అన్వేషించండి

MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

MPP ZP Schedule: ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 19న ఎంపీపీ, 20న జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీలో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.
  • జూన్ 19, 20న పరోక్ష ఎన్నికలు, చేతులు ఎత్తే పద్ధతి.
  • ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది.
  • కూటమికి స్పష్టమైన మెజారిటీ, అధిక స్థానాలు గెలుచుకుంది.

MPP ZP Schedule: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అంతిమ ఘట్టానికి చేరుకుంది. మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ), జిల్లా పరిషత్‌ (జడ్పీ) ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 19న ఎంపీపీల ఎన్నిక, 20న జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. మొత్తం 659 మండల ప్రజాపరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ పరోక్ష ఎన్నికల ప్రక్రియను ‘చేతులు ఎత్తే పద్ధతి’ ద్వారా చేపడతారు. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో

ఈనెల 7న వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన 582 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 499 స్థానాలను (85.73%) కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీ 407, జనసేన 72, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించగా, ఏడు జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. ప్రతిపక్ష వైసీపీ 76 స్థానాలకే (13.05%) పరిమితమవ్వగా, ఇతరులు 7 చోట్ల గెలుపొందారు.


Also Read: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు

అత్యధిక స్థానాల్లో కూటమి 

అలాగే, ఎంపీటీసీ స్థానాల్లోనూ ఏకగ్రీవాలతో కలిపి కూటమి 7,799 స్థానాలను సొంతం చేసుకుంది. ఇందులో టీడీపీ 6,585, జనసేన 1,044, బీజేపీ 170 ఉన్నాయి. వైసీపీ 1,801 స్థానాలు గెలుచుకోగా, ఇతరులు, స్వతంత్రులు 195 స్థానాల్లో విజయం సాధించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో సాధించిన స్పష్టమైన మెజారిటీతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జడ్పీలు, మెజారిటీ ఎంపీపీలను కూటమి సునాయాసంగా కైవసం చేసుకోనుంది.

Also Read: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు

Frequently Asked Questions

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో తాజా నోటిఫికేషన్ దేని గురించి?

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ప్రకారం, ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అంతిమ ఘట్టం.

ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికల షెడ్యూల్ ఏమిటి?

ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈనెల 19న ఎంపీపీల ఎన్నికలు, 20న జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి.

ఈ పరోక్ష ఎన్నికల ప్రక్రియను ఎలా నిర్వహిస్తారు?

ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల ప్రక్రియను 'చేతులు ఎత్తే పద్ధతి' ద్వారా చేపడతారు. దీనికోసం ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి.

ఎన్ని మండల, జిల్లా పరిషత్‌లకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు?

మొత్తం 659 మండల ప్రజాపరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ స్థానాలకు ఈ పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Nara Lokesh: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
CM Chandrababu: స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget