By: ABP Desam | Updated at : 22 Jul 2022 09:37 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ప్రస్తుతం మనదేశంలో ఎక్కువ మైలేజీని అందించే కార్లు ఇవే.
భారతదేశంలో కొత్త కారు కొనేటప్పుడు వినియోగదారులు ఎక్కువగా పరిగణనలోకి తీసుకునే అంశం మైలేజ్. దీంతో కార్ల తయారీదారులు కూడా దీనిపై దృష్టి పెడతారు. ప్రస్తుతం మనదేశంలో ఎక్కువ మైలేజీని అందించే టాప్ ఫైవ్ కార్లు ఇవే.
1. వోల్వో ఎక్స్‌సీ90
వోల్వో ఎక్స్‌సీ90 రీచార్జ్ ఒక ప్లగ్ఇన్ హైబ్రిడ్ కారు. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కారు లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. ప్రస్తుతం మనదేశంలో అత్యధిక మైలేజ్‌ను అందించే కారు ఇదే.
2. మారుతి సెలెరియో
మారుతి సుజుకి కొత్త వెర్షన్ సెలెరియోను గత సంవత్సరమే మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారులో కొత్త కే10 ఇంజిన్‌ను అందించారు. ఈ కారు 26.68 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. ఈ కారు ధర కూడా బడ్జెట్ ధరలోనే ఉంది.
3. హోండా సిటీ హైబ్రిడ్
హోండా సిటీ హైబ్రిడ్ కారు ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇది 24.1 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. అయితే హోండా సిటీ హైబ్రిడ్‌లో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ట్విన్ ఎలక్ట్రిక్ మోటార్స్ కలిపితే 26.5 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనున్నట్లు హోండా తెలిపింది.
4. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కొత్త వెర్షన్‌ను కంపెనీ ఈ మధ్యే మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 1.0 లీటర్ కే-సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ ఉండనుంది. ఇది ఏజీఎస్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేయనుంది. ఈ కారు 25.3 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.
5. మారుతి సుజుకి వాగన్ఆర్
ఇందులో 1.2 లీటర్ ఎల్ కే సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ ఉంది. ఇందులో 1.2 లీటర్ వెర్షన్ 24.43 కిలోమీటర్ల మైలేజ్‌ను, 1.0 లీటర్ వెర్షన్ 25.19 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
జులైలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీలు ఇవే!
Car Discounts : పండుగల సీజన్లో కారు కొనాలనుకుంటున్నారా ? ఇవిగో బంపర్ ఆఫర్ల డీటైల్స్
కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
Hyundai Tucson SUV Price: హ్యుండాయ్ టక్సన్ ధర రివీల్ చేసిన కంపెనీ - మొదటిసారి ఆ ఫీచర్‌తో!
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?