అన్వేషించండి

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

పంద్రాగస్టు వచ్చిందంటే అదో సంబరం. పిల్లా పెద్ద అంతా దేశ నేతలను స్మరించుకునే రోజు. జాతి ఘనతను గుర్తు చేసుకునే రోజు. చిన్నతనంలో ప్రతి ఒక్కరూ ఆగస్టు 15 వస్తుందంటే బడిలో పిల్లలకు స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను టీచర్లు పిల్లలకు చెప్పడం వినే ఉంటాం. అమరవీరులు, స్వాతంత్య్రోద్యమ నేతల గురించి రాజకీయ నాయకులు మాట్లాడిన విషయాలను పత్రికల్లో చదివేవాళ్లం..! అదంతా ఓ స్ఫూర్తినిచ్చేది. మన కోసం.. మన దేశం కోసం అంతగా పోరాడారా అనుకోవడమే కాదు.. దేశం కోసం మనం ఏం చేద్దాం అన్న ఆలోచన వచ్చేలా చేసేది. కానీ ఇప్పుడేం జరుగుతోంది? స్వాతంత్య్ర దినోత్సవం రోజన కూడా రాజకీయ విమర్శలు చేసుకోవడం కూడా ప్రివిలేజ్‌గా భావిస్తున్నారు. 
స్వాతంత్య్ర సంబరాల్లోనూ రాజకీయమే ఎజెండా ! 
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. 200 ఏళ్ల బానిస సంకెళ్లను తెంచుకుని.. అనేక సవాళ్లను దాటి.. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం.. ఏడాది నుంచి అమృతోత్సవాల పేరుతో.. సంబరాలు చేసుకుంటున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల ముగింపు సందర్భంగా జరిగే వేడుకలు అంటే ఎలా ఉండాలి..? సాధించిన విజయాలను నెమరువేసుకుని.. సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన తరుణం ఇది. జాతి మొత్తాన్ని ఒక మాటపై నిలపడానికి మరో పాతికేళ్లకు వచ్చే శత సంవత్సర స్వతంత్ర భారతావనికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఇది. కానీ మనం ఏం చేస్తున్నాం..? ఇప్పటికీ.. రాజకీయ రొచ్చు నుంచి బయటకు రాలేకపోతున్నాం ? స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లోనూ కనిపించిన రాజకీయ నగుబాటు దృశ్యాలు, నేతల ప్రసంగాల్లో వినిపించిన విమర్శలు ఆ వేడుకల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. మనం ఇంత కన్నా దాటి ముందుకు రాలేమా అని మనల్ని ప్రశ్నిస్తున్నట్లున్నాయి. 
ఎర్రకోట నుంచి.. గోల్కొండ కోట వరకూ అంతే !
రాజకీయ విమర్శల్లో రాటుదేలిన మన నేతలు పంద్రాగస్టు పండుగను కూడా వదల్లేదు. అక్కడా ఇక్కడా అని లేదు. ఎర్రకోట నుంచి గోల్కొండ కోట వరకూ అంతే. సాధారణంగా రాజకీయ విమర్శలకు ఓ పద్ధతి ఉంటుంది. పార్టీ ప్రెస్ మీట్లలోనో.. రాజకీయ వేదికలపైనో అవి సహజం. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ రాజకీయ ప్రసంగాలే ఉంటున్నాయి. ఇక ఇంతేలే అని జనం కూడా సరిపెట్టుకుంటున్నారు. కానీ.. స్వాతంత్ర్య వేడుకలు అంటే ఓ ప్రత్యేక సందర్భం. ఆ వేడుకల్లోనూ ఇంతేనా అని ప్రతి ఒక్కరూ ఆవేదన చెందాల్సిన పరిస్థితి. ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి... ఓ పక్క పంచ సూత్రాల ప్రాణ ప్రతిష్ట అంటూ అద్భుతంగా మాట్లాడుతూనే... వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తారు. కేవలం వారసత్వం మాత్రమే అర్హతగా రాజకీయాలను ప్రోత్సహిస్తుంటే హర్షించాల్సిన పనిలేదు. దాన్ని విమర్శించొచ్చు. కానీ అక్కడ సందర్భం ఏంటన్నది చూడలేదు. ఒకవేళ ఆయన మొదటి సారే దాని గురించి మాట్లాడారు.. ఎప్పుడూ వారసత్వం గురించి మాట్లాడలేదా అంటే.. ఓ జాడ్యంగా వారసత్వ రాజకీయాలు వద్దు అని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ మోదీ పదేళ్లుగా ఓ పార్టీని ఉద్దేశించి ఇదే మాట అంటున్నారు. దీంతో సహజంగానే ఆయన ఉద్ధేశ్యం ఏంటన్నది ఎవరికైనా ఈజీగా అర్థమైపోతోంది. ఓ ముఖ్యమైన సందర్భంలో కూడా పరోక్షంగా అయినా సరే ఈ పలుచని మాటలు ఎందుకు అన్నదే ప్రజల ప్రశ్న. 
