New Trend In Cars: ఇప్పుడు సన్‌రూఫ్ కాదు, సన్‌బ్లైండ్స్! కార్ బయ్యర్స్ మైండ్‌సెట్ ఎలా మారిపోయిందో తెలుసా?
భారత కార్ మార్కెట్లో ఇప్పుడు సన్‌రూఫ్ కంటే సన్‌బ్లైండ్స్‌కే డిమాండ్ పెరిగింది. లగ్జరీ కార్ల నుంచి మాస్ కార్ల వరకూ ఈ ఫీచర్ వేగంగా ట్రెండ్‌గా మారుతోంది.

Car Sunblinds Trend India 2025: భారత కార్ మార్కెట్ ఎంత వేగంగా మారిపోతుందో వివరించే స్టోరీ ఇది. ఒకప్పుడు, సన్‌రూఫ్ (Car Sunroof ) ఉంటేనే కార్ ప్రీమియంగా, లగ్జరీగా అనిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లగ్జరీ సెగ్మెంట్‌లో కూడా బయ్యర్స్ అసలు సన్‌రూఫ్ గురించి అడగడం కూడా తగ్గిపోతుంది. వాళ్లు ఇప్పుడు చూసేది మరొకటి ఉంది, అదే సన్‌బ్లైండ్స్!
ఈ ట్రెండ్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?
ఇప్పుడు కార్లలోకి సన్‌బ్లైండ్స్ ట్రెండ్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అన్నదే ఇప్పుడు ఆటోమొబైల్ సర్కిల్స్‌లో పెద్ద డిస్కషన్‌గా మారింది. 2012లో, BMW భారత మార్కెట్లోకి F30 3 Seriesను తెచ్చినప్పుడు ఒక పెద్ద తప్పిదం చేసింది, సన్‌రూఫ్ పెట్టలేదు. “భారత్ అనేది హాట్ కంట్రీ. ఇక్కడ ఏడాదిలో 9 తొమ్మిది నెలలు మండుతూనే ఉంటుంది. మరి, కారుకు సన్‌రూఫ్ పెట్టుకుని లోపల ఇంకా వేడిని పెంచుకోవడం ఎందుకు?, సన్‌రూఫ్ ఉన్న కారును కొని లోపల మరో హీట్ ఎవరు పెంచుకుంటారు?” అని మ్యూనిక్ నుంచి వచ్చిన ప్రొడక్ట్ మేనేజర్ నిర్ణయించాడు. కానీ భారత బయ్యర్స్ ఇచ్చిన సమాధానం మాత్రం చాలా క్లియర్ - సన్‌రూఫ్ అంటే హీట్ కాదు, స్టేటస్. దీంతో, సన్‌రూఫ్ లేకపోవడం వల్ల 3 Series సేల్స్ కూడా దెబ్బతిన్నాయి. తమ తప్పిదం తెలుసుకుని 3 Series కార్లలో సన్‌రూఫ్ ఏర్పాటు చేయడానికి BMW కి ఏడాది పట్టింది. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది.
ఇది జరిగి దశాబ్దం పైనే అయింది. ఇప్పుడు అదే BMW కి మరోసారి షాక్ తలిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కార్ బయ్యర్స్ కోరేది సన్‌రూఫ్ ద్వారా సూర్యుడు లోపలికి రావడం కాదు, బయటే ఆగిపోవడం. అందుకే ఇప్పటి క్రేజ్ సన్‌బ్లైండ్స్.
లగ్జరీ సెగ్మెంట్ ఫీచర్
ప్రస్తుతం లగ్జరీ సెగ్మెంట్‌లో రియర్ విండో సన్‌బ్లైండ్స్ అత్యంత అవసరమైన ఫీచర్‌గా మారిపోయాయి. ముఖ్యంగా, 9 నెలలు ఎండలో కాలిపోతూ ఉండే మన దేశంలో కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. BMW 5 Seriesలో రియర్ సన్‌బ్లైండ్స్ లేకపోవడం చాలా మంది బయ్యర్స్‌కు డీల్ బ్రేకర్ అయింది, సేల్స్ తగ్గాయి. మరోవైపు మెర్సిడెస్ మాత్రం ఈ రేసులో ముందుంది. దీని E-Classలో ఉండే పవర్-ఆపరేటెడ్ సన్‌బ్లైండ్స్ చాలా స్మూత్‌గా పని చేస్తాయి. వెనుక సీట్‌లో కూర్చున్న వాళ్లకు లగ్జరీ అంటే ఇదే కదా అనిపించేలా అవి ఉన్నాయి.
BMW ప్రస్తుతం ఇస్తున్న స్టిక్-ఆన్ షేడ్లతో మాత్రం పూర్తిగా ఇబ్బందే. వాటిని మడవలేము, సరిగ్గా స్టోర్ చేయలేము. బయ్యర్స్ కూడా వాటిని అస్సలు ఇష్టపడడం లేదు.
మరో పెద్ద కారణం... డార్క్ సన్ ఫిల్మ్స్ ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత కార్ ఓనర్లకు ప్రైవసీ, హీట్ కంట్రోల్ రెండూ కష్టంగా మారాయి. సన్‌బ్లైండ్స్ మాత్రం చట్టపరంగా కూడా సేఫ్ & ప్రాక్టికల్‌గా పనికొస్తాయి. అందుకే ఇవే ఇప్పుడు హాట్ ఫేవరెట్ అయ్యాయి.
కాస్త తక్కువ ధర కార్లలోనూ...
ఈ సన్‌బ్లైండ్స్ ట్రెండ్ కేవలం లగ్జరీ కార్ల దగ్గరే ఆగిపోలేదు. ఇప్పుడు మాస్ మార్కెట్ కార్లు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. తాజా Hyundai Venue లో రియర్ విండోలకు నీట్‌గా ఫిట్ చేసిన పుల్-అప్ బ్లైండ్స్ ఉన్నాయి. చూడగానే “అరే, ఇది లగ్జరీ కార్‌లో ఉన్నట్టుగానే ఉందిగా” అనిపించేలా కంపెనీ వాటిని అమర్చింది.
ఒకప్పుడు, కార్ బయ్యర్లు సన్‌రూఫ్ కోసం పడి పడి అడిగేవాళ్లు. ఇప్పుడు మాత్రం సూర్యుడి వేడి కారు బయటే ఉండిపోతే చాలన్నట్టు పరిస్థితి మారిపోయింది & టెక్నాలజీ కలయితో సన్‌బ్లైండ్స్ వస్తున్నాయి. కాబట్టి, కార్ మార్కెట్ ఇప్పుడు ఏ దిశగా వెళ్తుందో ఇది చెబుతోంది. మనకు స్టైల్ కావాలి, కంఫర్ట్ కూడా కావాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















