అన్వేషించండి

Gig Worker Demands: దేశవ్యాప్తంగా నేడు గిగ్ వర్కర్స్ ఎందుకు సమ్మె చేస్తున్నారు? ఓలా ఉబర్ లేదా ర్యాపిడో డ్రైవర్ల డిమాండ్లు ఏంటీ? 

Gig Worker Demands: నేడు ఓలా ఉబర్ లేదా ర్యాపిడో బంద్ అయ్యాయి. డ్రైవర్ల సమ్మెతో యాప్ ఆధారిత వాహనాలు రోడ్లపైకి రావడం లేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత వాహన డ్రైవర్లు సమ్మెకు దిగారు.
  • కనీస ఛార్జీలు పెంచాలని, పని గంటలు నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.
  • కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నా తమకు న్యాయం జరగడం లేదంటున్నారు.
  • ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిక.

Gig Worker Demands: ఆఫీస్‌కో, ఎయిర్‌పోర్టుకో వెళ్లడానికి ఓలా ఉబర్ లేదా ర్యాపిడో బుక్ చేస్తున్నారా? అవ్వడం లేదా. అయితే ముందు ఈ వార్తను చదవాల్సిందే. శనివారం నాడు దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత వాహనాల డ్రైవర్లు పెద్ద ఎత్తున సమ్మెకు దిగుతున్నారు. వీళ్లనే గిగ్ వర్కర్స్ అంటారు. దీని వల్ల మెట్రో నగరాల నుంచి పల్లెల దాక క్యాబ్, ఆటో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. 

అసలేం జరుగుతోంది? ఎందుకీ గొడవ?

ప్రతి రోజూ మనల్ని ఎంతో సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే ఈ డ్రైవర్ల జీవితాల్లో మాత్రం భద్రత అనేది కరవైంది. ఎన్నాళ్ల నుంచో తమ గోడు వినాలని కోరుతున్నా కంపెనీలు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో వీరంతా ఇప్పుడు స్టీరింగ్ వదిలి ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. 

డ్రైవర్ల బాధలేంటి? వారి డిమాండ్లు ఏంటీ?

వినియోగదారులు కట్టే డబ్బుల్లో సగం కంపెనీలకే పోతోంది. ఇందులో తమకు ఏం మిగలడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కనీసం ఛార్జీల నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్న వేళ తమకు బేస్ ఛార్జీలు మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు. పని గంటలపై నియంత్రణ కోరుతున్నారు. పొద్దున్న మొదలు పెడితే అర్థరాత్రి దాకా పని చేసినా సరైన కూలి రావడం లేదని, దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని అంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ గానీ, ఆర్థిక భరోసా గానీ ఏం లేదని వారు బాధపడుతున్నారు. కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నా, దానికి కారణమైన డ్రైవర్లు మాత్రం పేదరికంలోనే ఉండిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పోరాటాన్ని డ్రైవర్లు ఆల్‌ ఇండియా బ్రేక్‌డౌన్‌గా పిలుస్తున్నారు. అంటే దేశ మొత్తం మీ ఒక్క యాప్ ఆధారిత వాహనం కూడా కదలకూడదన్నది వారి పంతం. ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి సమస్యలను వివరిస్తూ లేఖ రాశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని లేకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని గిగ్ వర్కర్ల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. 

సామాన్యులకు ఇబ్బందులు 

మెట్రో నగరాల్లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెల్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఇది తెలియని చాలా మంది యాప్‌లో వెహికల్స్ రావడం లేదని నెట్‌వర్క్ లేదని భావిస్తున్నారు. ఏం అయిందో తెలియక తికమత పడుతున్నారు. 

హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో పరిస్థితి కాస్త సీరియస్‌గానే ఉంది. మఖ్యంగా ఐటీ హబ్‌లు ఎక్కువగా ఉన్న చోట ఆఫీస్‌లకు వెళ్లే వేల సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆన్‌ యాప్‌లలో వాహనాలు బుక్ కాకపోవడంతో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. క్యాబ్ బుక్ చేస్తుంటే కన్ఫామ్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటోంది. దీని వల్ల ధరలను విపరీతంగా పెంచేశారు. అందుకే చాలా మంది మెట్రో రైళ్లను, ఆర్టీసీ బస్‌లను, నార్మల్ ట్యాక్సీలను బుక్ చేసుకుంటున్నారు. మరికొందరు సొంత వాహనాల్లో ఆఫీస్‌లకు వెళ్తున్నారు. 

ఈ సమ్మె ప్రభావం కేవలం ప్రయాణాలకే పరిమితం కాలేదు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి యాప్‌లైప కూడా పడింది. చాలా మంది డ్రైవర్లు ఒకేసారి అటు క్యాబ్‌లను నడుపూతనే ఈ డెలవరీ పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఆవి కూడా పని చేయం లేదు. వీరంతా సమ్మెలో పాల్గొనడంతో డెలివరీలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. 

Frequently Asked Questions

గిగ్ వర్కర్స్ ఎందుకు సమ్మె చేస్తున్నారు?

కంపెనీలు వినియోగదారుల నుండి వచ్చే డబ్బులో ఎక్కువ భాగం తీసుకుంటున్నాయని, తమకు తక్కువ మిగులుతోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నా, బేస్ ఛార్జీలు పెరగడం లేదని వాపోతున్నారు.

డ్రైవర్ల ముఖ్య డిమాండ్లు ఏమిటి?

కనీస ఛార్జీలను నిర్ణయించాలని, పని గంటలపై నియంత్రణ విధించాలని, ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ లేదా ఆర్థిక భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమ్మె వలన సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి?

మెట్రో నగరాల్లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. క్యాబ్, ఆటో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి, దీంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది.

డ్రైవర్లు తమ సమస్యలను ఎవరి దృష్టికి తీసుకెళ్లారు?

డ్రైవర్లు తమ సమస్యలను వివరిస్తూ కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
AP Coalition MLAs Controversies: ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
ఎన్ని సార్లు చెప్పినా మారని కూటమి ఎమ్మెల్యేలు - చంద్రబాబు, పవన్ ఇక చర్యలు ప్రారంభించబోతున్నారా?
Embed widget