నెల రోజుల కిందట బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ చేసిన విమర్శల్లో మెయిన్ థీమ్ అదే. అక్కడ ఆ పార్టీ అలా మాట్లాడటం సబబే.. కానీ జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ఓ రాజకీయ పార్టీని విమర్శించడానికి ఎందుకు ప్రయత్నించాలి.. ? పోనీ బీజేపీ ఏమైనా వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉందా.. ? ప్రధాని పదవికో.. ప్రధాన పదవులకో పోటీలో లేకపోవచ్చు. కానీ వాడవాడలా.. బీజేపీ వారసులు కనిపిస్తూనే ఉన్నారుగా.. వారసత్వం అంత తప్పుగా భావిస్తున్నప్పుడు.. ఆ ప్రక్షాళన ఏదో తమ పార్టీ నుంచే మొదలుపెట్టొచ్చు కదా..! ఇలా మాట్లాడటం వల్లే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రియాక్ట్ అయ్యారు. దానిపై రెండు పార్టీల మధ్య వాదులాట. ఇదంతా రోజూ జరిగేదే కదా.. కానీ ఆగస్టు 15 లాంటి ప్రత్యేకమైన రోజున కూడా అవసరమా..?

కేసీఆర్ ప్రసంగంలో కేంద్రంపై విమర్శలు ! 
తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట నుంచి ఉచితాలపై కేంద్రం అనుచితంగా ఉందని చెప్పారు. ఆయన ఆవేదన వ్యక్తం చేయడం కరెక్టే. అందుకోసం పది రోజుల కిందట ప్రెస్ మీట్ ను వినియోగించుకున్నారు. కానీ వజ్రోత్సవ వేడుకపై వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమైన హైదరాబాద్ నుంచి.. ఆయన ఏం చెప్పారు.. ? కేంద్ర యూనియన్ లో ఓ భాగమైన రాష్ట్ర భూభాగం నుంచి స్వాతంత్ర్య దినోత్సవం నాడు.. మాట్లాడటం ఏం సందేశం ఇస్తోంది.. ? అసలు కేంద్రం అమృతోత్సవాలను నిర్వహిస్తోంటే.. దానికి పోటీగా అన్నట్లు వేడుకలను నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాలను కేంద్రం చెప్పిన దాని కన్నాఘనంగా నిర్వహిస్తే మంచిదే. కానీ కేంద్రానికి ధీటుగా పోటీగా అన్నట్లు చేయడం ఎందుకు..? దేశ స్వాతంత్ర్య వేడుకలు బీజేపీ చేయడం లేదు కదా.. పోనీ బీజేపీ ప్రభుత్వ కార్యక్రమం ఆ ప్రభుత్వమే తీసుకొచ్చింది కూడా కాదు. 75 ఏళ్లుగా జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రతి భారతీయుడికీ భాగం ఉంటుంది. జాతి మొత్తం సమైక్యంగా జరుపుకునే ఈ పండుగను ఓ రాజకీయ పార్టీపై కోపంతోనో.. ఇంకో రాజకీయ లక్ష్యంతో విడిగా నిర్వహించాలనుకోవడం ఎందుకు.. ? స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గవర్నర్ గౌరవంగా ఇచ్చే తేనీటి విందు ఎట్ హోం కార్యక్రమానికి కుడా హాజరు కాకపోవడం ఎందుకు.. ఎంతటి విబేధాలున్నా ఇలాంటి సందర్భాల్లో రాజకీయ నాయకులు పరిపక్వత చూపాలి. ఇప్పుడు కూడా అలానే ప్రవర్తించడం ఏం శోభనిస్తుంది..!
