అన్వేషించండి

Cheapest Hybrid Cars: 2025లో టాప్‌-5 చౌక హైబ్రిడ్ కార్లు ఇవే – మైలేజ్‌లో బెస్ట్‌, టెక్నాలజీలో టాప్‌!

Cheapest Hybrid Cars In India: 2025లో ఎక్కువ మైలేజ్, తక్కువ ధరతో లభిస్తున్న టాప్‌ 5 హైబ్రిడ్ కార్లు ఇవే. హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించుకుని డబ్బు ఆదా చేసుకోవాలనే వారికి ఉపయోగపడే పూర్తి లిస్ట్‌ ఇది.

Best Mileage Hybrid Cars In India In 2025: పెరిగిన పెట్రోల్ ధరలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు… ఇవన్నీ కారు కొనుగోలుదారుడిని హైబ్రిడ్ వాహనాల వైపు దృష్టి మళ్లేలా చేస్తున్నాయి. మైలేజ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీని కోరుకునే మధ్య తరగతి ప్రజల కోసం, ఇప్పుడు, భారత మార్కెట్లో చాలా చౌక హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. 2025లో అందుబాటులో ఉన్న చౌకగా లభించే టాప్‌ 5 హైబ్రిడ్ కార్లు ఇవే.       

1. మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara Strong Hybrid)
ఈ SUV తరహా హైబ్రిడ్ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటర్ ఉంటుంది. ఇది 27.97 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. మైల్డ్‌ కాకుండా స్ట్రాంగ్‌ హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న ఈ వాహనం ధర, తెలుగు రాష్ట్రాల్లో, రూ. 12.40 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది.        

2. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Hyryder Hybrid)
మారుతి గ్రాండ్ విటారాతో పోలిక కలిగిన ఈ కారులోనూ గ్రాండ్‌ విటారా ప్లాట్‌ఫామ్‌, అదే టెక్నాలజీ ఉంటుంది. మైలేజ్ లీటరుకు 27.97 km. ఆంధ్రప్రదేశ్‌ &తెలంగాణ నగరాల్లో ఈ కారు ధర (ఎక్స్‌-షోరూమ్‌) రూ. 11.14 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టయోటా సర్వీస్ నెట్‌వర్క్‌, బ్రాండ్ విలువతో పాటు దీని మైలేజ్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.             

3. హోండా సిటీ e:HEV (Honda City Hybrid)
హోండా సిటీ హైబ్రిడ్ మోడల్‌లో 1.5 లీటర్ ఆటోమేటిక్‌ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ ఉంటుంది. ఇది సుమారు 27.13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హైదరాబాద్‌ & విజయవాడలో ఈ కారు రేటు (ఎక్స్‌-షోరూమ్‌) రూ. 18.89 లక్షల వరకు ఉంది. అయితే, దీనికి సంబంధించిన కొత్త వేరియంట్‌లు సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయి.        

4. మారుతి ఇన్విక్టో (Maruti Invicto Hybrid)
ఈ MPV తరహా కారులోనూ స్ట్రాంగ్‌ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. మైలేజ్ 23.24 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల నగరాల్లో, ఈ ఫోర్‌వీలర్‌ ధర (ఎక్స్‌-షోరూమ్‌) రూ. 25.21 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది టయోటా ఇనోవా హైక్రాస్‌ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. పెద్ద ఫ్యామిలీ కోసం ఇది మంచి ఎంపిక.

5. టయోటా ఇనోవా హైక్రాస్ (Toyota Innova Hycross Hybrid)
ఇది ఒక శక్తిమంతమైన హైబ్రిడ్ MPV. ఇది 23.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ &తెలంగాణలో, దీని ధర (ఎక్స్‌-షోరూమ్‌) రూ. 25 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్యామిలీ ట్రావెల్‌, లాంగ్‌ జర్నీలకు హైబ్రిడ్‌ కార్లలో ఇది బెస్ట్ ఆప్షన్.

మధ్యతరగతి ప్రజల కోసం హైబ్రిడ్ బెస్ట్‌
ఈ కార్లు పెట్రోల్‌ వాహనాల కన్నా ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా టోకెన్స్, గ్రీన్ ట్యాగ్‌లు, రిజిస్ట్రేషన్‌పై రాయితీలు కూడా లభించవచ్చు. మైలేజ్ + టెక్నాలజీ కోరేవారికి ఈ టాప్‌ 5 హైబ్రిడ్ కార్లు ఖచ్చితంగా సరైన ఎంపికలు అవుతాయి. పై లిస్ట్‌ నుంచి మీ బడ్జెట్‌కు సరిపోయే కారును ఎంచుకోండి!.

టాప్ హెడ్ లైన్స్

ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget