అన్వేషించండి

క్రాస్‌ఓవర్ లుక్‌, పెద్ద స్క్రీన్లు, కొత్త ప్లాట్‌ఫామ్‌! ఫోర్త్‌ జనరేషన్ Hyundai i20లో ఇవే హైలైట్స్‌

హ్యుందాయ్ i20 నాలుగో జనరేషన్‌ మోడల్‌ను బ్రెజిల్‌లో ఆవిష్కరించారు. కొత్త డిజైన్‌, పెద్ద స్క్రీన్లు, K3 ప్లాట్‌ఫామ్‌, ADAS ఫీచర్లతో వచ్చిన ఈ కారు ప్రస్తుత i20తో పోలిస్తే ఎలా భిన్నంగా ఉందో తెలుసుకోండి.

Hyundai i20 third-gen vs fourth-gen: హ్యుందాయ్‌ కంపెనీ, తన ప్రముఖ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ i20కు సంబంధించిన నాలుగో జనరేషన్‌ మోడల్‌ను బ్రెజిల్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్ముడవుతున్న మూడో జనరేషన్‌ i20తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌ డిజైన్‌, టెక్నాలజీ, ప్లాట్‌ఫామ్‌, ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులతో వచ్చింది.

డిజైన్‌లో భారీ మార్పులు

కొత్త i20ను చూస్తే ఇది సాధారణ హ్యాచ్‌బ్యాక్‌ కంటే క్రాస్‌ఓవర్‌ తరహాలో కనిపిస్తుంది. బాడీ క్లాడింగ్‌, ఎత్తైన ఫ్రంట్‌ డిజైన్‌, బోల్డ్‌ లైన్స్‌ కారణంగా SUV తరహా లుక్‌ను సొంతం చేసుకుంది.

ముందు భాగంలో Y-ఆకారపు LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, కనెక్టెడ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, పెద్ద హెక్సాగనల్‌ గ్రిల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పక్క భాగంలో కొత్త అలాయ్ వీల్స్‌, ఏటవాలుగా పైకి ఎగసిన విండో లైన్‌, బాక్సీ ప్రొఫైల్‌ కనిపిస్తాయి.

వెనుక భాగంలో కనెక్టెడ్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, కొత్త బంపర్‌, సిల్వర్‌ డిఫ్యూజర్‌ డిజైన్‌ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

సైజ్‌ కూడా పెరిగింది

ఫోర్త్‌ జనరేషన్‌ i20 పొడవు 4,130 మిల్లీమీటర్లు, వెడల్పు 1,780 మిల్లీమీటర్లు. ఇది ప్రస్తుత i20 కంటే 135 మిల్లీమీటర్లు పొడవుగా, 5 మిల్లీమీటర్లు వెడల్పుగా ఉంది. అయితే వీల్‌బేస్‌ మాత్రం 2,580 మిల్లీమీటర్లుగానే కొనసాగింది.

భారతదేశంలో ఉన్న సబ్‌-4 మీటర్‌ ట్యాక్స్‌ ప్రయోజనాలు ఈ మోడల్‌కు వర్తించకపోవచ్చు. అందుకే భారత్‌లో విడుదలయ్యే వెర్షన్‌ డిజైన్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

క్యాబిన్‌లో హైటెక్‌ ఫీచర్లు

ఇంటీరియర్‌లో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త i20లో రెండు 12.3 అంగుళాల డిజిటల్‌ స్క్రీన్లు, కొత్త స్టీరింగ్‌ వీల్‌, మెరుగైన గ్రాఫిక్స్‌తో కూడిన డిజిటల్‌ క్లస్టర్‌ అందుబాటులో ఉన్నాయి.

సెంటర్‌ కన్సోల్‌ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండగా, క్యాపాసిటివ్‌ AC కంట్రోల్స్‌, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, OTA అప్‌డేట్స్‌, లెవల్‌-2 ADAS వంటి అధునాతన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

అలాగే బూట్‌ స్పేస్‌ 346 లీటర్లకు పెరిగింది. ఇది ప్రస్తుత i20 కంటే 35 లీటర్లు ఎక్కువ.

కొత్త K3 ప్లాట్‌ఫామ్‌

నాలుగో జనరేషన్‌ i20ని హ్యుందాయ్‌ తాజా K3 ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. ఇదే ప్లాట్‌ఫామ్‌ను కొత్త తరం Kia Seltosలో కూడా ఉపయోగిస్తున్నారు. భద్రత, స్థిరత్వం పరంగా ఇది మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు.

ఇంజిన్‌ ఎంపికలు

బ్రెజిల్‌ మార్కెట్‌లో కొత్త i20 రెండు 1.0 లీటర్‌ 3-సిలిండర్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. ఒకటి నేచురల్లీ ఆస్పిరేటెడ్‌, మరొకటి టర్బో పెట్రోల్‌ యూనిట్‌. ఇవి E30 (30 శాతం ఇథనాల్‌ మిశ్రమం) ఇంధనంతో కూడా పనిచేస్తాయి.

టర్బో ఇంజిన్‌ 115 hp పవర్‌, 172 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ జతచేశారు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న i20 మాత్రం 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో మాత్రమే విక్రయిస్తున్నారు.

మొత్తంగా...

కొత్త Hyundai i20 డిజైన్‌, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా పూర్తిగా కొత్త దిశలో అడుగులు వేస్తోంది. క్రాస్‌ఓవర్‌ స్టైల్‌, పెద్ద స్క్రీన్లు, ADAS, కొత్త ప్లాట్‌ఫామ్‌ వంటి అప్‌డేట్స్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో మరింత పోటీని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భారత మార్కెట్‌కు ఇదే రూపంలో వస్తుందా లేదా అనే విషయంపై హ్యుందాయ్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్
VinFast e-scooters: విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారతీయుల కోసమే ప్రత్యేకంగా తయారీ!
వియత్నాం దేశపు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. ఇండియా కోసమే ప్రత్యేకంగా తయారీ!
Vehicle Insurance: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్‌ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
వాహన బీమా లేకుండా టోల్ ప్లాజా దాటితే SMS అలర్ట్.. రూ.10,000 వరకు జరిమానా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Embed widget