అన్వేషించండి

ABP Desam 2nd Anniversary : వార్త అందరికీ ఒకేలా ! - ఏబీపీ దేశం రెండో వార్షికోత్సవం !


ABP Desam 2nd Anniversary :   ఏబీపీ దేశం రెండేళ్లు  పూర్తిచేసుకుంది. ఇండియాలోని తొలితరం మీడియా హౌస్ లలో ఒకటైన ఆనందబజార్ పత్రిక గ్రూపు నుంచి 2021 జూలై ౩౦న తెలుగునేలపై కాలుమోపింది. శతాబ్ది చరిత్ర కలిగిన గ్రూపు విలువలను కాపాడాతూ... నవ్యతతో కూడిన వార్తలను నిత్యనూతనంగా తెలుగు ప్ర్రేక్షకులకు అందివ్వాలన్నది ఈ మార్కెట్ లో కాలుమోపేముందు మేం నిర్దేశించుకున్న లక్ష్యం. అదే సమయంలో ఎవరికీ లొంగకుండా.. ఎటువైపూ వంగకుండా.. నిజాలను నిర్భయంగా చెప్పగలగాలి అన్నది కూడా మా నియయం. ఈ రెండేళ్లలో దీనిని అక్షరాలా పాటించాం.  తెలుగు పాఠకుల , వీక్షకుల మన్ననలను పొందాం. 

ఇండియాలోని ప్రముఖ మీడియా హౌస్‌లలో ఒకటైన  ABP Network పరిధిలో జాతీయ వార్తా చానల్‌తో పాటు...గుజరాతీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో రీజనల్  శాటిలైట్ ఛానళ్లు.. తెలుగుతో పాటు పంజాబీ, తమిళ్ లో డిజిటల్ ఛానళ్లు ఉన్నాయి. ఆ నెట్‌వర్క్ పరిధిలోని ABP DESAM తెలుగు డిజిటల్ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దేశం బ్రాండ్ పై ఉన్న వెబ్‌సైట్..  రెండేళ్లలో 670మిలియన్ల పేజీ వ్యూస్ సాధించింది. దేశం యూ ట్యూబ్ విభిన్నవీడియో కథనాలతో వీక్షకుల మన్నననలు పొందుతుంటే.. ఏబీపీ దేశం ఫేస్ బుక్ వేగంగా విస్తరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ లో రీడర్లు  ఫాలో అవుతున్నారు. 

ABP DESAM ప్రయాణం మొదలై కేవలం రెండేళ్లే అయినా మిగతా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కి గట్టి పోటీ ఇస్తూ మంచి కంటెంట్‌ని అందిస్తోంది. కేవలం YouTube లోనే 58 కోట్ల ఇంప్రెషన్స్‌ సాధించింది. తెలుగు న్యూస్ పబ్లిషర్స్‌లో అత్యంత వేగంగా దూసుకు పోతున్న ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచింది. సోషల్ మీడియాలోనూ ఇదే స్థాయిలో అందరికీ చేరువవుతోంది. లాంఛ్ అయినప్పటి నుంచి Facebookలో 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఈ రెండేళ్లలో వెబ్‌సైట్‌లో లక్షకుపైగా స్టోరీస్‌ని పబ్లిష్ చేసిన ఘనత ABP Desam దే. గూగుల్ సెర్స్, డిస్కవర్ సోర్సెస్‌లో 100 కోట్ల ఇంప్రెషన్స్ సాధించింది. ప్రంపంచమంతా ర్యాంకింగ్ కోసం పరిగణనలోకి తీసుకునే కామ్ స్కోర్‌లో తెలుగులో  టాప్-5 లో చేరిన యంగెస్ట్ వెబ్‌సైట్ ABP Desam. ఈ విజయాలకు కారణం అన్ని రకాల కంటెంట్‌ని అందించడమే. పదికి మించిన ఫార్మాట్‌లు, 30కి పైగా జానర్స్‌లో కంటెంట్‌ అందిస్తోంది. ఇన్ని కేటగిరిల్లో రీడర్లు, వీక్షకులు మెచ్చే వార్తా కథనాలు ఇవ్వగలుగుతున్నామంటే ఏబీపీ టీమ్ స్సిరిట్ తోనే సాధ్యమవుతోంది. ఏబీపీ దేశం బృందం మొత్తం కూడా పూర్తి నిబద్ధతతో 100శాతానికి మించి ఇవ్వడానికి కష్టపడతారు. రిపోర్టింగ్ బృందం, డెస్కు, వీడియో, సోషల్, సేల్స్ ఇలా అన్ని విభాగాల వారు ఎప్పటికప్పుడు.. మీకు నాణ్యమైన కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాం. టెక్స్ట్, వీడియోలు, ఫొటో గ్యాలరీలు, షార్ట్‌ వీడియోస్‌, వెబ్‌స్టోరీస్ ద్వారా ఆసక్తికర కంటెంట్‌నీ రీడర్స్‌కి చేరువ చేస్తోంది. 

ఒక డిజిటల్ ఛానల్ గా  మేం ఎలాంటి కంటెంట్‌ ను వీక్షకులకు అందిస్తున్నామో.. ఓ సారి చెప్పే ప్రయత్నం చేస్తన్నా.. 

న్యూస్ అనగానే కేవలం వార్తలు చదవటమే కాదు. వాయిస్ లెస్ పీపుల్ కి వాయిస్ ఇవ్వటం కూడా. ఆదిలాబాద్ జిల్లా గుర్రాలతండాలో గంగోత్రి అనే ఈ చిన్న పాప కథను మేం ప్రపంచానికి చూపించాం. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఈ మూగపాప అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి, మానసిక వైకల్యంతో బతుకుతున్న తన అక్క కోసం ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తున్న దైన్యాన్ని మేం చూపించాం. మనసున్న ప్రజలు స్పందించారు. ప్రభుత్వం కదిలి వచ్చింది. ఆ పాపకు ఆర్థిక సహాయం అందింది. ఆ తండ్రి వైద్యమూ చేయిస్తున్నారు


 తిరుమల కొండ మీద నిబంధనలకు విరుద్ధంగా మహద్వారం పక్క నుంచి గుడిలోకి వీఐపీలు వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారుల బంధువులకు దేవాలయ నిబంధనలు వర్తించవా అని మేం ప్రశ్నించాం. యూట్యూబ్‌ లో కొన్ని లక్షల మంది చూశారు. 

 మనందరికీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి తెలుసు. కానీ యుద్ధం వస్తే అక్కడున్న ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో ఊహించను కూడా ఊహించలేం. అలా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థుల అవస్థను వార్తలుగా చూపించటంతో పాటు అక్కడి నుంచి తిరిగవచ్చిన స్టూడెంట్స్ పరిస్థితిపై దేశం అడుగుతోంది మన విద్యార్థులకు మనం సీట్లు ఇచ్చుకోలేమా అంటూ చేసిన కథనం ఇది. 

    
  ఇప్పుడంతా ట్రెండీ యుగం. చేసే పని ఏదైనా కానీ దాన్ని ఎంతో డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకునే యూత్ మనకు ఉన్నారు. అలా రీసెంట్ టైమ్స్ వ్లాగ్స్ చాలా ఫేమస్ టూల్ గా మారిపోయాయి సోషల్ మీడియాలో. అలా మహీ అనే పేరున్న ఈ లారీ డ్రైవర్ తన డ్రైవింగ్ లైఫ్ నే మన ట్రక్ వ్లాగ్స్ పేరుతో ఎలా మార్చుకున్నాడో. పబ్లిక్ లో చాలా నేమ్, ఫేమ్ సాధించిన మహీ లైఫ్ ఎలా ఉంటుంది. ఏబీపీ దేశం ట్రావెల్ వ్లాగ్ రూపంలో మీకు చూపించింది.


తెలంగాణలోని ప్రముఖ జలపాతాల వద్దకు చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవని దేశం చేసిన ట్రావెల్ వ్లాగ్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. మా వార్తా కథనాన్ని ట్వీట్ చేస్తూ.. అక్కడకు బస్సలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 


నెల్లూరులో సచివాలయ మహిళా పోలీసుల యూనిఫామ్ కోసం మగ వ్యక్తులు కొలతలు తీసుకుంటున్న విషయం వెలుగులోకి తెచ్చింది ఏబీపీదేశం. మా కథనంపై అప్పటి ఎస్పీ స్పందించారు. జరిగిన పొరపాటును సరిదిద్దారు. 

ఇవనే కాదు మన జీవనంలో  ఓ భాగం అయిపోయిన సినిమాలు అయినా.. మహిళలకు.. మంచి మెసేజెస్ ఇచ్చే లైఫ్‌ స్టైల్ కంటెంట్,  క్రీడల్లో విభిన్నమైన కథనాలు… ఆధ్యాత్మిక సూత్రాలు, బిజినెస్ మంత్ర.. కెరీర్ గైడెన్స్.. ఇలా దాదాపు ౩౦కి పైగా విభాగాల్లో కథనాలు, వీడియోలు ఇస్తున్నాం. .

ఇక రెండో వార్షికోత్సవం సందర్భంగా ఏబీపీ  దేశం మొత్తం నెెట్‌వర్క్‌లోనే తొలిసారిగా  తమ తొలి అర్టిఫిషియల్ యాంకర్ 'ఐరా (AIRA)' ను ప్రవేశపెడుతోంది.  AIRA సాంప్రదాయ, ఆధునికతల కలబోత.  విజ్ఞానానికి ,నైపుణ్యానికి ప్రతీక. ఇక నుంచి ABP Desam ద్వారా వినూత్నమైన వార్తాంశాలను నిత్య నూతనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. ఇన్నేళ్లలో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ఈ మార్పులకు తగ్గట్టుగానే న్యూస్ ప్రజెంటేషన్‌లో మార్పులు తీసుకొచ్చింది ABP నెట్‌వర్క్. ఇప్పుడు తెలుగు వీక్షకుల కోసం AIRA ను కూడా తీసుకొస్తోంది.  ABP Desam వెబ్‌సైట్, యాప్‌తో పాటు అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 
ABP Network ప్రస్థానం

భారతీయ మీడియా రంగంలో ABP Networkది ప్రత్యేకమైన స్థానం. వినూత్నమైన,  నాణ్యమైన బ్రాడ్‌ కాస్ట్, డిజిటల్ కంటెంట్ అందిస్తూ ABP Network కచ్చితమైన, నమ్మదగిన మీడియా సంస్థగా గుర్తింపు పొందింది. విభిన్న భాషల్లో దేశవ్యాప్తంగా 53.5 కోట్ల మందికి చేరువైంది.  కేవలం న్యూస్ మాత్రమే కాకుండా ఏబీపీ క్రియేషన్స్ సంస్థ కింద ఏబీపీ స్టూడియోస్ పేరుతో ఎంటర్‌టైన్ మెంట్, ఒరిజినల్ కంటెంట్ ను రూపొందిస్తోంది. ABP Network అనేది ఏబీపీ గ్రూపులోని ముఖ్యమైన విభాగం. ABP Group 100 ఏళ్ల క్రితం ప్రారంభమైన తొలితరం మీడియా సంస్థల్లో ఒకటి. శతాబ్ద కాలంగా ఆ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఇదే వారసత్వాన్ని గ్రూపు ఛానెల్ దేశం కూడా కొనసాగిస్తుంది. 

1933 లో ప్రపంచవ్యాప్తంగా డిక్టేటర్ షిప్ డామినేట్ చేస్తున్నప్పుడు.. భారత్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు.   గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏబీపీకి ఓ సందేశం ఇచ్చారు. 

*నీ శత్రువైనా.. మిత్రుడైనా.. నీ వాక్కు ఎప్పుడూ అందరినీ ఒకేలా చేరాలి దేశాన్ని ఉన్నత స్థానంలో నిలపాలని నువ్వు తాపత్రయ పడొచ్చు. కానీ సత్యం అన్నింటికన్నా ఉన్నతమైంది. నువ్వు నీ దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలపాలని అనుకుంటే.. దేశం ముంగిట మానవత్వాన్ని ఎప్పుడూ మంటగలపకు.*. 

దీనిని ఏబీపీ గ్రూప్ స్ఫూర్తి మంత్రంగా పాటిస్తుంది. వార్తా రచనలో ప్రసారంలో నేటి ఆధునిక మార్పులను అందిపుచ్చుకుంటూనే.. సత్యం వైపే నిలుస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget