అన్వేషించండి

Tesla: హీట్‌ పెంచిన టెస్లా - మోడల్‌ Y vs BYD సీలయన్ 7 vs BMW X1 LWB లో ఏది బెస్ట్‌ కార్‌?

Tesla Model Y Launched In India: టెస్లా, తన మోడల్ Y కారును భారతదేశంలో విడుదల చేసింది. ఇది, BYD సీలయన్ 7 & BMW X1 LWB లతో డైరెక్ట్‌గా పోటీ పడుతుంది.

Tesla Model Y vs BYD Sealion 7 vs BMW X1 LWB Comparison: టెస్లా, చాలాకాలం ఎదురుచూపుల తర్వాత, ఎట్టకేలకు భారతదేశంలోకి ప్రవేశించింది. ముంబైలోని BKC (బాంద్రా-కుర్లా కాంప్లెక్స్)లో తన మొదటి షోరూమ్‌ ప్రారంభించింది & మోడల్ Y కారును ఇండియాలో లాంచ్‌ చేసింది. ఈ కారు ధరలను కూడా వెల్లడించింది. టెస్లా మోడల్ Y లాంచ్‌తో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రేసు కొత్త స్థాయికి చేరుకుంది, హీట్‌ పెరిగింది. ఎందుకంటే, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో టెస్లా ఎప్పుడూ ముందుంటుంది, దీని ప్రవేశంతో భారత్‌లోని ఇతర కంపెనీల మధ్య పోటీ మరింత పెరుగుతుంది.

టెస్లా మోడల్ Y ధర & స్పెసిఫికేషన్లు
టెస్లా మోడల్ Y భారతదేశంలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొదటి వేరియంట్ - Standard RWD, ఇది 60kWh బ్యాటరీతో పవర్‌ తీసుకుంటుంది. ఈ వేరియంట్ దాదాపు 295 bhp పవర్‌ను ఇస్తుంది & సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 500 కి.మీ. ప్రయాణిస్తుంది. దీని ఆన్-రోడ్ ధర ‍‌(Tesla Model Y Standard RWD Price) రూ. 61.07 లక్షలు. రెండో వేరియంట్ - Long Range RWD, ఇది 75kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ 622 కి.మీ వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ అందిస్తుంది & దీని ఆన్-రోడ్ ధర  ‍‌(Tesla Model Y Long Range RWD Price) రూ. 69.15 లక్షలు. మోడల్ Y కారును టెక్నాలజీ-ఫస్ట్ SUVగా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఇది ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌, ప్రీమియం సౌండ్ సిస్టమ్ & టెస్లా మొబైల్ యాప్‌తో వాహనాన్ని నియంత్రించడం వంటి స్మార్ట్ ఫీచర్‌లతో పని చేస్తుంది.

BYD సీలయన్‌ 7 పోటీ ఇస్తుందా?
BYD సీలయన్ 7 SUV భారతదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్‌ అయింది. మొదటి వేరియంట్ 82.56kWh బ్యాటరీ కలిగిన సింగిల్ మోటార్‌తో పని చేస్తుంది. ఈ వేరియంట్ దాదాపు 313 bhp పవర్‌ను & దాదాపు 482 కి.మీ. డ్రైవింగ్‌ రేంజ్‌ను ఇస్తుంది. దీని ధర రూ. 51.80 లక్షలు. రెండో వేరియంట్ డ్యూయల్ మోటార్‌తో పరుగులు తీస్తుంది, ఇది దాదాపు 530 bhp పవర్‌ ఇస్తుంది. అయితే, దీని రేంజ్‌ కొద్దిగా తగ్గుతుంది & దాదాపు 456 కి.మీ. దూరాన్ని కవర్ చేయగలదు. ఈ డ్యూయల్ మోటార్ వేరియంట్ ధర రూ.60-65 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత దాని శక్తిమంతమైన మోటార్ సెటప్ & క్విక్‌ ఏక్సిలరేషన్‌. అయితే, దీని డ్రైవింగ్‌ రేంజ్‌ టెస్లా మోడల్ Y లాంగ్ రేంజ్ వేరియంట్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది.

BMW X1 LWB రేంజ్ & ధర
BMW X1 LWB ఒక లగ్జరీ కారు. నిర్మాణంలో నాణ్యత & డ్రైవింగ్‌లో సమతుల్యతకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఇది 66.4kWh బ్యాటరీతో పని చేస్తుంది, 204 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV పరిధి దాదాపు 531 కి.మీ. ఈ కారు లాంగ్‌ డ్రైవ్‌లకు మెరుగ్గా ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 51.90 లక్షలు. రేంజ్‌ పరంగా, ఇది BYD Sealion 7 & Tesla RWD వేరియంట్‌ కంటే కంటే మెరుగ్గా ఉంటుంది.

ఏ SUV బెస్ట్‌?
ఈ మూడు ఎలక్ట్రిక్‌ SUVలను పోల్చి చూస్తే... టెస్లా మోడల్ Y లాంగ్ రేంజ్ వేరియంట్ గరిష్టంగా 622 కి.మీ. డ్రైవింగ్‌ రేంజ్‌ ఇస్తుంది. BYD సీలయన్ 7 డ్యూయల్ మోటార్ వేరియంట్ గరిష్టంగా 530 bhp పవర్‌ జనరేట్‌ చేస్తుంది. BMW X1 LWB పరిధి & ధర పరంగా బ్యాలెన్స్‌డ్‌ ఆప్షన్‌గా ఉంటుంది. టెస్లా 75kWh బ్యాటరీని కలిగి ఉంది, BYD 82.56kWh బ్యాటరీని కలిగి ఉంది & BMW 66.4kWh బ్యాటరీని కలిగి ఉంది. ధర విషయానికి వస్తే.. టెస్లా మోడల్ Y లాంగ్ రేంజ్ ధర రూ. 69.15 లక్షలు, BYD డ్యూయల్ మోటార్ వేరియంట్ అంచనా ధర రూ.60-65 లక్షలు & BMW X1 LWB ధర రూ. 51.90 లక్షలు.

తన ప్రత్యర్థులతో పోల్చినప్పుడు, మోడల్ Y కొంచెం ఖరీదుగానే కనిపిస్తుంది. ఇది సింగిల్ మోటార్‌ వేరియంట్‌, అదే సమయంలో, BYD సీలయన్ 7లో డ్యూయల్ మోటార్‌ ఉంది. ధర పరంగా BMW X1 LWB కంటే టెస్లా మోడల్‌ Y రేటు చాలా ఎక్కువ. అయితే, లాంగ్‌ రేంజ్‌ బ్యాటరీ ప్యాక్ చాలా పెద్దది & సీలయన్ 7 కంటే తక్కువ శక్తి ఇచ్చినప్పటికీ, రేంజ్‌ చాలా ఎక్కువ.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Embed widget