బీజేపీ ప్రత్యర్థిగా ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ అవే విమర్శలు ! 
ఇక ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పంద్రాగస్టు ప్రసంగంలో జాగ్రత్త వహించినప్పటికీ.. గవర్నర్ తేనీటి విందులో మాత్రం ప్రతిపక్షాలతో దూరం పాటించారు. ఇక్కడ ఆయనొక్కరే కాదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా జగన్ ను పలకరించాలి. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిని కలవడం మర్యాద. మిగతా రాజకీయాలు ఎలా ఉన్నా.. ఇలాంటి సందర్భాల్లో అయినా హుందాగా వ్యవహరించాలి. ఇక్కడ ఇద్దరూ అలాగే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. కేజ్రీవాల్, మమతాబెనర్జీ వంటి.. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ నేతలు కూడా పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్రంపై విమర్శల వర్షాన్ని కురిపించిన వాళ్లే. రోజూ ఎలాగూ అదే పని చేస్తున్నారు కదా.. మరి ఇప్పుడైనా సంయమనం పాటించాల్సి ఉంది కదా.
దేశం సాధించిన పురోగతిని గుర్తు తెచ్చుకుని స్ఫూర్తి పొందలేమా ? 
వజ్రోత్సవాల వేళ మనం మాట్లాడుకునే అంశాలే లేవా.. ఒకప్పుడు తిండి దొరక్క ఇబ్బందులు పడ్డ దేశంలో నేడు ధాన్యాగారంగా మారింది. దాదాపు 150 దేశాలకు గోధుమ, ధాన్యాన్ని ఎగుమతి చేయగలుగుతున్నాం. హరిత విప్లవం, పాల విప్లవం, నీలి విప్లవం ఇలా అన్నింటిలో ప్రపంచంలో మేటిగా నిలిచాం. కనీసం 10 శాతం పల్లెలకు కూడా కరెంటు లేని కాలం నుంచి.. ఇప్పుడు ప్రతి ఇంటికీ విద్యుత్, గ్యాస్ అందించగలుగుతున్నాం. ఇలా చాలా దేశాలు అభివృద్ధి చెందినా.. భౌగోళికంగా.. సామాజికంగా అనేక అసమానతలు ఉన్న మనం చేయడం కచ్చితంగా గొప్పే. 500 కు పైగా సంస్థానాలు కలిసి ఒక్కటిగా నిలిచిన ఈ దేశం మళ్లీ అన్ని ముక్కలు అవుతుందని.. వందల కోద్దీ జాతులు, వేల కోద్దీ భాషలు, యాసలు ఉన్న ఈ ప్రాంతం ఒక్కటిగా నిలవలేదు అని చాలా దేశాలు అనుకున్నాయి. వాటన్నింటికీ మనం నిలిచి.. ఎదిగి చూపించాం. ఒకప్పటి ఘనకీర్తి గగనాంతరాలకు చాటేలా, రోదసీలోకి మానవ సహిత గగనయాత్రకు సిద్ధం అవుతున్నాం. మందు బిళ్లలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఫార్మా దిగ్గజంగా ఎదిగాం. మనల్ని పాలించిన హేళన చేసిన దేశాల్లోనే గర్వంగా తలెత్తుకునేలా నిలిచాం. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులదే హవా.. మనల్ని పాలించిన బ్రిటన్ ను ఓ భారతీయుడు ఏలేందుకు ఓ అడుగు దూరంలో ఉన్నాడు. విశ్వక్రీడావేదికలపై మన జెండా ఎగురుతోంది. మన తెలుగు రాష్ట్రాలు కూడా గర్వంగా చెప్పుకునే అనేక విషయాలున్నాయి. ఇవన్నీ వదిలి పెట్టి.. రాజకీయ రొచ్చులో కాలం వెళ్లదీయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాజకీయ పార్టీ ఎజెండాలే అసలు కారణం !
అయితే ఇది ఎందుకు వచ్చిందన్నది కూడా చూడాలి. ఇంతకు ముందెన్నడూ రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రసంగాలు చేయలేదు. మరి ఇప్పుడే ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి అంటే అన్ని వేళ్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. కేంద్రం ప్రతిరాష్ట్రాన్ని బిడ్డల్లా చూసుకోవాలి. మరి తమ బిడ్డలు ఎందుకు ఎదురుతిరుగుతున్నారు అని కూడా చూడాలి కదా.. ప్రజల్లో ఆవేశం వస్తోంది, అంటే ఎక్కడో తప్పు జరుగుతోందనే కదా. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న దేశ నేతల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేయడం, ఇంతకు ముందు లేని నేతల ప్రాధాన్యతను పెంచడం.. ఇదే అసలైన చరిత్ర అని చెప్పడం ఇవన్నీ కూడా ఘర్షణ వాతావరణానికి దారితీస్తున్నాయి. కర్ణాటక నెహ్రూ చిత్రమే లేకుండా స్వాతంత్ర పోరాట గురించి చెప్పడమే కాదు.. సావర్కర్ చిత్రాన్ని కొత్తగా చేర్చారు. చరిత్రను మారుస్తున్నారు అనే కారణంతోనే కేసీఆర్ లాంటి వాళ్లు సైద్ధాంతిక పోరు కూడా మొదలుపెట్టారు. గాంధీ చిత్రాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వమే ఉచితంగా ప్రదర్శించింది. గాంధీని తక్కువ చేసే ప్రయత్నం చేశారు అని కేసీఆర్ నేరుగా విమర్శించారు. జాతిపితకు సంబంధించి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సింది. ఇందులో ఎవరిది తప్పు అంటే.. ఇంతకు ముందు లేని పరిస్థితి ఇప్పుడు వచ్చిందంటే బాధ్యత కేంద్రానిదే అవుతుంది. ఒకవేళ రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలవి అపోహలు అని కేంద్రం చెప్పాలనుకున్నా.. అలాంటి అపోహలు కూడా రాకుండా చూసుకోవలసిన బాధ్యత వారిదే కదా..!

దేశభక్తి వేరు - రాజకీయం వేరు ! నేతలు ఎప్పుడు తెలుసుకుంటారు ?
ప్రపంచ ఆర్థిక గమనం, రాజకీయ గమనం ఓ మలుపు తీసుకోబోతున్న తరుణాన ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులు, మేధోశక్తి ఉన్న దేశంగా భారత్ ఓ కీలక మైున దశలో ఉంది. రాబోయే రోజుల్లో సూపర్ పవర్ గా ఎదిగేందుకు అన్ని విధాలుగా అర్హతలు కలిగి ఉంది. ఇలాంటి తరుణంలో జాతి మొత్తాన్నిఒక గమనం వైపు నడిపించాల్సిన రాజకీయ నిర్ణాయక శక్తులు.. ఇలా తలోదారిలో నడవడం ఏమాత్రం వాంఛనీయం కాదు.


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన రైలు, విశాఖ రైల్వే స్టేషన్లో ఘటన- పలు సర్వీసులకు అంతరాయం
Embed widget