GST తర్వాత TVS Apache RTR 200 4V, 160 4V & 2V, 180 పాత & కొత్త ధరలు ఇవే
TVS Apache RTR 160, 180, 200 బైక్‌లు ఇప్పుడు మరింత చౌకగా వస్తున్నాయి. GST తగ్గింపుతో 13,200 రూపాయల వరకు ఆదా అవుతున్నాయి.

TVS Apache RTR Price Drop: GST 2.0 అమలు తర్వాత బైక్‌ల మార్కెట్లో ధరలు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ముఖ్యంగా TVS Apache అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్. ప్రీమియం స్పోర్ట్స్ ఫీల్ ఇస్తున్న అపాచీ RTR సిరీస్ ఇప్పుడు మరింత చకగా దొరుకుతుంది. ఈ తగ్గింపు గరిష్టంగా ₹13,200 వరకు ఉంది. అంటే మీరు కొత్త బైక్ కొనాలనుకుంటే, ఇది బంగారు అవకాశం.
ధర తగ్గింపు ఎంతంటే?
ఇప్పటివరకు Apache RTR బైక్‌లు 31 శాతం పన్ను కింద ఉండేవి. కానీ GST 2.0 వల్ల అవి 18 శాతం కేటగిరీలోకి వచ్చాయి. దీంతో ధరలు బాగా పడిపోయాయి. ముఖ్యంగా TVS Apache RTR 160, 180, 200 మోడళ్లలో అన్ని వేరియంట్ల ధరలూ తగ్గాయి.
TVS Apache RTR 160 2V & 180
| TVS Apache RTR 160 2V వేరియంట్లు | పాత ధర | కొత్త ధర | ఆదా |
| Black Edition | Rs 1,21,420 | Rs 1,11,490 | Rs 9,930 |
| RM Drum | Rs 1,22,220 | Rs 1,12,190 | Rs 10,030 |
| RM Disc BT | Rs 1,29,020 | Rs 1,18,490 | Rs 10,530 |
| Racing Edition | Rs 1,30,520 | Rs 1,19,790 | Rs 10,730 |
| Dual Channel ABS | Rs 1,34,320 | Rs 1,23,290 | Rs 11,030 |
| TVS Apache RTR 180 వేరియంట్ | పాత ధర | కొత్త ధర | ఆదా |
| RM Disc BT | Rs 1,35,020 | Rs 1,24,890 | Rs 10,130 |
TVS Apache RTR 160 4V
| VS Apache RTR 160 4V వేరియంట్లు | పాత ధర | కొత్త ధర | ఆదా |
| Drum | Rs 1,25,670 | Rs 1,15,852 | Rs 9,818 |
| Black Edition | Rs 1,28,490 | Rs 1,17,990 | Rs 10,500 |
| Disc | Rs 1,29,170 | Rs 1,19,079 | Rs 10,091 |
| BT Disc | Rs 1,32,470 | Rs 1,22,121 | Rs 10,349 |
| Special Edition | Rs 1,34,970 | Rs 1,23,890 | Rs 11,080 |
| Dual Channel ABS | Rs 1,36,990 | Rs 1,25,790 | Rs 11,200 |
| Dual Channel ABS with USD | Rs 1,39,990 | Rs 1,28,490 | Rs 11,500 |
| TFT | Rs 1,47,990 | Rs 1,35,840 | Rs 12,150 |
TVS Apache RTR 200 4V
| TVS Apache RTR 200 4V వేరియంట్లు | పాత ధర | కొత్త ధర | ఆదా |
| USD | Rs 1,53,990 | Rs 1,41,290 | Rs 12,700 |
| TFT | Rs 1,59,990 | Rs 1,46,790 | Rs 13,200 |
యూత్‌ఫుల్ స్టైల్ ఆకర్షణ
Apache రేంజ్ బైక్‌లు ఎప్పుడూ యూత్‌కు ఫేవరెట్. అగ్రెసివ్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్, స్పోర్టీ రైడింగ్ పొజిషన్ ఈ బైక్‌ల యూనిక్ సెల్లింగ్ పాయింట్ (USP). ఇప్పుడు ధర కూడా తగ్గడంతో కొత్త రైడర్లకు ఇవి మరింత చేరువ కానున్నాయి.
ఎవరు కొనాలి?
160cc లో స్పోర్టీ బైక్ కావాలనుకునేవారు RTR 160 4V ఎంచుకోవచ్చు.
సింపుల్ కానీ పవర్‌ఫుల్ రైడ్ కావాలనుకుంటే RTR 180 సరిపోతుంది.
ఎక్కువ ఫీచర్లు, హై పర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్లకు RTR 200 4V బెస్ట్ ఆప్షన్.
ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు కూడా ప్లస్
సాధారణంగా, దసరా & దీపావళి సీజన్‌లో ఆటోమొబైల్ అమ్మకాలు బాగా పెరుగుతాయి. ఇప్పుడు Apache ధరలు పడిపోవడంతో పాటు TVS ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తే, ఈ బైక్‌ల సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.





















