Rolls-Royce Ghost Black Badge: క్లాస్ లుక్స్‌తో వావ్ అనిపిస్తున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ - దేశంలో అత్యంత ఖరీదైన కొత్త కారు ఇదే!

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రోల్స్ రాయిస్ మనదేశంలో తన కొత్త కారును లాంచ్ చేసింది. అదే రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్.

FOLLOW US: 

ప్రపంచంలో ఉన్న కార్ల తయారీ బ్రాండ్లన్నీ ఒకెత్తు అయితే... రోల్స్ రాయిస్ మాత్రం మరో ఎత్తు. ఇవి కేవలం ఎక్స్‌క్లూజివ్ కార్లు మాత్రమే కాదు. ఎంతో ఖరీదైన కార్లు కూడా. ఇప్పుడు రోల్స్ రాయిస్ తన కొత్త ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ కారును మనదేశంలో లాంచ్ చేసింది. ఘోస్ట్ లగ్జరీ సెడాన్‌లో ఇది లేటెస్ట్ మోడల్. బ్లాక్ బ్యాడ్జ్ రేంజ్‌లో ఈ కారు లాంచ్ అయింది. రోల్స్ రాయిస్ రేంజ్‌లో అత్యంత డైనమిక్, పవర్ ఉన్నది దీనికే.

ప్రస్తుతం రోల్స్ రాయిస్ రేంజ్‌లో ఫాంటం లగ్జరీ సెడాన్, కల్లినాన్, ఘోస్ట్ ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ బ్యాడ్జ్ రేంజ్‌లో కల్లినాన్‌తో పాటు ఘోస్ట్ కూడా లాంచ్ అయింది. ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ ఎక్స్‌టీరియర్‌కు చాలా మార్పులు చేశారు. ఇందులో మరింత పవర్ ఫుల్ ఇంజిన్ అందించారు. దీంతోపాటు కొత్త ఇంటీరియర్ అప్‌డేట్స్ కూడా చేశారు.

మొత్తంగా 44 వేల రంగుల్లో వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయవచ్చు. కానీ బ్లాక్ బ్యాడ్జ్‌లోని బ్లాక్ పెయింట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అత్యంత చిక్కని బ్లాక్ కలర్‌ను రప్పించడం కోసం ఏకంగా 45 కేజీల పెయింట్‌ను ఉపయోగించారు. దీన్ని హ్యాండ్ పాలిష్ చేయడం విశేషం. ఈ కారును పెయింట్ చేయడానికి ఐదు గంటల సమయం పట్టనుంది.

21 అంగుళాల కార్బన్ ఫైబర్ చక్రాలను ఈ కారులో అందించారు. చక్రాల పక్క భాగంలో కూడా హ్యాండ్ పెయింటెడ్ కోచ్ లైన్ ఉండనుంది. పూర్తిగా బ్లాక్ లుక్ తీసుకురావడం కోసం డార్కర్ క్రోమ్ ట్రిమ్‌ను ఉపయోగించారు. ఈ కారు ఇంటీరియర్ స్టాండర్డ్ ఘోస్ట్ కంటే కొంచెం కొత్తగా ఉంది. కార్బన్, మెటాలిక్ ఫైబర్స్‌లో డీప్ డైమండ్ ప్యాటర్న్ చూడవచ్చు. బ్లాక్ బ్యాడ్ కొనుగోలు చేసిన వారు తమ కారు లుక్‌ను వర్చువల్‌గా మార్చుకోవచ్చు.

ఈ కారు డ్యాష్ బోర్డులో 152 ఎల్ఈడీలు అందించారు. ఇవి నక్షత్రాల ఆకారంలో కనిపించనున్నాయి. కారు హెడ్ లైనర్‌ను కూడా నక్షత్రాలు ఉన్న ఆకాశంలా కనిపించేలా డిజైన్ చేశారు. ట్విన్ టర్బో చార్జ్‌డ్ 6.75 లీటర్ వీ12 ఇంజిన్‌ను ఈ కారులో అందించారు. 8 స్పీడ్ ఆటోమేటిక్‌ను స్టాండర్డ్ వేరియంట్లో అందించగా... ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ వేరియంట్లో స్పోర్టియర్ డ్రైవింగ్ కోసం అదనంగా ‘లో’ బటన్‌ను అందించారు.

ఈ కారు ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే లీకుల ప్రకారం చూస్తే ఈ కారు ధర మనదేశంలో రూ.13 కోట్ల రేంజ్‌లో ఉండనుంది. ఈ ధరతో లాంచ్ అయితే మనదేశంలో ఇదే అత్యంత ఖరీదైన కొత్త కారు కానుంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 25 Apr 2022 06:29 PM (IST) Tags: Rolls-Royce Ghost Black Badge Price in India Rolls-Royce Ghost Black Badge Features Rolls-Royce Ghost Rolls-Royce Rolls-Royce Ghost Black Badge

సంబంధిత కథనాలు

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Bike Insurance Benefits: బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!

Bike Insurance Benefits: బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయడం లేదా! ఈ బెనిఫిట్‌ను నష్టపోతారు మరి!

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?

New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?

Kia EV6 Review: ఐదు వందల కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న ఎస్‌యూవీ " కియా ఈవీ 6 "

Kia EV6 Review:  ఐదు వందల కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న ఎస్‌యూవీ

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!