అన్వేషించండి

Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక

ఇండియాలో కార్ మోడిఫికేషన్ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో చట్టవిరుద్ధమైన మార్పుల వల్ల ట్రాఫిక్ చలాన్లు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతదేశంలో కార్ల మోడిఫికేషన్లు ట్రెండ్, కొన్ని చట్టవిరుద్ధం.
  • శబ్దం చేసే ఎగ్జాస్ట్, ప్రెషర్ హారన్లు చట్టవిరుద్ధం, జరిమానాలు.
  • ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, డార్క్ విండో టింట్లు నిబంధనల ఉల్లంఘన.
  • బుల్ బార్లు, క్రాష్ గార్డులు భద్రతకు ప్రమాదం, నిషేధించారు.

Car Modifications That Are Illegal In India: ఇండియాలో ప్రస్తుతం కార్ మోడిఫికేషన్స్ అనేవి ఒక పెద్ద ట్రెండ్ గా మారాయి. చాలా మంది కార్ ఓనర్స్ తమ వాహనాలను అందంగా, డిఫరెంట్ గా చూపించడానికి వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. లౌడ్ ఎగ్జాస్ట్‌లు, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, డార్క్ విండో టింట్లు లాంటి మార్పులు ఇప్పుడు కామన్ అయిపోయాయి. అయితే కార్లలో చేసే ప్రతి మోడిఫికేషన్ లీగల్ కాదు. మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం కొన్ని రకాల మార్పులు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తాయి. దీనివల్ల భారీగా ట్రాఫిక్ చలాన్లు పడే ఛాన్స్ ఉంది. మోడిఫికేషన్ చేయించుకునే ముందే ఏవి లీగల్, ఏవి ఇల్లీగల్ అనే విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.

Read Also: Toyota Innova Crysta Launched: టయోటా ఇన్నోవా క్రిస్టా లాంచ్:  సరికొత్త అప్‌డేట్స్ తో వచ్చిన ప్రీమియం ఎమ్‌పీవీ కార్.. లుక్స్ తో పాటు అదిరిపోయే ఇంటీరియర్ ఫీచర్లు

శబ్ద కాలుష్యం తెచ్చే మోడిఫైడ్ ఎగ్జాస్ట్‌లు.. 

కార్లకు స్పోర్టీ సౌండ్ ఇవ్వడానికి చాలా మంది ఎగ్జాస్ట్ సిస్టమ్స్ ను మోడిఫై చేయిస్తుంటారు. ఈ మోడిఫైడ్ ఎగ్జాస్ట్‌లు డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ ను పెంచినప్పటికీ, ఇవి నిర్ణీత శబ్ద పరిమితులను దాటితే చట్టవిరుద్ధం అవుతాయి. ఇండియాలో ఇలాంటి లౌడ్ ఎగ్జాస్ట్‌లు ఉన్న ఎన్నో మోడిఫైడ్ కార్లకు ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ ఫైన్లు వేశారు. అలాగే హారన్ల విషయంలో కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. రోడ్డుపై అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రెజర్ హారన్లు, ఎయిర్ హారన్లు, మ్యూజికల్ హారన్లు వాడుతుంటారు. ఈ రకమైన మోడిఫికేషన్ పూర్తిగా ఇల్లీగల్. పర్మిసిబుల్ నాయిస్ లిమిట్స్ దాటితే పోలీసులు సదరు వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటారు.

Read Also: India First Flex Fuel WagonR: మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ.. 

ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు.. 

నంబర్ ప్లేట్లను స్టైలిష్ గా మార్చడం కూడా కార్ ఓనర్లలో ఒక ఫ్యాషన్ గా మారింది. చాలా మంది కస్టమ్ ఫాంట్లు, కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లు, డిజైనర్ రిజిస్ట్రేషన్ ప్లేట్లను వాడుతున్నారు. కానీ ఇవి గవర్నమెంట్ రూల్స్ కు విరుద్ధం. కేవలం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీలు పడతాయి. వీటితో పాటు విండోలకు బ్లాక్ ఫిల్మ్‌లు, సన్ ఫిల్మ్‌లు వేయించడం కూడా ఇల్లీగల్. ప్రైవసీ, ఎండ నుంచి రక్షణ కోసం వీటిని వాడుతున్నప్పటికీ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్షన్ సమయంలో విండో టింట్లు ఎక్కువగా ఉంటే ఫైన్ విధిస్తారు. నిర్ణీత శాతం వ‌ర‌కు ఉంటే ఓకే అని నిపుణులు చెబుతున్నారు.

సేఫ్టీకి ముప్పు తెచ్చే బుల్ బార్లు, క్రాష్ గార్డులు

ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) ఓనర్స్ తమ కార్లు మరింత రగ్గడ్ గా, పవర్‌ఫుల్ గా కనిపించడానికి ఫ్రంట్ సైడ్ బుల్ బార్లు, క్రాష్ గార్డులను అమర్చుతుంటారు. అయితే ఇవి సేఫ్టీ రెగ్యులేషన్స్ కు అస్సలు కంప్లై అవ్వవు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్లలో ఉండే ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అవ్వకుండా ఇవి అడ్డుకుంటాయి. అలాగే రోడ్డుపై వెళ్లే పాదచారులకు కూడా వీటి వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే పబ్లిక్ రోడ్లపై బుల్ బార్లు ఉన్న వాహనాలను నడపడం నిషేధించారు. ఈ రూల్స్ అన్నీ గుర్తుంచుకుని కార్లలో మార్పులు చేసుకోవడం మంచిది.

Frequently Asked Questions

ఇండియాలో అన్ని కార్ మోడిఫికేషన్లు చట్టబద్ధమా?

కాదు, మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం కొన్ని మార్పులు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తాయి. దీనివల్ల భారీగా ట్రాఫిక్ చలాన్లు పడే అవకాశం ఉంది.

కార్లలో ఏ రకమైన ఎగ్జాస్ట్ మార్పులు చట్టవిరుద్ధం?

స్పోర్టీ సౌండ్ కోసం మోడిఫై చేసే ఎగ్జాస్ట్ సిస్టమ్స్ నిర్ణీత శబ్ద పరిమితులను దాటితే చట్టవిరుద్ధం. లౌడ్ ఎగ్జాస్ట్‌లు ఉన్న కార్లకు ఫైన్లు పడతాయి.

వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు వాడటం చట్టబద్ధమేనా?

కాదు, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు వాడటం చట్టవిరుద్ధం. కస్టమ్ ఫాంట్లు, డిజైనర్ రిజిస్ట్రేషన్ ప్లేట్లు రూల్స్ కు విరుద్ధం. కేవలం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను మాత్రమే వాడాలి.

కార్లకు బుల్ బార్లు లేదా క్రాష్ గార్డులను అమర్చడం ఎందుకు నిషేధించారు?

ప్రమాదాలలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకుండా ఇవి అడ్డుకుంటాయి. అలాగే పాదచారులకు కూడా ప్రమాదం. అందుకే పబ్లిక్ రోడ్లపై వీటిని నిషేధించారు.

టాప్ హెడ్ లైన్స్

కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget