అన్వేషించండి

హోండా షాకింగ్‌ అప్‌డేట్‌: Honda CB1000 Hornet SP రీకాల్‌ - Fireblade SP, Rebel 500 వెబ్‌సైట్‌ నుంచి మాయం

కొత్తగా లాంచ్‌ చేసిన Honda బైకులపై షాకింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. CB1000 Hornet SP కు కంపెనీ రీకాల్‌ ప్రకటించింది. Fireblade SP, Rebel 500 బైక్‌లను హోండా వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది.

Honda CB1000 Hornet SP Recall: హోండా, భారత మార్కెట్లో కొత్తగా లాంచ్‌ చేసిన CB1000 Hornet SP బైక్‌కు రీకాల్‌ ప్రకటించింది. 13.29 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో వచ్చిన ఈ లగ్జరీ స్ట్రీట్‌ ఫైటర్‌ మోటార్‌ సైకిల్‌ను యూత్‌ ఓ అద్భుతంలా చూస్తుండగా, కంపెనీ నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఈ రీకాల్‌ నోటిఫికేషన్‌ బైక్‌ ఓనర్లలో కొద్దిపాటి ఆందోళన కలిగించింది.

రీకాల్‌ ఎందుకు?
హోండా, గ్లోబల్‌ లెవల్‌లో గుర్తించిన ఒక చిన్న సమస్య కారణంగా ఈ రీకాల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇంజిన్‌ నుంచి వచ్చే వేడి సీటు కింద ఉండే పెయింట్‌ చేసిన భాగాన్ని మృదువుగా మార్చే అవకాశం ఉందని హోండా చెబుతోంది. అలా మృదువైనప్పుడు గేర్‌ చేంజ్‌ పెడల్‌ పివట్‌ వద్ద బోల్ట్‌ లూజ్‌ కావచ్చు. ఇలా జరిగితే, రైడింగ్‌ సమయంలో గేర్‌ మారుస్తున్నప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. రైడర్‌ భద్రతలో చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారి తీస్తుందని తెలుసు కాబట్టి, హోండా ఈ రీకాల్‌ను వాలంటరీగా ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని Honda BigWing Topline షోరూమ్‌లు ఇప్పటికే బైక్‌ ఓనర్లతో వ్యక్తిగతంగా సంప్రదించడం ప్రారంభించాయి. జనవరి 2026 నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నల్‌ ఇన్‌స్పెక్షన్‌లు, పార్ట్స్‌ రీప్లేస్‌మెంట్‌ ప్రారంభం కానుంది. బైక్‌ ఓనర్లు తమ 17-అంకెల VIN నంబర్‌ను హోండా వెబ్‌సైట్‌లో నమోదు చేసి తమ బైక్‌ ఈ రీకాల్‌లో భాగమో, కాదో సులభంగా చెక్‌ చేసుకోవచ్చు.

మరో కీలక అప్‌డేట్‌
హోండా నుంచి మరో ముఖ్యమైన అప్‌డేట్‌ కూడా వచ్చింది. కొన్ని రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్‌ చేసిన CBR1000RR-R Fireblade SP & Rebel 500 మోడళ్లను కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌ నుంచి సైలెంట్‌గా తొలగించింది. ఇది చూసి చాలా మంది బైకర్లలో సందేహాలు మొదలయ్యాయి.

ఈ తొలగింపు ఎందుకు? 
పరిశ్రమ సమాచారం ప్రకారం, హోండా ఈ రెండు బైక్‌లను భారత్‌కు పరిమిత సంఖ్యలోనే కేటాయించినట్టు తెలుస్తోంది. మొదటి బ్యాచ్‌ స్టాక్‌ అమ్ముడైపోవడంతో, వెబ్‌సైట్‌ నుంచి మోడళ్లను తాత్కాలికంగా తీసేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా, Fireblade SP వంటి ఫ్లాగ్‌షిప్‌ సూపర్‌ బైక్‌కు భారత మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. Rebel 500 అయితే భారత మార్కెట్లో మొదటిసారిగా CBU రూపంలో లాంచ్‌ అయింది. పరిమిత యూనిట్లు మాత్రమే తీసుకురావడం హోండాకు సాధారణ వ్యవహారమే.

గతంలో కూడా CB300R మోడల్‌ను ఇదే విధంగా వెబ్‌సైట్‌ నుంచి తొలగించడంతో, అది అందుబాటులో లేదని అర్థం చేసుకున్నారు. ఆ మోడల్‌ CBU కాకపోయినా, లోకలైజ్డ్‌ కంపోనెంట్స్‌ ఉన్నా కూడా అమ్మకాలు తగ్గడంతో సైలెంట్‌గా తీసేశారు.

ఈ Fireblade SP & Rebel 500 బైక్‌లు మళ్లీ వచ్చే అవకాశం ఉన్నా, ఎప్పుడు వస్తాయో మాత్రం స్పష్టత లేదు. హోండా కొత్త స్టాక్‌ను భారత మార్కెట్‌కు కేటాయిస్తేనే అవి మళ్లీ మన రోడ్లపై కనిపిస్తాయి.

శాశ్వత తొలగింపు కాకపోవచ్చు!
AP, తెలంగాణ బైక్‌ అభిమానులకు ఈ అప్‌డేట్లు చాలా కీలకం. ముఖ్యంగా, BigWing షోరూమ్‌ల్లో Fireblade SP లేదా Rebel 500 కొనాలనుకున్న వారికి వెబ్‌సైట్‌లో వాటి లిస్టింగ్‌ కనిపించకపోవడంతో నిరాశ చెందవచ్చు. అయితే ఇది శాశ్వత తొలగింపు కాకపోవచ్చు. కొత్త స్టాక్‌ రాగానే తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget