అన్వేషించండి

Electric Scooters In India : ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటీ? ఎవరికి ఏ ఈవీ సరిపోతుందో తెలుసుకోండి!

Electric Scooters In India : ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌, టీవీఎస్, బజాజ్‌ వంటి దిగ్గజాలతో పాటు హోండా, రివర్, సింపుల్ ఎనర్జీ వంటి సుమారు 20 కంపెనీలు రంగంలో ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రజాదరణ పెరుగుతోంది.
  • ప్రభుత్వ రాయితీలు, పెరుగుతున్న ఛార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమిస్తున్నాయి.
  • ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు పలు మోడళ్లను అందిస్తున్నాయి.
  • వివిధ అవసరాలకు, బడ్జెట్లకు అనుగుణంగా అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

Electric Scooters In India : భారతీయ రోడ్లపై నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఒకప్పుడు ప్రయోగాత్మకంగా కనిపించిన ఎలక్ట్రిక్ వాహనాలు, ఇప్పుడు ప్రతి ఇంటి అవసరంగా మారిపోతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ముఖచిత్రం మార్చే దిశగా పరుగులు పెడుతున్నాయి. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 50కిపైగా ప్రధాన మోడళ్లు, వేరియంట్లతో కలిపి వందకుపైగా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఉన్న ఆప్షన్స్‌ ఏంటీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌, టీవీఎస్, బజాజ్‌ వంటి దిగ్గజాలతో పాటు హోండా, రివర్, సింపుల్ ఎనర్జీ వంటి సుమారు 20 కంపెనీలు రంగంలో ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న FAME సబ్సిడీలు, వేగంగా విస్తరిస్తున్న ఛార్జింగ్ స్టేషన్ల వల్ల వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. ముఖ్యంగా కిలోమీటర్‌కు ప్రయాణ ఖర్చు కేవలం 50 పైసలు నుంచి రూపాయి లోపే ఉండటం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట. ఎక్స్ షోరూమ్‌ ధరలు 45వేల నుంచి ప్రారంభమై ప్రీమియం మోడళ్ల వరకు 1.90 లక్షల వరకు పలుకుతున్నాయి. 

వేగం, టెక్నాలజీలో మేటీ ఓలా- ఏథర్‌

యువతను, టెక్నాలజీ ప్రియులను ఆకట్టుకోవడంలో ఓలా, ఏథర్‌ సంస్థలు ముందు వరసలో ఉన్నాయి. 

ఓలా ఎస్‌1 ప్రో

ఇది పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌. దీని దర 1.30 లక్షల నుంచి 1.55 లక్షల మధ్య ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 141కిలోమీటర్ల వరకు ఉంటుంది. కేవలం 2 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఉన్న టీఎఫ్టీ డిస్‌ప్లే, రీజెన్ బ్రేకింగ్, హైపర్ ఛార్జర్‌ ద్వారా 15 నిమిషాల్లోనే 50 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 

ఏథర్‌ 450ఎక్స్‌: 

ఏథర్‌ 450ఎక్స్ ధర 1.48 నుంచి 1.68 లక్షల వరకు ఉంటుంది. ఇది తన ప్రీమియం బిల్డ్ క్వాలిటీకి, గూగుల్ మ్యాప్స్‌ నావిగేషన్‌ వంటి స్మార్ట్ ఫీచర్లు ప్రసిద్ధి. దీని రేంజ్ సుమారు 161 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 

కుటుంబ అవసరాలకు సరిపడే ఫ్యామిలీ స్కూటర్లు

మీరు కుటుంబం మొత్తం వాడుకోవడానికి, ఎక్కువ సీటు వెడల్పు, స్టోరేజ్‌ కావాలనుకుంటే ఈ కింది ఆప్షన్స్ ట్రై చేయవచ్చు. 

ఏథర్‌ రిజ్టా: ఏథర్ నుంచి వచ్చిన మొదటి ఫ్యామిలీ స్కూటర్ ఇది. దీని ధర 76 వేల నుంచి 1.12 లక్షల వరకు ఉంది. విశాలమైన సీటు, ఎక్కువ లెగ్ స్పేస్‌ దీని ప్రత్యేకతలు. 

బజాజ్ చేతక్‌: 

పాత జ్ఞాపకాలను ఆధునిక హంగులతో తీసుకొచ్చే చేతక్‌, రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటోంది. దీని ర 1.07 లక్షల నుంచి 1.40 లక్షల వరకు ఉంది. ఇది క్లాసిక్‌ లుక్ ఇష్టపడే వారికి, మెటల్ బాడీ కోరుకునే వారికి సరైంది. 

టీవీఎస్‌ ఐక్యూబ్‌: 

నమ్మకమైన సర్వీస్‌ నెట్‌ర్క్ కావాలనుకునే వారికి ఐక్యూబ్‌ బెస్ట్ ఛాయిస్‌. దీని రేంజ్ వేరియంట్లను బట్టి 123 నుంచి 212 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 

బడ్జెట్‌లో కొత్తగా ప్రయోగం చేయాలంటే...

డబ్బును ఆదా చేస్తూనే ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వారికి ఉన్న ఆప్షన్లు ఒకసారి చూద్దాం. 

హీరో విడా వీఎక్స్‌ 2

దీని ధర 45వేల నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బాస్‌ ఆప్షన్ ద్వారా బ్యాటరీని అద్దెకు తీసుకొని, ప్రారంభ ధరను భారీగా తగ్గించుకోవచ్చు.

హోండా యాక్టివా ఈ: హోండాపై ఉన్న నమ్మకంతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్కూటర్‌ 1.18 లక్షల ధరతో అందుబాటులో ఉంది.  ఇది హ్యాండ్లింగ్‌పరంగా చాలా సులభంగా ఉంటుంది. 

సింపుల్‌ వన్ జెన్‌ 2

రేంజ్ విషయంలో ఇది అందరికంటే ముందుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 265 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. 

ఎవరికి ఏది ఉత్తమం?

తక్కువ ప్రయాణాలు చేసే వారికి అంటే 50 కిలోమీటర్ల లోపు ట్రావెల్ చేసే వారికి హీరో విడా లేదా టీవీఎస్‌ ఆర్బిటర్‌ వంటివి సరిపోతాయి. ఇవి తక్కువ మెయింటెనెన్స్‌తో ఉంటాయి. ఏథర్‌ రిజ్తా లేదా బజాజ్‌ చేతక్‌ కుటుంబ అవసరాల కోసం చూసే వారికి బెస్ట్ అని చెప్పవచ్చు. సామాన్లు పెట్టుకోవడానికి ఎక్కువ స్థలం ఉంటుంది. లాంగ్ డ్రైవ్ చేసే వారికి  సింపుల్ వన్ జెన్ 2 లేదా ఓలా ఎస్‌1 ప్రో హై వేరియంట్లను పరిశీలించవచ్చు. టీవీఎస్‌, హోండా, బజాజ్‌ సంస్థలకు దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్లు ఉండటం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండవు. 

Frequently Asked Questions

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎంత నుండి ప్రారంభమవుతాయి?

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు ₹45,000 నుండి ప్రారంభమై, ప్రీమియం మోడళ్లకు ₹1.90 లక్షల వరకు ఉంటాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్లు కిలోమీటర్‌కు ఎంత ఖర్చు అవుతుంది?

ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రయాణ ఖర్చు కిలోమీటర్‌కు కేవలం 50 పైసల నుంచి రూపాయి లోపే ఉంటుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు చాలా ఆదా చేస్తుంది.

కుటుంబ అవసరాలకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనుకూలంగా ఉంటాయి?

కుటుంబ అవసరాల కోసం, ఎక్కువ సీటు వెడల్పు, స్టోరేజ్‌ కావాలనుకునే వారికి ఏథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌ వంటి స్కూటర్లు మంచి ఎంపికలు.

కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఏయే కంపెనీలు అందుబాటులో ఉన్నాయి?

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌, టీవీఎస్‌, బజాజ్‌, హోండా, రివర్, సింపుల్ ఎనర్జీ వంటి దాదాపు 20 కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget