అన్వేషించండి

తొలిచూపులోనే మనసు దోచిన డిజైన్స్‌ - 2025లో బైకర్లను ఆకట్టుకున్న టాప్‌-5 నియో రెట్రో మోటార్‌సైకిళ్లు

2025లో లాంచ్ అయిన టాప్ 5 నియో రెట్రో మోటార్‌సైకిళ్లు ఇవే. క్లాసిక్ డిజైన్‌కు మోడ్రన్ ఇంజినీరింగ్ కలిపిన ఈ బైకుల ధరలు, ఫీచర్లు, ప్రత్యేకతలు తెలుసుకోండి.

Best Neo retro motorcycles 2025: 2025 సంవత్సరం నియో రెట్రో మోటార్‌సైకిళ్లకు ప్రత్యేకంగా నిలిచింది. క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడుతూనే మోడ్రన్ టెక్నాలజీ కూడా కావాలనుకునే బైకర్లకు ఈ సెగ్మెంట్ అసలైన పండుగలా మారింది. ఇంజిన్ పవర్‌, ఫీచర్లు ఎంత ముఖ్యమైనా... ఈ బైకులను చూసిన వెంటనే కలిగే ఫీలింగే అసలైన మ్యాజిక్. గతాన్ని గుర్తు చేసే డిజైన్‌, ఈ కాలానికి సరిపోయే ఇంజినీరింగ్‌తో 2025లో లాంచ్ అయిన ఈ ఐదు నియో రెట్రో బైకులు ప్రత్యేకంగా నిలిచాయి, బైకర్ల మనస్సు దోచుకున్నాయి.

Honda CB350C

హోండా, తన 350 సీసీ నియో రెట్రో లైనప్‌ను CB350Cతో మరింత విస్తరించింది. ₹1.88 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో ఈ బైక్ కేవలం హోండా BigWing షోరూమ్‌లలోనే లభిస్తుంది. కొత్త కలర్ స్కీమ్‌, డీకల్స్‌, గ్రాబ్ రైల్‌, ఫెండర్స్‌, సీట్స్‌లో చిన్న మార్పులతో ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.

348 సీసీ సింగిల్ సిలిండర్ FI ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 20.7 bhp శక్తి, 29.5 Nm టార్క్ ఇస్తుంది. సిటీ రైడింగ్‌కు సరిపడే టార్క్‌తో పాటు హైవేపై కూడా ప్రశాంతంగా క్రూయిజ్ చేసే సామర్థ్యం దీని బలం.

Honda CB650R

CBR650Rకు నేకడ్ వెర్షన్‌లా కనిపించే Honda CB650R అసలైన నియో రెట్రో స్టైల్‌కు బెస్ట్ ఉదాహరణ. Candy Chromosphere Red, Matte Gunpowder Black Metallic కలర్ ఆప్షన్‌ల్లో లభిస్తుంది. మోడ్రన్ ఫీచర్లతో పాటు రెట్రో డిజైన్ లాంగ్వేజ్ దీని ప్రత్యేకత.

649 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 12,000 rpm వద్ద 94 bhp శక్తి, 9,500 rpm వద్ద 63 Nm టార్క్ ఇస్తుంది. ఇప్పుడు E-Clutch కూడా అందిస్తున్నారు. ధర ₹10.30 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌.

Royal Enfield Hunter 350

Hunter 350 కొత్తది కాదు. కానీ 2025 వెర్షన్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ దీనిని మరింత మెరుగుపరిచింది. కొత్త కలర్స్‌తో పాటు LED హెడ్‌ల్యాంప్స్‌, టైప్ C ఫాస్ట్ ఛార్జర్‌, కొత్త హ్యాండిల్‌బార్‌, మెరుగైన సీట్ ఫోమ్ ఇచ్చారు.

గ్రౌండ్ క్లియరెన్స్ పెంచేందుకు ఎగ్జాస్ట్ రీ రూట్ చేశారు. స్లిప్పర్ క్లచ్‌, కొత్త రియర్ సస్పెన్షన్‌తో కంఫర్ట్ కూడా మెరుగైంది. ధర ₹1.37 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌ నుంచి ప్రారంభమవుతుంది.

Royal Enfield Classic 650

Classic 650 రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బైక్. 650 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ స్మూత్‌నెస్‌, శక్తిమంతమైన టార్క్‌, థ్రిల్‌ పంచే ఎగ్జాస్ట్ నోట్‌కు ఇది ప్రసిద్ధి.

Super Meteor, Shotgun 650 తరహా ఫ్రేమ్‌, Showa ట్యూన్ చేసిన సస్పెన్షన్‌, డ్యూయల్ సీట్స్‌తో ఇది క్లాసిక్ లుక్‌ను అలాగే ఉంచుతూ క్వాలిటీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ధర ₹3.61 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌.

Triumph Speed Twin 1200

ట్రయంఫ్ Speed Twin 1200 ఈ జాబితాలో డిజైన్ పరంగా టాప్‌లో నిలుస్తుంది. టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్‌, సర్క్యులర్ హెడ్‌ల్యాంప్‌, బార్ ఎండ్ మిరర్స్‌, ట్విన్ ఎగ్జాస్ట్‌లు దీన్ని సిసలైన రెట్రోలా చూపిస్తాయి.

1200 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ 103 bhp శక్తి, 112 Nm టార్క్ ఇస్తుంది. కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధర ₹13.84 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌.

మొత్తానికి, 2025లో లాంచ్ అయిన ఈ నియో రెట్రో బైకులు ఒక్కోటి ఒక్కో స్టైల్ స్టేట్‌మెంట్‌. క్లాసిక్ డిజైన్ ఎప్పటికీ పాతబడదని, సరైన మోడ్రన్ టచ్ ఇస్తే అది ఇంకా అందంగా మారుతుందని ఈ బైకులు మరోసారి నిరూపించాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
Advertisement

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
మూడో వన్డేలో టీమిండియాకు చిక్కులు తెచ్చిపెట్టే నలుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు వీరే
Hyderabad News: హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
PF Withdrawal By UPI: PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్‌డేట్
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
Embed widget