అన్వేషించండి

GST తగ్గాక బాగా దిగొచ్చిన బైకుల రేట్లు, ఇప్పుడు ₹55,000 నుంచే స్టార్ట్‌ - ఇదిగో లిస్ట్‌

GST Reforms 2025: మీరు ఈ పండుగ సీజన్‌లో తక్కువ రేటుకే బైక్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌-5 చవకైన బైక్‌లు ఈ కథనంలో ఉన్నాయి.

Cheapest Bikes In India After GST 2025 Cut: జీఎస్‌టీ తగ్గింపు తర్వాత, ద్విచక్ర వాహనాల కొనుగోలు గతంలో కంటే మరింత అందుబాటులోకి వచ్చింది. కొత్త GST రేటు (GST Reforms 2025) ప్రకారం, 350cc కంటే తక్కువ ఇంజిన్లు కలిగిన బైక్‌లపై పన్ను రేటు 28% నుంచి 18% కి తగ్గింది. దీనివల్ల, మధ్య తరగతి ప్రజలకు మోటార్‌ సైకిల్ కొనుగోలు చేయడం మరింత సులభంగా మారింది. 

తెలుగు రాష్ట్రాల్లో టాప్‌-5 చవకైన బైకుల లిస్ట్‌:

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
TVS స్పోర్ట్, స్టైలిష్‌ డిజైన్‌ అద్భుతమైన మైలేజ్ & తక్కువ ధర కారణంగా బాగా పాపులర్‌ అయింది. ఈ బైక్ కూడా GST తగ్గింపు నుంచి మంచి ప్రయోజనం పొందింది. ఫలితంగా, తెలుగు నగరాల్లో దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ. 55,100 ఎక్స్-షోరూమ్. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు (RTO), ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులతో కలిపి, ఈ బండి దాదాపు రూ. 69,200 ధరకు వస్తుంది.

హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్ (Hero HF Deluxe)
హీరో HF డీలక్స్, తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బడ్జెట్‌ బైక్‌లలో ఒకటి. కొత్త GST అమలైన తర్వాత ఈ మోటార్‌ సైకిల్‌ ధర సుమారు రూ. 5,800 తగ్గింది, దీంతో ఈ బండి మరింత బడ్జెట్-ఫ్లెండ్లీగా మారింది. GST తగ్గింపు తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఈ బైక్ ఇప్పుడు రూ. 55,993 ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు (RTO), ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులతో కలిపి, ఈ బండి రూ. 69,885 కు వస్తుంది.

హోండా షైన్ (Honda Shine)
హోండా షైన్ 100 కూడా GST తగ్గింపు నుండి గణనీయంగా ప్రయోజనం పొందింది. ఈ స్టైలిష్‌ బైక్ ఇప్పుడు రూ. 5,600 ఆదాను అందిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 64,473. హోండా షైన్ 98.9cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు (RTO), ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులతో కలిపి, ఈ బండి దాదాపు రూ. 80,000 కు వస్తుంది. కంపెనీ మాన్యువల్‌ ప్రకారం, ఈ బైక్ లీటరుకు 55-60 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు.

హీరో స్ల్పెండర్‌ (Hero Splendor)
హీరో స్ప్లెండర్ ప్లస్, అటు గ్రామీణ ప్రాంతాల్లో & ఇటు నగరాల్లో కూడా బెస్ట్ సెల్లింగ్ బైక్. GST తగ్గింపు తర్వాత, ఈ బైక్ ధర రూ. 6,800 తగ్గింది. మన మార్కెట్‌లో ఇప్పుడు దీని కొత్త ధర రూ. 73,946 ఎక్స్-షోరూమ్. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు (RTO), ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులతో కలిపి, ఈ బండి రూ. 91,200 కు వస్తుంది.

బజాజ్ ప్లాటినా 100 ‍(Bajaj Platina 100)
బజాజ్ ప్లాటినా అంటేనే అందుబాటు ధర & బలమైన మైలేజీకి పాపులర్‌. GST తగ్గింపు తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు కేవలం రూ. 65,743 (ఎక్స్-షోరూమ్). రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు (RTO), ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులతో కలిపి, ఈ బండి రూ. 81,500 ధరకు వస్తుంది. ఈ బైక్ 102cc DTS-I ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. కంపెనీ ప్రకారం ఈ మోటార్‌ సైకిల్‌ లీటరుకు 70 km మైలేజీ అందిస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Advertisement

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget