మారుతి నుంచి టాటా వరకు, కియా నుంచి స్కోడా వరకు - 2026లో లాంచ్‌కు సిద్ధమైన 11 ఎలక్ట్రిక్ కార్లు
2026లో భారత్‌లో కనీసం 9 కొత్త ఎలక్ట్రిక్ కార్లు, 2 EV ఫేస్‌లిఫ్ట్‌లు లాంచ్ కానున్నాయి. మారుతి, టాటా, కియా, హ్యుందాయ్, స్కోడా బ్రాండ్ల రాబోయే EVల పూర్తి వివరాలు.

Upcoming EVs India 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా విస్తరిస్తోంది. 2025 చివరి దశకు చేరుకున్న ఈ సమయంలో, ఈ ఏడాది ఇప్పటికే చాలా అద్భుతమైన కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. Mahindra BE 6, XEV 9e పూర్తి ధరల ప్రకటనతో పాటు, Hyundai Creta Electric, Tata Harrier EV, Vinfast’s VF6 and VF7, Kia Carens Clavis EV వంటి మోడళ్లు EV విభాగాన్ని మరింత బలోపేతం చేశాయి.
ఇక 2026లో భారత మార్కెట్ మరింత హీటెక్కనుంది. వచ్చే ఏడాది కనీసం 9 కొత్త ఎలక్ట్రిక్ కార్లు, 2 EV ఫేస్‌లిఫ్ట్‌లు లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అంచనా లాంచ్ టైమ్‌లైన్ ప్రకారం ఆ వాహనాలు ఇవే:
మారుతి సుజుకి e Vitara
2026 ప్రారంభంలోనే మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లోకి రానుంది. 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లతో, గరిష్టంగా 543 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. భారత్ NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా దక్కింది. ధరలు సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉండే అవకాశం ఉంది.
టాటా సియెర్రా EV
టాటా సియెర్రా ICE వెర్షన్ ధరలను 2026 జనవరిలో ప్రకటిస్తారు. అదే సమయంలో తొలి త్రైమాసికంలో సియెర్రా EV కూడా లాంచ్ కానుంది. 55 kWh, 65 kWh బ్యాటరీ ఆప్షన్లు, RWD, AWD వేరియంట్లతో రావొచ్చని అంచనా. ధరలు రూ.16 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండొచ్చు.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్
5+2 సీట్ల క్రాస్‌ఓవర్ తరహా MPV అయిన ఈ EV... BYD eMax 7కు ప్రత్యర్థిగా నిలుస్తుంది. 60.1 kWh బ్యాటరీ, 201 hp మోటార్‌తో 450 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ధరలు రూ.22–26 లక్షల మధ్య ఉండొచ్చు.
టయోటా అర్బన్ క్రూయిజర్ EV
మారుతి e Vitara ఆధారంగా తయారైన ఈ ఎలక్ట్రి కారు స్వల్ప డిజైన్ మార్పులతో 2026 తొలి త్రైమాసికంలో రానుంది. 49 kWh, 61 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ధరలు కూడా e Vitara తరహాలోనే ఉండే అవకాశం ఉంది.
కియా సైరోస్ EV
2026 రెండో త్రైమాసికంలో లాంచ్ కానున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV... టాటా నెక్సాన్ EVకు పోటీగా నిలుస్తుంది. 42 kWh, 49 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండొచ్చని అంచనా. ధరలు రూ.15–18 లక్షల మధ్య ఉండవచ్చు.
హ్యుందాయ్ అయోనిక్ 5 ఫేస్‌లిఫ్ట్
చిన్నపాటి డిజైన్ మార్పులు, పెద్ద బ్యాటరీతో ఈ ప్రీమియం EV 2026లో రానుంది. భారత్‌కు 84 kWh బ్యాటరీ వేరియంట్ వచ్చే అవకాశం ఉంది. ధరలు సుమారు రూ.50 లక్షల వరకు చేరొచ్చు.
విన్‌ఫాస్ట్ VF3
MG కామెట్‌కు ప్రత్యక్ష పోటీగా ఈ చిన్న EV మార్కెట్లోకి రానుంది. 18.6 kWh బ్యాటరీతో, తక్కువ ధర విభాగంలో నిలవనుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మోడల్ కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో విన్‌ఫాస్ట్ ఉంది.
టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్
2026 మధ్య నాటికి పంచ్ EVకి ఫేస్‌లిఫ్ట్ రానుంది. డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లలో మార్పులు ఉండనున్నాయి. బ్యాటరీ ఆప్షన్లు అవే కొనసాగుతాయి కానీ ధర స్వల్పంగా పెరగొచ్చు.
స్కోడా ఎల్‌రాక్
2026 చివర్లో స్కోడా నుంచి ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ SUV రావొచ్చు. సుమారు రూ.45 లక్షల ధరతో, హ్యుందాయ్ అయోనిక్ 5, BMW iX1కు ప్రత్యర్థిగా నిలుస్తుంది.
మారుతి YMC ఎలక్ట్రిక్ MPV & టాటా అవిన్యా
2026 చివరలో మారుతి ఎలక్ట్రిక్ MPVతో పాటు టాటా ప్రీమియం Avinya బ్రాండ్ నుంచి తొలి మోడల్ లాంచ్ కావొచ్చు. ఇవి EV మార్కెట్‌ను మరింత విస్తరించనున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















