Viaterra M200 రెయిన్ ప్యాంట్ రివ్యూ - బైకర్లకు వర్షంలో ఎంత వరకు ఉపయోగపడుంది?
Viaterra M200 రెయిన ప్యాంట్ అనేది బైక్ రైడర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వర్షపు ప్యాంట్. ఫీచర్లు, కంఫర్ట్, పొడవైన రైడర్లకు ఉన్న ఇబ్బందులు వంటివన్నీ ఈ రివ్యూలో క్లియర్‌గా తెలుసుకోండి.

Viaterra M200 Rain Pants Price And Review: మన దేశంలో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు రోడ్ జారిపోతుందో చెప్పలేము. అందుకే వర్షాకాలపు రక్షణలు బైక్ రైడర్లకు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో, వియాటెర్రా (Viaterra) బ్రాండ్ నుంచి వచ్చిన కొత్త M200 రెయిన్ ప్యాంట్స్ ప్రస్తుతం బైక్ రైడర్లను ఆకట్టుకుంటాయి. బైక్ రైడర్స్ గ్రూప్‌లో ఈ ప్యాంట్స్ గురించి షేర్ చేస్తున్నారు, చర్చించుకుంటున్నారు. అయితే, ఇవి నిజంగా ఉపయోగకరమా? ధరకు తగ్గ విలువ ఉన్న ఆప్షనా? అనేది ఈ రివ్యూలో క్లియర్‌గా అర్ధం చేసుకుందాం.
వియాటెర్రా M200 రెయిన్ ప్యాంట్స్ డిజైన్
ముందుగా డిజైన్ విషయానికొస్తే, M200 ప్యాంట్స్‌ను బైక్ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా రూపొందించారు. ముఖ్యంగా, వర్షం పడుతున్నప్పుడు ఆలస్యం లేకుండా వెంటనే ధరించగలగడం చాలా కీలకం. ఈ విషయంలో M200 పక్కాగా పని చేస్తుంది. ప్యాంట్ రెండు వైపులా, వెనుక భాగంలో YKK వాటర్ రెసిస్టెంట్ జిప్పర్లు ఉన్నాయి, అవి కాలి మడమ నుంచి మోకాలి వరకు ఓపెన్ అవుతాయి. అందువల్ల ఫుల్ సైజ్ రైడింగ్ బూట్స్‌తో ఉన్నా కూడా బాగా సులభంగా వేసుకోవచ్చు. ఇది బైక్ రైడర్లకు చాలా పెద్ద ప్లస్ పాయింట్.
బరువు కూడా తక్కువగా ఉండటం, చిన్నగా మడత పెట్టుకుని బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకోగలగడం వంటివి ప్రాక్టికల్ యూజ్‌లో బాగా హెల్ప్ అవుతుంది. పైగా, లెగ్ భాగంలో ప్రీ-కర్వ్డ్ డిజైన్ ఉండటం వల్ల బైక్‌పై కూర్చుని ఉండగా కంఫర్ట్ బాగా ఉంటుంది. నడుము & మోకాలు ప్రాంతాల్లో ఉన్న రిఫ్లెక్టివ్ ప్యానెల్స్ రాత్రి పూట రైడింగ్‌లో విజిబిలిటీ పెంచుతాయి. ఇవన్నీ రైడర్లను దృష్టిలో పెట్టుకుని చేసిన మంచి అడిషన్స్.
కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి
కానీ, వియాటెర్రా M200 రెయిన్ ప్యాంట్ ఉపయోగిస్తున్నప్పుడు రెండు చిన్న ఇష్యూలు బయటపడ్డాయి. నడుము భాగంలో ఉన్న గ్రిప్పీ ఎలాస్టిక్ చాలా బాగా పట్టుకుంది. ప్యాంటు సరిగ్గా ప్లేస్‌లో ఉంటుంది. కానీ, ఇదే గ్రిప్ ప్యాంట్ దిగువ భాగంలో (హెమ్ వద్ద) అంతగా పని చేయడం లేదు. బూట్ చుట్టూ టైట్‌గా పట్టుకునేలా లేకపోవడం వల్ల లాంగ్ రైడ్స్‌లో నీటిని లోపలికి రానివ్వకుండా ఆపేసే ప్రొటెక్షన్ కొంచెం తగ్గిపోతుంది. ముఖ్యంగా కొంచెం పొడవైన రైడర్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్యాంట్ లెంగ్త్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది. బూట్ మీద నుంచి స్లిప్ అయ్యే అవకాశమూ ఉంది.
ఇదే సిస్టమ్ డెకాథ్‌లాన్ Btwin రెయిన్ ట్రౌజర్స్‌లో (Decathlon Btwin rain trousers) ఉంటుంది. ఎన్ని రైడ్స్ చేసినా బూట్ మీద నుంచి ప్యాంట్ పక్కగా గట్టిగా కట్టుకొని ఉండటం వల్ల నీళ్లు లోపలికి రాకుండా బాగా హెల్ప్ అవుతుంది. Viaterra కూడా ఇదే అడిషన్ ఇస్తే M200 పర్ఫెక్ట్ ప్యాంట్ అయ్యేది.
ధర
Viaterra M200 రెయిన్ ప్యాంట్ ధర రూ. 1,849. ఈ రేంజ్‌లో మార్కెట్లో మరికొన్ని ఆప్షన్లు ఉన్నా, M200 మాత్రం ప్రత్యేకంగా బైక్ రైడర్ల కోసం డిజైన్ చేసిన ఫీచర్లు కలిగి ఉంది. క్వాలిటీ, మెటీరియల్, జిప్పర్ క్వాలిటీ - అన్నీ ప్రీమియం ఫీలింగ్ ఇస్తాయి. అయితే మీరు పొడవైన రైడర్ అయితే, ఈ ప్యాంట్ లెంగ్త్ మీకు సరిపోకపోవచ్చు.
మీరు పొడవైన రైడర్ కాకపోతే, తరచుగా రైడింగ్ చేస్తుంటే, క్వాలిటీ & ఫీచర్స్ ప్రాధాన్యంగా Viaterra M200 రెయిన్ ప్యాంట్స్ మంచి ఆప్షన్. ఉపయోగకరమైన డిజైన్, లైట్‌వెయిట్, రిఫ్లెక్టివ్ సేఫ్టీ, కంఫర్ట్ వంటివన్నీ ఒకే ప్యాకేజీలో రావడం నిజంగా మంచి విషయం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















