అన్వేషించండి

Zero Lompico Electric Motorcycle: జీరో లంపియాకో ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ లీక్: హీరో విడా వీఎక్స్ జెడ్ లాంటి ఫీచర్లతో రాబోతున్న కొత్త మోడల్.. అదిరిపోయే రెట్రో ఫ్యూచరిస్టిక్ లుక్.. 

లీకైన డిజైన్ పేటెంట్ల ప్రకారం జీరో లంపియాకో ఎలక్ట్రిక్ బైక్ హీరో విడా వీఎక్స్ జెడ్ మెకానికల్ కాంపోనెంట్స్ ను షేర్ చేసుకుంటూ మార్కెట్ లోకి రానుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • లీకైన జీరో లంపియాకో డిజైన్, హీరో విడా భాగస్వామ్యాన్ని వెల్లడించింది.
  • విడా VxZ తో ఫ్రేమ్, సస్పెన్షన్, 40bhp మోటార్ పంచుకుంటుంది.
  • రెట్రో ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో లంపియాకో బైక్ భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది.

Zero Lompico Electric Motorcycle Design Patents: ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ లో సరికొత్త సంచలనానికి తెర లేచింది. జీరో లంపియాకో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కు సంబంధించిన డిజైన్ పేటెంట్లు ఇంటర్నెట్ లో లీకయ్యాయి. అఫీషియల్ ఎంట్రీ కంటే ముందే ప్రొడక్షన్ మోడల్ ఎలా ఉండబోతోందో ఈ డ్రాయింగ్స్ క్లియర్ గా చూపిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం ఈ లంపియాకో బైక్ హీరో విడా వీఎక్స్ జెడ్ (Hero Vida VxZ) తో మెకానికల్ కాంపోనెంట్స్ ను పంచుకోనుంది. విడా ఎక్స్ జీరో పార్ట్‌నర్‌షిప్ లో డెవలప్ అవుతున్న ఈ రెండు మోటార్ సైకిళ్ల మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ ను ఈ అప్‌డేట్ కన్ఫర్మ్ చేస్తోంది. గ్లోబల్ ఈవీ మార్కెట్ లో ఇదొక బిగ్గెస్ట్ స్టెప్ కానుంది.

Read Also: Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక

ఒకే రకమైన ట్రెల్లిస్ ఫ్రేమ్.. 

జీరో లంపియాకో, హీరో విడా వీఎక్స్ జెడ్ మోడల్స్ ఒకే ట్రెల్లిస్ ఫ్రేమ్ పై బిల్డ్ అయ్యాయి. రెండు బైకుల్లో ఒకే రకమైన వీల్స్, బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ యూఎస్‌డీ టెలిస్కోపిక్ ఫోర్క్స్, రియర్ మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. వీటితో పాటు టీఎఫ్‌టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, స్ట్రీట్ స్టైల్ హ్యాండిల్ బార్స్, స్వింగ్‌ ఆర్మ్ పై అమర్చిన నంబర్ ప్లేట్ హోల్డర్ కామన్ గా కనిపిస్తాయి. జీరో మోటార్ సైకిల్స్ ఈ లంపియాకో పవర్‌ట్రెయిన్ డిటెయిల్స్ ను కన్ఫర్మ్ చేసింది. ఇందులో 8.8 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్ తో పాటు 40 బీహెచ్‌పీ పీక్ పవర్ ఇచ్చే మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించారు.

Read Also: India First Flex Fuel WagonR: మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ..

డిఫరెంట్ డిజైన్ అప్రోచ్.. 

మెకానికల్ గా ఇవి ట్విన్స్ అయినప్పటికీ డిజైన్ పరంగా చాలా తేడాలు ఉన్నాయి. విడా వీఎక్స్ జెడ్ మోడల్ స్పోర్టీ, కాంటెంపరరీ లుక్ లో ఉంటే జీరో లంపియాకో మాత్రం బోల్డ్ రెట్రో ఫ్యూచరిస్టిక్ థీమ్ తో వస్తోంది. ఇందులో వైడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ (LED DRL), సెంట్రల్ హెడ్‌లైట్ యూనిట్, స్క్వేరిష్ టీఎఫ్‌టీ డిస్ప్లే ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్ ఉండే ఏరియాను సింగిల్ పీస్ లాగా స్పెషల్ గా డిజైన్ చేశారు. విడా రెగ్యులర్ స్టైలింగ్ తో పోలిస్తే ఇది డిఫరెంట్ విజువల్ ఐడెంటిటీని కలిగి ఉంటుంది.

ఇండియాలోనే ప్రొడక్షన్.. 

ఈ లీకైన పేటెంట్లను బట్టి జీరో లంపియాకో బైక్ ను ఇండియాలోనే హీరో మోటోకార్ప్ మాన్యుఫ్యాక్చర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ బైకులను అమెరికాకు ఎగుమతి చేస్తారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో హీరో చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్లకు, జీరో మోటార్ సైకిల్స్ తో ఉన్న పార్ట్‌నర్‌షిప్ కు ఇది సరిగ్గా సరిపోతుంది. 2023 లో హీరో సంస్థ సుమారు 60 మిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడితో ఈ రిలేషన్ స్టార్ట్ చేసింది. విడా బ్రాండ్ కేవలం స్కూటర్లకే పరిమితం కాకుండా ఎలక్ట్రిక్ బైక్ పోర్ట్‌ఫోలియోను పెంచడానికి ఈ మోడల్స్ హెల్ప్ అవుతాయి.

Frequently Asked Questions

జీరో లంపియాకో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గురించి కొత్తగా ఏంటి?

దీని డిజైన్ పేటెంట్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి, అధికారిక ఎంట్రీకి ముందే ప్రొడక్షన్ మోడల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాయి. ఈ డ్రాయింగ్స్ బైక్ రూపాన్ని వెల్లడిస్తున్నాయి.

ఈ బైక్ ఏ మోడల్ తో మెకానికల్ భాగాలను పంచుకుంటుంది?

జీరో లంపియాకో బైక్ హీరో విడా వీఎక్స్ జెడ్ (Hero Vida VxZ) తో మెకానికల్ కాంపోనెంట్స్ ను పంచుకోనుంది. ఇది విడా ఎక్స్ జీరో పార్ట్‌నర్‌షిప్ ను ధృవీకరిస్తుంది.

జీరో లంపియాకో పవర్‌ట్రెయిన్ వివరాలు ఏమిటి?

ఇందులో 8.8 kWh బ్యాటరీ ప్యాక్ మరియు 40 బీహెచ్‌పీ పీక్ పవర్ ఇచ్చే మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి.

విడా వీఎక్స్ జెడ్ తో పోలిస్తే జీరో లంపియాకో డిజైన్ ఎలా భిన్నంగా ఉంటుంది?

విడా మోడల్ స్పోర్టీ లుక్ లో ఉండగా, జీరో లంపియాకో బోల్డ్ రెట్రో-ఫ్యూచరిస్టిక్ థీమ్ తో వస్తుంది. ఇందులో వైడ్ LED DRL మరియు సెంట్రల్ హెడ్‌లైట్ యూనిట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra డార్క్ ఎడిషన్ లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్ ధర వివరాలు
Tata Sierra డార్క్ ఎడిషన్ లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్ ధర వివరాలు
మీ బడ్జెట్‌లోనే 7 సీటర్‌ MPV.. నిస్సాన్‌ గ్రావైట్‌ CNG వెర్షన్‌ నిజజీవితంలో ఎంత మైలేజ్‌ ఇస్తుందంటే?
నిస్సాన్‌ గ్రావైట్‌ CNG రివ్యూ: బడ్జెట్‌ 7-సీటర్‌కు అదిరిపోయే మైలేజ్‌.. CNG వెర్షన్‌ ఎలా ఉందంటే?
టాటా నుంచి మరో కొత్త సెడాన్‌.. Tigor ప్లేస్‌లోకి Aeris.. ఇవే హైలైట్స్‌!
టాటా టిగోర్‌కు గుడ్‌బై.. 'ఏరిస్‌'కు వెల్‌కమ్‌! సెప్టెంబర్‌ 25న టాటా కొత్త సెడాన్‌ లాంచ్‌
రూ. 2.92 లక్షల RE హిమాలయన్ 440ని కేవలం రూ.30,000 కే ఇంటికి తెచ్చుకోండి! తక్కువ వడ్డీతో EMI లెక్కలు
అడ్వెంచర్‌ బైక్‌ RE హిమాలయన్ 440ని కొంటారా? - అతి తక్కువ డౌన్‌పేమెంట్‌, తక్కువ వడ్డీకే లోన్‌!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politcis: కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
Jurala Dam Protests: జూరాల జలాలపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు.. నీళ్లు వస్తున్నాయని తెలిసి బీఆర్ఎస్ హడావుడి -మంత్రి జూపల్లి
జూరాల జలాలపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు.. నీళ్లు వస్తున్నాయని తెలిసి బీఆర్ఎస్ హడావుడి -మంత్రి జూపల్లి
Andhra Pradesh Rains: బలపడుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు! శ్రీకాకుళంలో రోడ్లన్నీ జలమయం
బలపడుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు! శ్రీకాకుళంలో రోడ్లన్నీ జలమయం
CM Chandrababu: మున్సిపల్ చరిత్రలో సువర్ణాధ్యాయం.. కుప్పం నుంచి 11,359 కోట్ల పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
మున్సిపల్ చరిత్రలో సువర్ణాధ్యాయం.. కుప్పం నుంచి 11,359 కోట్ల పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
India First Gold Triumph:  ఆసియా క్రీడల్లో ఎదురులేని భారత్, వరుసగా రెండోసారి పసిడి కైవసం.. ఫైనల్లో లంక చిత్తు.. స‌త్తా చాటిన మంధాన‌, దీప్తి 
ఆసియా క్రీడల్లో ఎదురులేని భారత్, వరుసగా రెండోసారి పసిడి కైవసం.. ఫైనల్లో లంక చిత్తు.. స‌త్తా చాటిన మంధాన‌, దీప్తి 
Adilabad Rims: ఆదిలాబాద్ రిమ్స్ ‌అగ్నిప్రమాదంలో మరో శిశువు మృతి.. మూడుకు చేరిన మరణాలు, విచారణకు సీఎం ఆదేశాలు
ఆదిలాబాద్ రిమ్స్ ‌అగ్నిప్రమాదంలో మరో శిశువు మృతి.. మూడుకు చేరిన మరణాలు, విచారణకు సీఎం ఆదేశాలు
Chiranjeevi: నా రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బెంత? నేను బ్లడ్ అమ్ముకుంటానా? విమర్శలపై మెగాస్టార్ స్పందన
నా రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బెంత? నేను బ్లడ్ అమ్ముకుంటానా? విమర్శలపై మెగాస్టార్ స్పందన
Australia Immigration Policy: ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ నిబంధనల మార్పులు.. భారతీయ విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?
ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ నిబంధనల మార్పులు.. భారతీయ విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?
Embed widget