అన్వేషించండి

Next Generation Hyundai i20: హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్ రిలీజ్: వచ్చే నెలలోనే గ్లోబల్ డెబ్యూ.. సరికొత్త డిజైన్ తో రాబోతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్.. 

హ్యుండై సంస్థ తన మోస్ట్ పాపులర్ ఐ20 కార్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ ఫస్ట్ అఫీషియల్ టీజర్ ను గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్; వచ్చే నెల గ్లోబల్ డెబ్యూ.
  • ఫుల్-విడ్త్ లైట్ బార్, కర్వ్డ్ డిస్ప్లే వంటి డిజైన్ మార్పులు.
  • భారత్‌కు ప్రస్తుత ఇంజిన్‌లు, మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఆప్షన్.

Next Generation Hyundai i20 Premium Hatchback: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండై తన నెక్స్ట్ జనరేషన్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఫస్ట్ అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేసింది. వచ్చే నెలలో జరగబోయే గ్లోబల్ డెబ్యూ కంటే ముందే ఈ కార్ డిజైన్ ఎలా ఉండబోతోందో కంపెనీ ఒక హింట్ ఇచ్చింది. ఈ ఫోర్త్ జనరేషన్ ఐ20 ఆల్రెడీ అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఇండియన్ రోడ్లపై కూడా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. గ్లోబల్ లాంచ్ ముగిసిన వెంటనే ఈ సరికొత్త మోడల్ ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. హ్యుండై గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ కు అనుగుణంగా ఎన్నో మోడ్రన్ చేంజెస్ తో ఈ కార్ రానుంది.

Read Also: Zero Lompico Electric Motorcycle: జీరో లంపియాకో ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ లీక్: హీరో విడా వీఎక్స్ జెడ్ లాంటి ఫీచర్లతో రాబోతున్న కొత్త మోడల్.. అదిరిపోయే రెట్రో ఫ్యూచరిస్టిక్ లుక్..

ఫుల్ విడ్త్ లైట్ బార్ తో సరికొత్త లుక్.. 

లీకైన టీజర్ ఇమేజ్ ప్రకారం కార్ ఫ్రంట్ లైటింగ్ సిస్టమ్ లో పెద్ద మార్పులు చేశారు. కొత్త ఐ20 లో ఫుల్ విడ్త్ లైట్ బార్, వై షేప్ (Y-shaped) ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, మల్టీ ప్రొజెక్టర్ యూనిట్లతో కూడిన యాంగులర్ హెడ్‌ల్యాంప్స్ ఇచ్చారు. పాత మోడల్ లో ఉన్న పెద్ద కాస్కేడింగ్ గ్రిల్ స్థానంలో ఈసారి కాంపాక్ట్ రెక్టాంగులర్ గ్రిల్ ను అమర్చారు. దీనికి కింద వైడ్ ఎయిర్ ఇన్‌టేక్ ఉంటుంది. ఫ్రంట్ బంపర్ పై స్క్వేర్ షేప్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ ఇచ్చారు. ఇవి కారుకు మరింత షార్ప్, స్ట్రక్చర్డ్ లుక్ ను ఇస్తున్నాయి. వెనుక వైపు స్పోర్టీ లుక్ కోసం కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, స్టీప్ రియర్ విండ్‌స్క్రీన్ ఉన్నాయి.

Read Also: Green SM Electric Limo Taxi Service: ఇండియాలో గ్రీన్ ఎస్ఎమ్ ఎలక్ట్రిక్ లిమో టాక్సీ సర్వీస్ స్టార్ట్: .. విన్ ఫాస్ట్ ఈవీ కార్లతో సరికొత్త లగ్జరీ రైడింగ్..  సేవలు ఎక్క‌డ  ప్రారంభమంటే..?  

కర్వ్డ్ డిస్ప్లే తో లగ్జరీ ఇంటీరియర్.. 

కార్ లోపలి భాగంలో కూడా హ్యుండై చాలా ప్రీమియం అప్‌డేట్స్ ఇచ్చింది. టెస్ట్ వెహికల్స్ ద్వారా అందిన సమాచారం ప్రకారం ఇందులో రీడిజైన్ చేసిన డ్యాష్ బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ కలిసి ఉండేలా ఒక లగ్జరీ కర్వ్డ్ డిస్ప్లే ను అమర్చారు. దీంతో పాటు లేటెస్ట్ వెన్యూ కార్ లో ఉన్నట్లుగానే సరికొత్త స్టీరింగ్ వీల్ డిజైన్ ను ఇందులో ఉపయోగించారు. వేరియంట్లను బట్టి ఇంటీరియర్ ఫీచర్లు మారే అవకాశం ఉంది.

పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు.. 

గ్లోబల్ మార్కెట్ల కోసం ఈ కొత్త ఐ20 లో 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఆప్షన్ ను ఇవ్వనున్నారు. ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ లనే కంపెనీ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. 2030 నాటికి ఇండియాలో తన హైబ్రిడ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని హుండై ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెక్స్ట్ జనరేషన్ మోడల్ లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము.

Frequently Asked Questions

నెక్స్ట్ జనరేషన్ హ్యుండై ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టీజర్‌ను ఎప్పుడు విడుదల చేశారు?

వచ్చే నెలలో జరగబోయే గ్లోబల్ డెబ్యూ కంటే ముందే హ్యుండై నెక్స్ట్ జనరేషన్ ఐ20 టీజర్‌ను రిలీజ్ చేసింది. గ్లోబల్ లాంచ్ తర్వాత వెంటనే ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

కొత్త ఐ20 బాహ్య డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేశారు?

కొత్త ఐ20కి ఫుల్ విడ్త్ లైట్ బార్, వై షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కాంపాక్ట్ రెక్టాంగులర్ గ్రిల్ ఇచ్చారు. వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్, స్టీప్ రియర్ విండ్‌స్క్రీన్ ఉంటాయి.

నెక్స్ట్ జనరేషన్ ఐ20 ఇంటీరియర్ లోపల ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి?

నెక్స్ట్ జనరేషన్ ఐ20లో రీడిజైన్ చేసిన డ్యాష్ బోర్డ్ లేఅవుట్ ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ కలిసి ఉండే లగ్జరీ కర్వ్డ్ డిస్ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణ.

నెక్స్ట్ జనరేషన్ ఐ20లో ఎలాంటి ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి?

ఇండియాలో ప్రస్తుతమున్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను కొనసాగించవచ్చు. భవిష్యత్తులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉండే అవకాశాలున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget