Tata Tigor 2025: మార్కెట్లోకి కొత్త టాటా టిగోర్ ఎంట్రీ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Tata Tigor 2025 Facelift On Road Price: కొత్త టాటా టిగోర్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Tata Tigor 2025 Facelift: చాలా కాలం ఎదురు చూసిన తర్వాత టాటా మోటార్స్ ఎట్టకేలకు టిగోర్ ఫేస్‌లిఫ్ట్ 2025ను లాంచ్ చేసింది. ఈ టాటా కారును ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో లాంచ్ చేయనున్నారు. టాటా మోటార్స్ తన టిగోర్ బేసిక్ షేప్, డిజైన్‌ను మార్చకుండా కాస్మొటిక్ మార్పులు చేసింది.
టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ ప్రారంభ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. దీంతో పాటు టాటా టిగోర్ 2025 పెట్రోల్ వేరియంట్‌లో రూ. 4.99 లక్షల ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అయితే టియాగో ఈవీ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలుగా ఉంది.
టాటా టిగోర్ ఫ్రంట్ గ్రిల్, బంపర్‌లో స్వల్ప డిజైన్ మార్పులు వచ్చాయి. దాని వెనుక బంపర్ గురించి చెప్పాలంటే 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ అలాగే ఉన్నప్పటికీ దీనిని తిరిగి డిజైన్ చేశారు. డిజైన్ చాలా వరకు పాత మోడల్‌తో సమానంగా ఉంటుంది. అయితే టాటా టిగోర్ ఫీచర్లలో చాలా మార్పులు చేశారు.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
టాటా టిగోర్ ఫీచర్లు ఇవే...
అప్‌డేటెడ్ టిగోర్ బేస్ మోడల్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన స్మార్ట్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది. దీంతో పాటు కొత్త ఫాబ్రిక్ సీట్లు, ఐసోఫిక్స్, వెనుక పార్కింగ్ సెన్సార్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు వంటి ఫీచర్లు కూడా బేస్ ఎక్స్ఈ ట్రిమ్ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. టియాగో 2025లో అప్‌హోల్స్టరీ, డ్రైవర్ డిస్‌ప్లే కూడా అప్‌డేట్ చేశారు. అయితే ఇది హెచ్‌డీ రివర్స్ కెమెరాతో 10.25 అంగుళాల స్క్రీన్‌ను పొందుతుంది.
దీని బేస్ ఎక్స్ఈ ట్రిమ్ స్థాయిలో కొత్త ఫాబ్రిక్ సీట్లు, ఐసోఫిక్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు కూడా లభిస్తాయి. అదే సమయంలో కొత్త టాప్ లైన్ టాటా టిగోర్ ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ వైర్‌లెస్ యాప్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, లెదర్ స్టీరింగ్ వీల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అనేక ఇతర గొప్ప ఫీచర్లను కూడా కొత్త టియాగో పొందుతుంది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Get ready to own the spotlight. The stage is set, the sedan is here to shine.
— Tata Motors Cars (@TataMotors_Cars) January 9, 2025
Click on the link to start your journey with us! - https://t.co/MAqvaU6XYe #Tigor2025 #TataTigor #TheSedanForTheStars #TataMotorsPassengerVehicles pic.twitter.com/DybT1wbOlG
Here’s to 2025!
— Tata Motors Cars (@TataMotors_Cars) December 31, 2024
With #NewForever safety, performance, and style, we promise to make every journey unforgettable.
Happy New Year!#TataMotors #TataMotorsPassengerVehicles #HappyNewYear #NewYear2025 pic.twitter.com/Lrr2jxKHEG
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

