అన్వేషించండి

Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?

రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV Pure S & Curvv EV Empowered X మధ్య ఏది బెస్ట్? రేంజ్‌, బ్యాటరీ, ఫీచర్లు, సేఫ్టీ, స్పేస్‌, ధరల పూర్తి పోలిక తెలుసుకోండి.

Tata Sierra EV vs Curvv EV: రూ.20 లక్షల బడ్జెట్‌లో కొత్త Electric SUV కొనాలని భావిస్తున్న వారికి Tata Motors రెండు బలమైన ఆప్షన్లను అందిస్తోంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన Tata Sierra EV & ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న Tata Curvv EV మధ్య ఏది కొనాలనే సందేహం చాలా మందిలో ఉంది. ధర పరంగా చూస్తే Sierra EV Pure S వేరియంట్ రూ.19.99 లక్షలు కాగా, Curvv EV Empowered X రూ.19.19 లక్షలకు అందుబాటులో ఉంది. కేవలం రూ.80 వేల తేడాతో లభించే ఈ రెండు EVల్లో ఏది ఎక్కువ విలువ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సైజు పరంగా చూస్తే Tata Sierra EV స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తుంది. Curvv EVతో పోలిస్తే ఇది పొడవు, వెడల్పు, ఎత్తు & వీల్‌బేస్‌లో పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా 170 మిల్లీమీటర్ల ఎక్కువ వీల్‌బేస్ కారణంగా వెనుక సీటు ప్రయాణికులకు మరింత లెగ్‌రూమ్ లభించే అవకాశం ఉంది. అలాగే 122 లీటర్ల అదనపు బూట్ స్పేస్‌తో పాటు 40 లీటర్లకు పైగా ఫ్రంక్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఎక్కువ సామాను తీసుకెళ్లే కుటుంబాలకు Sierra EV మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: జూన్ కార్ల అమ్మకాల్లోనూ మారుతి హవా - టాటా, మహీంద్రా హోరాహోరీ రేస్‌

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే Sierra EV Pure Sలో 63kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. Curvv EV Empowered Xలో 55kWh బ్యాటరీ ఉంటుంది. పెద్ద బ్యాటరీ కారణంగా Sierra EVకు Curvv EVతో పోలిస్తే ఏకంగా 163 కిలోమీటర్ల ఎక్కువ క్లెయిమ్డ్ రేంజ్ లభిస్తుంది. అంతేకాకుండా Sierra EV మోటార్ కూడా మరింత శక్తిమంతంగా ఉండి 44 hp ఎక్కువ పవర్ & 100 Nm ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.

ఎక్స్‌టీరియర్ ఫీచర్ల పరంగా ఈ రెండు EVలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్, 18 అంగుళాల అలాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఆధునిక ఫీచర్లు రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. అయితే Curvv EVలో మాత్రమే రూఫ్ రైల్స్ ఉంటాయి.

ఇంటీరియర్ & కంఫర్ట్ ఫీచర్లలో మాత్రం Curvv EV కొంత ముందంజలో ఉంటుంది. ఇందులో వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ డ్రైవర్ సీట్, పవర్డ్ టెయిల్‌గేట్, సబ్‌వూఫర్, లెదరెట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. అలాగే పూర్తి స్థాయి ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అందించారు. Sierra EV Pure Sలో PM2.5 ఫిల్టర్ మాత్రమే ఉంటుంది. అయితే 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, పానోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, V2L & V2V ఛార్జింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు రెండు మోడళ్లలోనూ ఒకే విధంగా లభిస్తాయి.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్‌ క్రెటా ఈవీపై భారీ తగ్గింపు! కొత్త ధరల పూర్తి వివరాలు ఇవే!

డ్రైవింగ్ టెక్నాలజీలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. రెండు EVల్లోనూ మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ & రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను నియంత్రించే ప్యాడిల్ షిఫ్టర్లు ఉంటాయి. అయితే Curvv EVలో Adaptive Cruise Control ఉండగా, Sierra EV Pure Sలో సాధారణ Cruise Control మాత్రమే అందించారు.

సేఫ్టీ విషయానికి వస్తే రెండు మోడళ్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్, TPMS, ముందు & వెనుక పార్కింగ్ సెన్సర్లు వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి. అయితే Curvv EVలో 360 డిగ్రీ కెమెరా, ఆటో డిమ్మింగ్ IRVM & Level 2 ADAS వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. ఈ విషయంలో Curvv EVకు కొంత ఆధిక్యం ఉంది.

Tata Sierra EV Pure S 63kWh ధర రూ.19.99 lakh 
Tata Curvv EV Empowered X 55kWh ధర రూ.19.19 lakh

ధరను పరిశీలిస్తే Sierra EV Pure S, Curvv EV కంటే రూ.80 వేల ఎక్కువ. కానీ ఆ అదనపు మొత్తానికి పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్, శక్తివంతమైన మోటార్, విశాలమైన క్యాబిన్ & పెద్ద బూట్ స్పేస్ లభిస్తాయి. మరోవైపు Curvv EVలో కొన్ని ప్రీమియం ఫీచర్లు & ఆధునిక సేఫ్టీ టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి.

మొత్తంగా చూస్తే... ఎక్కువ రేంజ్, విశాలమైన ఇంటీరియర్ & కుటుంబ అవసరాలకు అనువైన SUV కావాలనుకునే వారికి Tata Sierra EV Pure S మంచి ఎంపికగా నిలుస్తుంది. ప్రీమియం ఫీచర్లు, ADAS & 360 డిగ్రీ కెమెరా వంటి సౌకర్యాలకు ప్రాధాన్యం ఇచ్చే వారు Tata Curvv EV Empowered Xను కూడా పరిశీలించవచ్చు. ఓవరాల్‌గా, రూ.20 లక్షల బడ్జెట్‌లో మొత్తం విలువను పరిగణనలోకి తీసుకుంటే Tata Sierra EV Pure S మరింత ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget