అన్వేషించండి

Hyundai Creta EV:హ్యుందాయ్‌ క్రెటా ఈవీపై భారీ తగ్గింపు! కొత్త ధరల పూర్తి వివరాలు ఇవే!

Hyundai Creta Electric:హ్యుందాయ్‌ మోటార్స్‌ తమ క్రెటా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీపై బ్యాటరీ యూజ్‌ ఏ సర్వీస్‌  ఓనర్‌షిప్ ప్లాన్ ప్రకటించింది. దీని వల్ల కారు ప్రారంభ ఎక్స్‌ షోరూమ్‌ ధర 11 లక్షలకు వచ్చింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్ క్రెటా ఈవీ రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో.
  • బ్యాటరీ సేవగా, వినియోగదారుడి ప్రారంభ ఖర్చు తగ్గింది.
  • రెండు బ్యాటరీ ఎంపికలు, 510 కి.మీ.ల సుదీర్ఘ రేంజ్.
  • ఫాస్ట్ ఛార్జింగ్, ADAS, భద్రతా ఫీచర్లతో వచ్చింది.

Hyundai Creta EV:భారతీయ రహదారులపై దూసుకెళ్లే మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ హ్యందాయ్‌ క్రెటా ఇప్పుడు భారీగా ధర తగ్గించింది. దీంతో సామాన్య వినియోగదారులకి కూడా అందుబాటులో ఉండేలా 10.99 లక్షల ప్రారంభ ధరతో సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు ఈ ఈవీ పెట్రోల్‌ క్రెటా ధరతో దాదాపు సమానంగా ఉంది. 

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెట్రోల్ కార్ల కంటే 40-50 శాతం ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం కారులో ఉండే అత్యంత ఖరీదైన బ్యాటరీ ప్యాక్. కారు మొత్తం తయారీ ఖర్చులో దాదాపు 30-40 శాతం కేవలం బ్యాటరీ కోసమే వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సవాలును అధిగమించడానికి హ్యుందాయ్‌ బ్యాటరీ యాజ్‌ ఎ సర్వీస్‌ అనే వినూత్న మోడల్‌ను ప్రవేశ పెట్టింది.

ఈ విధానంలో వినియోగదారుడు కారు కొనేటప్పుడు బ్యాటరీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు బాడీకి మాత్రమే ధర చెల్లించి, బ్యాటరీని అద్దె ప్రాతిపదికన వినియోగించుకోవచ్చు. దీని వల్ల ప్రారంభ కొనుగోలు ఖర్చు దాదాపు 7 లక్షల వరకు తగ్గింది. వినియోగదారులు తాము ప్రయాణించే ప్రతి కిలోమీటర్‌కు కేవలం 3.9 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.      

ఆఫీస్‌లకు లేదా వ్యాపారాల కోసం ప్రతి రోజూ కారు వాడే వారికి ఇది ఎంతో పొదుపైన మార్గం. ట్రాఫిక్‌లో ఇంధన ఖర్చు ఎక్కువగా ఉండే నగరవాసులకు ఎలక్ట్రిక్‌ మైలేజ్‌ ఎంత కలిసి వస్తుంది. క్యాబ్‌ సర్వీస్‌లు నడిపే వారికి ఈ కిలోమీటర్ ఆధారిత రెంట్‌ ప్లాన్ నిర్వహణ భారాన్ని తగ్గిస్తుంది. 

ముఖ్యంగా బ్యాటరీ పాడైపోతుందనే భయం లేదు, వారంటీ ముగుస్తుందన్న టెన్షన్ లేదు. రీప్లేస్‌మెంట్‌ ఖర్చు ఎంత అవుతుందనే ఆందోళన లేనేలేదు. ఎందుకంటే బ్యాటరీ బాధ్యత పూర్తిగా హ్యుందాయ్‌ కంపెనీయే చూసుకుంటుంది. 

తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ, పనితీరు విషయంలో హ్యుందాయ్‌ ఎక్కా తగ్గలేదు. క్రెటా ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. షార్ట్ రేంజ్‌లో 42kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 133bhp పవర్‌ను అందిస్తూ నగర ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉంటుంది. లాంగ్‌ రేంజ్‌ దూర ప్రయాణాలు చేసే వారి కోసం 51.4kWh లిక్విడ్‌ కూల్డ్‌ లిథియం- అయాన్ బ్యాటరీని అందించారు. ఇది 169bhp పవర్‌ను 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

వేగం విషయంలోనూ ఇది అదరగొడుతోంది. లాంగ్ రేంజ్ వేరియంట్‌ కేవలం 7.9సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌ చేస్తే గరిష్టంగా 510కి.మి. వరకు ప్రయాణించవచ్చని సంస్థ స్పష్టం చేసింది. 

ఛార్జింగ్‌, లేటెస్ట్ టెక్నాలజీ

ఎలక్ట్రిక్‌ కారు కొనేవారి ప్రధాన ఆందోళన ఛార్జింగ్‌ సమయం. దీనికి పరిష్కారంగా హ్యుందాయ్‌ శక్తివంతమైన డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఇచ్చింది. దీని ద్వారా కేవలంం 39 నిమిషాల్లోనే పది శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీని నింపవచ్చు. ఇంటి వద్ద ఛార్జింగ్‌ చేసుకునే వారి కోసం హెచ్‌సీ వేరియంట్‌తోపాటు 7.4 kW వాల్‌  బాక్స్‌ ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తున్నారు. 
 
డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇందులో సింగిల్‌ పెడల్ డ్రైవ్‌ ఫీచర్‌  చేర్చారు. రీజెనరేటింగ్ బ్రేకింగ్ టెక్నాలజీతో పని చేసే ఈ ఫీచర్ వల్ల డ్రైవర్‌ కేవలం యాక్సిలరేటర్‌ పెడల్‌తోనే కారు వేగాన్ని నియంత్రించవచ్చు. ఇది ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే నగరాల్లో డ్రైవింగ్‌ అలసటను తగ్గిస్తుంది. 

లగ్జరీ ఫీచర్లు 

క్రెటా ఈవీ ఇంటీరియర్‌ ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంది. ఇందులో ఎండ కాలంలో సౌకర్యంగా ఉండేలా  వెంటిలేటెడ్‌ సీట్లు, బోస్‌ ఆడియో సిస్టమ్‌, వాయిస్ కమాండ్‌తో పని చేసే సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ద్వారా కారును ఆపరేట్ చేసే డిజిటల్‌ కీ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇందులో లెవల్‌ 2 అడాస్‌ టెక్నాలజీ ఉంది. దీనిలో 20 కంటే ఎక్కువ రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్‌వీల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, రెయిన్‌- సెన్సిగ్‌ వైపర్లు సైడ్‌ ఫుట్‌ స్టెప్స్‌ ఫెసిలిటీ ఉంది. 

Frequently Asked Questions

హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర ఎంత? దాని ప్రత్యేకత ఏమిటి?

హ్యుందాయ్‌ క్రెటా ఈవీ 10.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. బ్యాటరీ యాజ్‌ ఎ సర్వీస్‌ మోడల్‌తో బ్యాటరీకి డబ్బు చెల్లించకుండా కారు బాడీని కొని, బ్యాటరీని కిలోమీటర్ల ఆధారంగా అద్దెకు తీసుకోవచ్చు.

బ్యాటరీ యాజ్‌ ఎ సర్వీస్‌ మోడల్‌తో వినియోగదారులకు లాభం ఏమిటి?

ఈ మోడల్‌తో కారు కొనుగోలు ఖర్చు దాదాపు 7 లక్షలు తగ్గుతుంది. బ్యాటరీ పాడైపోతుందనే భయం, వారంటీ లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చుల ఆందోళన ఉండదు, ఎందుకంటే ఆ బాధ్యత పూర్తిగా హ్యుందాయ్‌దే.

క్రెటా ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఛార్జింగ్ సమయం ఎంత?

లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో గరిష్టంగా 510 కి.మీ. ప్రయాణించవచ్చు. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 39 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.

హ్యుందాయ్‌ క్రెటా ఈవీలో ఏయే బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?

క్రెటా ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. షార్ట్ రేంజ్‌లో 42kWh బ్యాటరీ ప్యాక్ (133bhp) మరియు లాంగ్‌ రేంజ్‌ కోసం 51.4kWh బ్యాటరీ ప్యాక్ (169bhp, 255Nm టార్క్) అందించబడ్డాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget