Tesla India: టెస్లా వచ్చేసింది.. ఇండియాలో కార్ల అమ్మకాలు ప్రారంభం - ధర, డెలివెరీ టైమ్‌లైన్ వివరాలు ఇవిగో!
Tesla Model Y Price: టెస్లా మోడల్ Y కార్లను పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి, భారతదేశంలో అమ్మే రేట్లలో ఈ ఖర్చు కూడా కలిపి ఉంటుంది.

Tesla Model Y Car Sales In India: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో గ్లోబల్ కంపెనీ Tesla, ఈ రోజు (జులై 15, 2025) నుంచి భారతదేశంలో నేరుగా కార్ల విక్రయాలు ప్రారంభించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా తొలి షోరూమ్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ షోరూమ్‌లో, తొలి దశలో, ఇండియాలో, టెస్లా మోడల్ Y (Tesla Model Y) కార్లను అమ్మకానికి పెడతారు. టెస్లా కార్ల విడిభాగాలు, చార్జర్లను కూడా విక్రయిస్తారు. బాంద్రా కుర్లా టెస్లా షోరూమ్‌కు సమీపంలోనే కార్ సర్వీసు సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గతంలోనే టెస్లా ప్రకటించింది.
టెస్లా మోడల్ Y - ఇండియా ధరలు & డెలివరీ టైమ్‌లైన్ (Tesla Cars In India)
టెస్లా, భారతదేశంలో అమ్మనున్న తన మొదటి కారు 'మోడల్ Y' ధరలను ప్రకటించింది. మోడల్ Y RWD మోడల్ రేటు రూ. 61.07 లక్షలు & LR RWD మోడల్ ధర రూ. 69.15 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇవి, అన్ని టాక్స్‌లు & ఖర్చులు కలుపుకున్న తర్వాత చెల్లించాల్సిన ఆన్-రోడ్ ధరలు. ప్రస్తుతం ఈ కార్లు దిల్లీ, గురుగావ్ & ముంబై నగరాలకు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ కార్లను బుక్ చేసుకున్న వాళ్లకు త్వరగా డెలివరీ ఇవ్వడానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. డెలివెరీలు, మరో రెండు నెలల్లో, సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.
మోడల్ 3 RWD కారు కేవలం 5.6 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆఫర్‌లో ఉన్న డ్రైవింగ్ రేంజ్ - LR మోడల్‌కు 622 కి.మీ & RWD స్టాండర్డ్‌కు దాదాపు 500 కి.మీ.
బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే... స్టాండర్డ్ కోసం 60kwh LFP బ్యాటరీ & LR కోసం 75kwh NMC బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
కేవలం రూ. 22,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు, అయితే ఈ డబ్బును కంపెనీ వెనక్కు ఇవ్వదు.
టెస్లా కార్లలో కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అవి:
Stealth Grey
Pearl White Multi-Coat (రూ. 95,000)
Diamond Black (రూ. 95,000)
Glacier Blue (రూ. 1,25,000)
Quicksilver (రూ. 1,85,000)
Ultra Red (రూ. 1,85,000)
మోడల్ Y ఎక్స్‌టీరియర్ & ఇంటీరియర్
మోడల్ Yని పూర్తిగా కొత్త రూపంలోకి మార్చారు, ఎక్స్‌టీరియర్ & ఇంటీరియర్‌ను రీడిజైన్ చేశారు. కారులోని వెనుక సీటుకు ప్రత్యేకంగా టచ్‌స్క్రీన్ & ఎలక్ట్రిక్ సర్దుబాటు ఫంక్షన్ వంటి మరిన్ని ఫీచర్లను యాడ్ చేశారు.
మోడల్ Y అనేది టెస్లా బ్రాండ్‌లో బెస్ట్ సెల్లర్ & ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి, భారతదేశంలో విక్రయించే ఈ కంపెనీ అమ్ముతున్న మొదటి కారు.
టెస్లా మోడల్ Y కారు... BMW X1 LWB & Volvo C40, BYD Sealion 7, Mercedes-Benz EQA వంటి వాటితో పోటీ పడుతుంది.
టెస్లా మోడల్ Y కార్లను పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి, భారతదేశంలో అమ్మే రేట్లలో ఈ ఖర్చు కూడా కలిపి ఉంటుంది.





















