అన్వేషించండి

Tesla Cybertruck: మోస్ట్ అవైటెడ్ టెస్లా సైబర్ ట్రక్ రేట్ చెప్పిన మస్క్ - అనుకున్నదానికంటే 50 శాతం ఎక్కువగా!

Tesla Cybertruck Price: టెస్లా సైబర్‌ట్రక్ ధరను కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించాడు. మనదేశ కరెన్సీలో దీని ధర రూ.51 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Tesla Cybertruck Delivery: టెస్లా నుంచి వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైబర్‌ట్రక్ (Tesla Cybertruck) ధరను కంపెనీ వెల్లడించింది. దీని ధర 60,990 డాలర్ల (సుమారు రూ. 51 లక్షలు) నుంచి ప్రారంభం కానుంది. ఈ ధర 2019లో సీఈవో ఎలాన్ మస్క్ పేర్కొన్న ధర కంటే దాదాపు 50 శాతం ఎక్కువ. ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇందులో మూడు వేరియంట్‌లు ఉన్నాయి. వీరి ధర రూ.51 లక్షల నుంచి రూ. 83 లక్షల మధ్య ఉండనుంది. ఎలాన్ మస్క్ (Elon Musk) తన సైబర్‌ట్రక్‌ను సాధారణ ట్రక్కు కంటే మెరుగైనదని, స్పోర్ట్స్ కారు కంటే వేగవంతమైనదని తెలిపాడు. అతను సైబర్‌ట్రక్‌ను వేదికపైన ప్రదర్శించాడు. తర్వాత టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది కస్టమర్‌లకు దానిని అందించాడు. దీని రూపకల్పన గురించి ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్ అని తెలిపాడు.

ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ వచ్చే ఏడాది
సైబర్‌ట్రక్ ధరలు టెస్లా వెబ్‌సైట్‌లో అయ్యాయి. దీని హైఎండ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ 'సైబర్‌బీస్ట్' వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ ట్రిమ్‌తో కూడా రానుంది. దీని ప్రారంభ ధర దాదాపు రూ. 66 లక్షల వరకు చూడవచ్చు. దీని రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ కూడా 2025లో దాదాపు రూ. 51 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది.

నాలుగేళ్ల క్రితం...
2019లో సైబర్‌ట్రక్ దాదాపు 40,000 డాలర్ల (సుమారు రూ. 33 లక్షలు) ధరతో మార్కెట్లోకి వస్తుందని ఎలాన్ మస్క్ అంచనా వేశారు. దీని తర్వాత ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు 100 డాలర్లు చెల్లించి బుక్ చేసుకున్నారు. ఇది మార్కెట్లోకి రావడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది.

ఇది టెస్లా మొదటి కొత్త మోడల్. కాబట్టి ఇది కంపెనీ తన పేరును కాపాడుకోవడానికి దీని సక్సెస్ చాలా అవసరం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విభాగంలో టెస్లా పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో అమ్మకాలను పెంచడంలో ఈ సైబర్‌ట్రక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

సైబర్‌ట్రక్ హై రేంజ్ వేరియంట్ (Tesla Cybertruck Range) ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 547 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. ఇది రేంజ్ ఎక్స్‌టెండర్ లేదా అదనపు బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. వెహికిల్ రేంజ్‌ను మరింత పెంచడంలో ఇది సహాయపడుతుంది. 2025లో టెస్లా సైబర్‌ట్రక్ ప్రతి సంవత్సరం దాదాపు 250,000 యూనిట్ల ఉత్పత్తిని చేరుకునే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫోర్డ్ ఎఫ్150 లైటెనింగ్, రివియన్ ఆటోమోటివ్ ఆర్1టీ, జనరల్ మోటార్స్ హమ్మర్ ఈవీలతో సైబర్ ట్రక్ పోటీ పడనుంది.

ఫీచర్లు ఇలా...
ఈ కారులో టెస్లా అద్భుతమైన ఫీచర్లు అందించింది. ఏకంగా గంటకు 200 కిలోమీటర్లకు పైగా టాప్ స్పీడ్‌ను ఈ కారు అందించనుంది. 845 హెచ్‌పీ పవర్‌ను ఈ కారు డెలివర్ చేయనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.6 సెకన్లలోనే అందుకోనుంది. 15 స్పీకర్ ఆడియో సిస్టంను ఈ కారులో అందించారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget