Tesla Car: అమెరికాలో టెస్లా కారు ధర 38 లక్షలు, ఇండియాలో 69 లక్షలు - ఒకే మోడల్‌లో ఇంత తేడా ఎందుకు?
Tesla Cars Launched in India: టెస్లా ఎలక్ట్రిక్ SUV దిల్లీ, గురుగావ్ & ముంబై నగరాల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ 2025 మూడో త్రైమాసికం (Q3 2025) నుంచి ఈ కారు డెలివరీలను ప్రారంభిస్తుంది.

Tesla Model Y Electric Car Price And Sales In India: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV "మోడల్ Y"ని లాంచ్ చేసింది & దాని ధరలను విడుదల చేసింది. ఈ ఈవెంట్, భారతదేశంలో టెస్లా అధికారిక లాంచ్‌లో పెద్ద భాగం. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా తొలి షోరూమ్ ఈ రోజు (జులై 15, 2025) ప్రారంభమైంది.
టెస్లా కార్ల ధరలు
టెస్లా మోడల్ Y రెండు వేరియంట్లలో అందుబాటులో (Standard RWD & Long Range RWD) ఉంది. Standard RWD ఆన్-రోడ్ ప్రారంభ ధర రూ. 61.07 లక్షలుగా నిర్ణయించారు. Long Range RWD వేరియంట్ ధర రూ. 69.15 లక్షలు. ఈ సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను మూడు ప్రధాన నగరాలు దిల్లీ, గురుగావ్, ముంబైలో డెలివెరీల కోసం అందుబాటులో ఉంచారు. కంపెనీ, 2025 మూడో త్రైమాసికం నుంచి ఈ డెలివరీలను ప్రారంభిస్తుంది.
భారతదేశంలో ధర ఎందుకు అంత ఎక్కువ?
అమెరికాలో, టెస్లా మోడల్ Y కారు 44 వేల 990 డాలర్ల (సుమారు 38 లక్షల రూపాయలు) ధరకు అందుబాటులో ఉంది. భారతదేశంలో దీని ధర రూ. 69.15 లక్షలు. ఒకే మోడల్ రేటు ఇండియా ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది?. దీనికి రెండు కారణాలు ఉన్నాయి, మొదటిది - దిగుమతి సుంకం. భారతదేశంలోకి వచ్చే "పూర్తి విదేశీ నిర్మిత కారు" (CBU - కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) పై 70 శాతం వరకు పన్ను విధిస్తారు. కాబట్టి, అదే మోడల్ కారుపై భారత్‌లో 21 లక్షల రూపాయలకు పైగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రెండో కారణం - చైనాలోని షాంఘై ప్లాంట్ నుంచి ముంబైకి తీసుకువచ్చే లాజిస్టిక్స్ ఖర్చు. ఇది కాకుండా, రవాణా & కస్టమ్స్‌లో కూడా భారీ ఖర్చు ఉంటుంది.
టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ కారులో.. Standard RWD వేరియంట్‌కు 60kWh LFP బ్యాటరీ అమర్చారు, ఇది దాదాపు 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది. ఈ కారు దాదాపు 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
Long Range RWD వేరియంట్ 75kWh NMC బ్యాటరీతో వచ్చింది, ఇది 622 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు. ఈ SUV 5 సెకన్ల కంటే తక్కువ సమయంలోనే 0 నుంచి 100 kmph వరకు వేగాన్ని చేరగలదు.
టెస్లా మోడల్ Y లో హై-టెక్ ఫీచర్లు
టెస్లా మోడల్ Yని, చాలా అడ్వాన్స్‌డ్ టెక్నలాజికల్ ఫీచర్లతో భారతదేశంలో లాంచ్ చేశారు. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, వెనుక సీటుకు ప్రత్యేక టచ్ స్క్రీన్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ రియర్ సీట్లు దీనిలో ఉన్నాయి. టెస్లా ప్రీమియం సౌండ్ సిస్టమ్ & రియల్-టైమ్ కంట్రోల్ ఫెసిలిటీ టెస్లా యాప్ ద్వారా అందుతుంది. ఈ లక్షణాలన్నీ టెస్లా మోడల్ Y ని టెక్నాలజీ పరంగా ఒక అడుగు ముందు ఉంచుతాయి. ఈ కారు, భారతదేశంలో, BMW X1 LWB & Volvo C40, BYD Sealion 7, Mercedes-Benz EQA వంటి వాటితో పోటీ పడుతుంది.





















