అత్యంత చవకైన Toyota Fortuner 7 సీటర్ కారు కొనడానికి డౌన్ పేమెంట్ ఎంత? EMI వివరాలు ఇవే
Toyota Fortuner EMI Details: టయోటా ఫార్చూనర్ 7-సీటర్ కారును లోన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డౌన్ పేమెంట్, ఈఎంఐ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారతీయ మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్న 7-సీటర్ కార్లలో Toyota Fortuner ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షల 37 వేలకు ప్రారంభమై రూ. 51 లక్షల 94 వేల వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో అతి చవకైన మోడల్ 4.2 పెట్రోల్ వేరియంట్.
మీరు Toyotaకు చెందిన ఈ 7-సీటర్ కారును లోన్ ద్వారా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా, దాని వివరాల గురించి మీకు ఇక్కద పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం. ఫార్చునర్ కారు బేస్ మోడల్ ఢిల్లీలో ఆన్-రోడ్ ధర రూ. 40.88 లక్షలు కాగా... ఈ కారును లోన్ మీద కొనుగోలు చేయడానికి గరిష్టంగా రూ. 36.87 లక్షల లోన్ వస్తుంది.
Toyota Fortuner కొనడానికి డౌన్ పేమెంట్ ఎంత చేయాలి?
Toyota Fortuner కొనడానికి మీరు 4 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి. మీరు ఎక్కువ మొత్తం చెల్లిస్తే కనుక ప్రతి నెలా చెల్లించే EMI కొంతమేర తగ్గుతుంది. మీరు ఈ ఫార్చునర్ కారును కొనుగోలు చేయడానికి 4 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, బ్యాంకు ఈ లోన్‌పై 9.8 శాతం వడ్డీని విధిస్తే కనుక మీరు ప్రతినెలా ఈఎంఐ రూపంలో రూ. 93,179 చెల్లించాలి. Fortuner కొనడానికి 5 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే కనుక ప్రతి నెలా దాదాపు రూ. 77,993 బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది.
EMIలు ఎంత కాలం పాటు చెల్లించాలి?
Toyota కంపెనీకి చెందిన ఈ 7-సీటర్ కారు ఫార్చునర్ కొనడానికి 6 సంవత్సరాల కార్ లోన్ (Car Loan) తీసుకుంటే, 9 శాతం వడ్డీతో రూ. 67,949 EMI చెల్లించాలి. Fortuner కొనడానికి 7 సంవత్సరాల పాటు కారు లోన్ తీసుకుంటే, రూ. 60,842 EMI చెల్లించాలి. మీరు Toyota Fortuner కొనడానికి లోన్ తీసుకోవాలనుకుంటే కనుక, ముందు అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవాలి. ఏమైనా అనుమానాలు ఉంటే అప్పుడే బ్యాంకు అధికారులను గానీ, కారు షోరూమ్ వాళ్లను అడిగి తెలుసుకోవడం మంచింది. వివిధ బ్యాంకులలో వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. బ్యాంకులను బట్టి మారడంతో పాటు వ్యక్తికి సంబంధించిన సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ప్రకారం ఆయా కస్టమర్లకు వడ్డీ రేట్లు నిర్ణయిస్తారని తెలిసిందే.






















