High Mileage Cars: ఒక్క లీటర్‌కు 28 కిలోమీటర్లకు పైగా ఇచ్చే కార్లు! - బెస్ట్ మైలేజ్ రికార్డ్ వీటిదే
Most High Mileage Cars: ఎక్కువ మైలేజ్ కోరుకునే వారి కోసం మన మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 5 అత్యధిక మైలేజ్ కార్ల జాబితా ఇది. హైబ్రిడ్ నుంచి పెట్రోల్ వరకు, ARAI సర్టిఫైడ్ నంబర్లతో పూర్తి వివరాలు ఇవి.

High Mileage Cars India: భారతీయ కార్ కొనుగోలుదారులు ఎక్కువగా చూసే విషయం ఒక్కటే, అది - మైలేజ్. పెట్రోల్ ధరలు పెరిగిన ఈ రోజుల్లో, ఒక్క లీటర్ ఫ్యూయల్‌తో ఎక్కువ దూరం వెళ్లే కార్లకు ఎప్పుడూ డిమాండ్ భారీగా ఉంటుంది. ARAI ఆమోదించిన ఫ్యూయల్ ఎఫిషియన్సీ నంబర్ల ఆధారంగా, మన మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 5 అత్యధిక మైలేజ్ కార్లు ఇవి. ఇవన్నీ లీటరుకు 25km కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తాయి.
5. మారుతి స్విఫ్ట్ - 25.75 kmpl (ARAI)
కొత్త తరం మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ Z సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. 82hp పవర్, 112Nm టార్క్ ఇచ్చే ఈ శక్తిమంతమైన ఇంజిన్‌తో, స్విఫ్ట్ మంచి పనితీరుతో పాటు అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. AMT వెర్షన్‌లో 25.75 కి.మీ./లీటర్, మాన్యువల్‌లో 24.8 కి.మీ./లీటర్ ఇవ్వగలదు. బరువు తక్కువగా ఉండటం కూడా మైలేజ్ పెరగడానికి కారణం. అదే ఇంజిన్ ఉన్న డిజైర్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది, కానీ ఈ జాబితాలోకి రాలేదు.
4. Maruti Swift - 26 kmpl (ARAI)
మారుతి సెలెరియో 1.0-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ చిన్న కార్ బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల మైలేజ్ మరింత పెరిగింది. AMT వెర్షన్‌లో 26 కి.మీ./లీటర్ మైలేజ్ రికార్డ్ చేసింది. ఎంట్రీ-లెవల్ MT మోడల్ 25.24 కి.మీ./లీటర్ ఇస్తుంది. చిన్న సైజు, తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్ - ఇవన్నీ కలిపి సెలెరియోను బెస్ట్ బడ్జెట్ కార్లలో ఒకటిగా నిలిపాయి.
3. Honda City e:HEV - 27.26 kmpl (ARAI)
ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే సెడాన్ అంటే 'హోండా సిటీ హైబ్రిడ్'. 1.5-లీటర్ అట్‌కిన్సన్ సైకిల్ ఇంజిన్‌తో పాటు 109hp ఇస్తున్న ఎలక్ట్రిక్ మోటార్ కలిసి మొత్తం 126hp అవుట్‌పుట్ ఇస్తుంది. e-CVT ట్రాన్స్‌మిషన్‌తో సిటీ e:HEV హైవేపై, సిటీలో నిజమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది. మైలేజ్, కంఫర్ట్, టెక్నాలజీ కలయికగా ఈ కార్ హైబ్రిడ్ సెగ్మెంట్‌లో టాప్ చాయిస్‌గా ఉంది.
2. Toyota Hyryder / Maruti Grand Vitara - 27.97 kmpl (ARAI)
టయోటా-మారుతి భాగస్వామ్యంలో వచ్చిన ఈ రెండు హైబ్రిడ్ SUVs ఒకే పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తాయి. 1.5-లీటర్ అట్‌కిన్సన్ ఇంజిన్ + ఎలక్ట్రిక్ మోటార్ కలిపి 116hp అవుట్‌పుట్ ఇస్తాయి. ఈ రెండు SUVs కూడా 27.97 కి.మీ./లీటర్ మైలేజ్‌తో మార్కెట్లో రెండో అత్యధిక మైలేజ్ కార్లుగా నిలిచాయి. నగరాల్లో డ్రైవ్ చేసే వారికి ఇవి నిజంగా మంచి ఆప్షన్.
1. Maruti Victoris - 28.65 kmpl (ARAI)
ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే SUV & అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ - ఈ రెండు టైటిళ్లనూ మారుతి విక్టోరిస్ దక్కించుకుంది. గ్రాండ్ విటారా, హైరైడర్‌లా ఇదీ అదే హైబ్రిడ్ ఇంజిన్‌తోనే వస్తోంది. కానీ ట్యూనింగ్, ఎఫిషియన్సీ ఆప్టిమైజేషన్ వల్ల విక్టోరిస్ 28.65 కి.మీ./లీటర్ అనే అద్భుతమైన ARAI మైలేజ్‌ను రికార్డు చేసింది. పర్-లీటర్ మైలేజ్ విషయంలో ప్రస్తుతం దీనికి ఎదురెళ్లే ప్రత్యర్థే లేదు.
ఫ్యూయల్ ధరలు పెరిగిన ఈ రోజుల్లో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ కొనాలనుకునేవారికి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికలు. మీ బడ్జెట్, అవసరం, డ్రైవింగ్ స్టైల్‌కు ఏది సరిపోతుందో చూసుకుని నిర్ణయం తీసుకుంటే మీ డబ్బుకు ఎక్కువ విలువ దొరుకుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















