆరోపిస్తూనే ఉంటారు. కానీ మరిన్ని అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఆ కేంద్రం నుంచే వస్తోంది. మొన్నటికి మొన్న కూడా కేంద్రం వద్ద ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రెవిన్యూ లోటుకు సంబంధించిన నిధులు 10వేల కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. పోలవరం ప్రాజక్టుకు సవరించిన అంచనాలకు ఆమోదం దొరికింది. 12 వేల కోట్ల నిధులు ఇచ్చేందుకు అంగీకారం అయింది. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా ముఖ్యమంత్రి ఇవి సాధించలేరు. 

బీజేపీలో చేరిన టీడీపీ నేతల ట్రాప్‌లో ఆ పార్టీ పడిపోయిందని వైసీపీ విమర్శలు చేస్తోంది కానీ.. జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఇందులో బీజేపీ వ్యూహం ఏమైనా ఉందా అన్న అనుమానం రాక మానదు. టీడీపీని పర్మనెంట్‌గా దూరం చేస్తామన్న బీజేపీ అంత తొందరగా మనసు మార్చుకుందా.. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న జగన్ మోహనరెడ్డిని అంత ఈజీగా దూరం పెట్టేస్తోందా అన్న  అనుమానాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ రాజకీయ పరిస్థితులు మారుతున్న విషయం వాస్తవం. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఏదైనా తేడా వస్తే.. నమ్మకమైన భాగస్వామ్య పక్షం అవసరం. అందకనే NDA లో చేరాల్సిందిగా ఎప్పటి నుంచో వైసీపీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మైనార్టీలు, దళితులే తన పార్టీకి బలం అని బీజేపీతో కలిస్తే.. ఇద్దరం నష్టపోతామని చెబుతూ జగన్ ప్రతీ సందర్భంలోనూ దాటవేస్తూనే వస్తున్నారు. జగన్ ఎన్డీఏలో చేరడం లేదన్న కారణంతో చేస్తున్నారా.. లేక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉందన్న నిర్థారణతో, తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో చేస్తున్నారా అన్నది అంతుబట్టడం లేదు. 
ఇంకో అవకాశాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. తెలుగుదేశం ట్రాప్‌లో బీజేపీ పడటం కాదు. బీజేపీ- వైసీపీ కలిసే తెలుగుదేశాన్ని ట్రాప్ చేస్తున్నాయా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.  రాష్ట్రంలో బీజేపీ ఎదగాలంటే.. తెలుగుదేశం పార్టీ బలహీనం అవ్వాలి. ముఖ్యమంత్రి జగన్ కొన్ని నెలలుగా తాను ఒక్కడినే అంటూ ఒంటరి గీతాన్ని ఆలపిస్తున్నారు. దానికి మద్దతుగా ఇప్పుడు బీజేపీ కూడా విమర్శలు మొదలుపెట్టింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు జగన్ ముంగిటే ఉంది. పాత కేసులు ఎలాగూ ఉన్నాయి. వీటి ద్వారా ఒత్తిడి పెంచితే అందరూ కలిసి జగన్ ను వేధిస్తున్నారన్న భావన క్రియేట్ అవుతుంది. అలాంటి పరిస్థితి కల్పించి జగన్‌కు సానుభూతి  ఓట్లు కురుపించాలన్నదే బీజేపీ ఎత్తుగడ అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 

రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్టలైన మోదీ-షా మనసులో ఏముందో తెలీదు కదా.. వాళ్లు ఎలాంటి స్కెచ్‌ వేశారో ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం లేదు. ఇప్పటికైతే బీజేపీని అంత తేలిగ్గా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget