Vijay Setupathi Cars: మక్కల్ సెల్వన్‌కు కార్ల పిచ్చి ఎక్కువే - ఏకంగా ఏడు కార్లు - లగ్జరీ మోడల్స్ కూడా!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దగ్గర ఎన్ని కార్డు ఉన్నాయో తెలుసా?
Vijay Setupathi Car Collection: ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘ఫర్జీ’తో బాలీవుడ్‌లో కూడా లేటెస్ట్ సెన్సేషన్‌గా మారాడు. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పట్నుంచో హీరోగా, విలన్‌గా నిలదొక్కుకున్నాడు. విజయ్ సేతుపతికి కార్ల మీద కూడా ఎంతో ఇష్టం ఉంది. తన గ్యారేజ్‌లో ఎన్నో కార్లు ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి పెద్ద లగ్గరీ సెడాన్లు, ఎస్‌యూవీల వరకు ఉన్నాయి. తన దగ్గర ఏ కార్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 (Hyundai Grand i10)
విజయ్ సేతుపతి మొదట కొనుగోలు చేసిన కారు ఇదే. ఇది రెడ్ కలర్ మోడల్. ఇది ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ అయినప్పటికీ ఇందులో అన్ని మోడర్న్ ఎక్విప్‌మెంట్స్ కూడా ఉన్నాయి. దీని ధర రూ. ఐదు నుంచి రూ. ఎనిమిది లక్షల మధ్య ఉండనుంది.
పాత మెర్సిడెస్ బెంజ్ 230 (Old Mercedes Benz 230)
పాత మెర్సిడెస్ బెంజ్ 230డీ సెడాన్ బాడీని మాత్రం తీసుకుని అప్‌డేట్ చేసిన ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌తో ఈ కారు లాంచ్ అయింది. దీన్ని విజయ్ సేతుపతి తనకు తగ్గట్లు మాడిఫై చేయించుకున్నారు.
మెర్సిడెస్ బెంజ్ జీ - వాగన్ (Mercedes Benz G-Wagon)
ఇందులో ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మోడల్‌ను విజయ్ సేతుపతి కొనుగోలు చేశారు. ఈ కారు ముందువైపు మధ్యలో ‘V’ అనే లోగో కూడా చూడవచ్చు. దాన్ని విజయ్ సేతుపతి తన పేరులో మొదటి అక్షరంతో మ్యాచ్ అయ్యేలా దీన్ని డిజైన్ చేశారు. దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్లుగా ఉంది.
బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)
విజయ్ సేతుపతి దగ్గర ఉన్న ప్రీమియం లగ్జరీ కార్లలో ఇది కూడా ఒకటి. అంతే కాకుండా ఇది పవర్ ఫుల్ మోడల్ కూడా. దీని ధర 1.42 కోట్ల నుంచి రూ.1.76 కోట్ల మధ్య ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.
మినీ కూపర్ (Mini Cooper)
విజయ్ సేతుపతి కార్ల గ్యారేజ్‌లో ఉన్న చిన్న కార్లలో ఇది ఒకటి. కానీ ఇది ప్రీమియం ఆప్షన్. చెన్నై రోడ్ల మీద ఈ కారులో విజయ్ సేతుపతి చాలా సార్లు కనిపించాడు. దీని ధర రూ. 40 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 121 బీహెచ్‌పీ పవర్, 160 ఎన్ఎం టార్క్‌ను ఈ కారు అందించనుంది.
టొయోటా ఫార్ట్యూనర్ (Toyota Fortuner)
టొయోటా ఫార్ట్యూనర్‌ను విజయ్ సేతుపతి షూటింగ్‌లకు వెళ్లడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సెవెన్ సీటర్ ఎస్‌యూవీలో 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్, 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.31.79 లక్షల నుంచి రూ.44.63 లక్షల వరకు ఉంది.
టొయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Inniva Crysta)
విజయ్ సేతుపతి లిస్ట్‌లో ఈ కారు కూడా ఉంది. దీని ధర రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్యలో ఉంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి, రావడానికి దీన్ని విజయ్ సేతుపతి ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న బెస్ట్ కార్లలో ఇది కూడా ఒకటి.